
బిగ్ బాస్ 9 తెలుగు ఎనిమిదో వారం దివ్వెల మాధురి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఎలిమినేషన్ అనంతరం బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో హీరో శివాజీతో మాధురి వాడివేడిగా సంభాషించింది. ఎక్కడా తగ్గకుండా మాధురి ఇచ్చిన సమాధానాలు శివాజీనే ఆశ్చర్యపరిచాయి. ఈ ఇంటర్వ్యూ హైలైట్స్ మీకోసం.
Key Points
బిగ్ బాస్ 9 తెలుగు నుంచి ఎనిమిదో వారం దివ్వెల మాధురి ఎలిమినేట్ అయింది.
ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో శివాజీతో వాడివేడి చర్చ జరిగింది.
"జుట్టు పట్టుకుని ఈడ్చి కొడతారా" అంటూ శివాజీ ప్రశ్నలకు మాధురి తగ్గకుండా బదులిచ్చింది.
మాధురి ధైర్యమైన సమాధానాలతో హోస్ట్ శివాజీ షాకై, దండం పెట్టాడు.
దివ్వెల మాధురి ఎలిమినేషన్ తర్వాత
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ నుంచి ఎనిమిదో వారం దివ్వెల మాధురి ఎలిమినేట్ అయింది. దీంతో బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ బజ్ ఇంటర్వ్యూకు హాజరు అయింది దివ్వెల మాధురి. హోస్ట్, హీరో శివాజీ, మాధురి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ వాడివేడిగా సాగింది. ఎక్కడా తగ్గని మాధురి హీరో శివాజీకే చుక్కలు చూపిండంతో దండం పెట్టాడు.
బిగ్ బాస్ 9 తెలుగు నుంచి మరొకరు ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం బిగ్ బాస్ తెలుగు 9 లో దివ్వెల మాధురి ఎలిమినేట్ అయింది. ఇక ఎలిమినేషన్ తర్వాత ఎలిమినేట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంటారని తెలిసిందే. అలానే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి దివ్వెల మాధురి హాజరు అయింది.
శివాజీ-మాధురి మధ్య వాడివేడి చర్చ
“హండ్రెడ్ పర్సెంట్ నేను తెలుగు ఇళ్లలోకి రావాలనుకున్నారు” అని శివాజీ అంటే “వెళ్లాను” అని మాధురి అంది. “వెళ్తే ఇంత త్వరగా ఎందుకు వస్తారు” అని శివాజీ అంటే.. “నేను రావాలని అనుకున్నాను కాబట్టే వచ్చాను” అని మాధురి బదులిచ్చింది. దానికి శివాజీ షాక్ అయిపోయాడు.
“బయట ఏంటీ జుట్టు పట్టుకుని ఈడ్చి కొడతారా. ఎలా కొడతారండి. ఈ విధంగా మాట్లాడితే ఆడియెన్స్ ఉండనిస్తారా” అని శివాజీ అన్నాడు. “ఆడియెన్స్ ప్రకారమే నేను మాట్లాడాలి అంటే” అని మాధురి చెబుతుంటే.. “మీరు అందుకే వచ్చారు కదా” అని శివాజీ అన్నాడు.
హోస్ట్ శివాజీకి చుక్కలు చూపిన మాధురి
“కూర్చోకపోతే మాట్లాడరా అనే మాట తప్పా” అని ఎక్కడా తగ్గకుండా మాధురి సమాధానం ఇచ్చింది. దానికి శివాజీ షాక్ అయ్యాడు. “మీరు హౌజ్‌లో కూర్చుని చేసిన ప్రతి ఆర్గ్యుమెంట్ టెర్రిఫిక్‌గా ఉంది” అని శివాజీ చెబుతుంటే.. “మీకా” అని పంచ్ ఇచ్చింది మాధురి.
మొత్తంగా, దివ్వెల మాధురి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ వాడివేడిగా, ఆసక్తికరంగా సాగింది. తన అభిప్రాయాలపై ఎక్కడా వెనకడుగు వేయని మాధురి, శివాజీకి సైతం ఊహించని షాకులిచ్చింది. బిగ్ బాస్ ప్రేక్షకులకు ఈ చర్చ ఎంతో వినోదాన్ని పంచింది.


