|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎక్స్ షాకింగ్ నిర్ణయం! డిస్‌లైక్ బటన్ వచ్చేసింది! మీ ఆదాయానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా?

Published: 19-03-2026, 5:35 AM
ఎక్స్ షాకింగ్ నిర్ణయం! డిస్‌లైక్ బటన్ వచ్చేసింది! మీ ఆదాయానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా?
  • ఎక్స్ ప్లాట్‌ఫామ్ స్పామ్, నాణ్యత లేని కంటెంట్‌పై మానిటైజేషన్‌ను నిలిపివేయనుంది.
  • రిప్లై సెక్షన్లలో డిస్‌లైక్ బటన్‌ను ప్రవేశపెట్టింది, ఇది యూజర్లకు వెంటనే కనిపించదు.
  • స్పామ్ కంటెంట్‌ను పోస్ట్ చేస్తే మీ ఖాతా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి.
  • కొత్త అల్గారిథం ద్వారా తప్పుదారి పట్టించే పోస్టులపై ఎంగేజ్‌మెంట్ తగ్గిస్తారు.

ఎక్స్ యూజర్లకు ఒక ముఖ్యమైన అప్‌డేట్. ఎక్స్ ప్లాట్‌ఫామ్ స్పామ్ మరియు నాణ్యత లేని కంటెంట్‌పై మానిటైజేషన్‌ను నిలిపివేయనుంది. అంతేకాకుండా, డిస్‌లైక్ బటన్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం.

డిస్‌లైక్ బటన్ ఎలా పనిచేస్తుంది?

X Dislike Button : ఎలన్ మస్క్ ఎక్స్ ప్లాట్‌ఫామ్ స్పామ్, క్వాలిటీ లేని కంటెంట్‌పై మానిటైజేషన్‌ నిలిపివేయనుంది. డిస్‌లైక్ బటన్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ రెండు మార్పులతో ఎక్స్ యూజర్లపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

X Dislike Button : ఎక్స్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఎక్స్ వేదికగా డబ్బులు సంపాదించే కంటెంట్ క్రియేటర్లకు షాకింగ్ న్యూస్.. ఇకపై ఇలాంటి కంటెంట్ ద్వారా మానిటైజేషన్ పొందలేరు. క్వాలిటీ లేని కంటెంట్ పోస్టు చేసినా పైసా కూడా సంపాదించలేరు.

అమెరికన్ బిలియనీర్ ఎలన్ మస్క్ కంపెనీ ఎక్స్ భారీగా మార్పులు చేస్తోంది. స్పామ్ కంటెంట్ ద్వారా ఇప్పటినుంచి డబ్బు రావు. స్పామ్ కంటెంట్ పబ్లీష్ చేసినా మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది జాగ్రత్త.. అంతేకాదు.. ఎక్స్ వేదికగా డిస్‌లైక్ బటన్‌ కూడా ప్రవేశపెట్టింది. డిస్ లైక్ బటన్ ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

స్పామ్ కంటెంట్‌పై ఇక డబ్బులు రావు!

డిస్‌లైక్ బటన్ ఎలా పనిచేస్తుంది? : కొత్త డిస్‌లైక్ బటన్ ప్రస్తుతం కేవలం రిప్లై లేదా కామెంట్ సెక్షన్లలో మాత్రమే కనిపిస్తుంది. హార్ట్ సింబల్ లేదా థంబ్స్ డౌన్ ఐకాన్ మాదిరిగా ఉంటుంది. ఈ బటన్ ద్వారా వచ్చిన డిస్‌లైక్‌ల సంఖ్య బయటకు కనిపించదు.

రిప్లయ్, స్పామ్ లేదా క్వాలిటీ లేని కామెంట్లను నివారించేందుకు ప్లాట్‌ఫారమ్ అల్గోరిథం మాత్రమే ఉపయోగిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం యూజర్ల అందరికి అందుబాటులో లేదు. ఎక్స్ సర్వర్-సైడ్ కంట్రోలింగ్ ద్వారా ప్రాంతాల వారీగా క్రమంగా రిలీజ్ చేస్తోంది.

Read Also : Vivo T5x 5G : 7200mAh బ్యాటరీ, AI ఫీచర్లు, 50MP కెమెరాతో వివో T5x 5G అదుర్స్.. ధర మీ బడ్జెట్‌లోనే..!

ఎక్స్ తీసుకుంటున్న చర్యలు ఏమిటి?

స్పామ్ కంటెంట్‌పై మీకు డబ్బు రాదు : ఎక్స్ సంస్థ ప్రొడక్ట్ హెడ్ నికితా బీర్ మాట్లాడుతూ.. రాబోయే 30 రోజుల్లో ప్లాట్‌ఫారమ్‌పై స్పామింగ్ ద్వారా డబ్బులు రావడం భారీగా తగ్గుతుందని అన్నారు. ఇప్పటివరకు, చాలా మంది వివాదాస్పద లేదా తప్పుదారి పట్టించే పోస్టులు, స్పామ్ కామెంట్లతో వ్యూలు, ఎంగేజ్‌మెంట్‌ను షేర్ చేశారు.

తద్వారా రెవెన్యూ షేరింగ్ లేదా ఇతర మార్గాల ద్వారా డబ్బు సంపాదించారు. అయితే ఎక్స్ అల్గారిథం, మానిటైజేషన్ మోడల్‌లో మార్పులు చేస్తోంది. స్పామ్ లేదా క్వాలిటీ లేని కంటెంట్ తగ్గనుంది. ఇలాంటి కంటెంట్ ద్వారా సంపాదించే అవకాశం కూడా పోతుంది.

ఈ మార్పులు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే.. ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌పై స్పామ్, బాట్ అకౌంట్లు, ఫేక్ ఎంగేజ్‌మెంట్‌ భారీగా తగ్గుతుంది. యూజర్లకు ఒరిజినల్ కంటెంట్‌ మాత్రమే చూడగలరు. క్వాలిటీ కంటెంట్ మాత్రమే ఆదాయం తెచ్చిపెడుతుంది. ఇప్పటికే మస్క్ కంపెనీ కంటెంట్ క్రియేటర్లకు మెసేజ్ కూడా పంపుతుంది. అయితే, స్పామ్, తప్పుదారి పట్టించే కంటెంట్‌ను పోస్ట్ చేసే వారు భారీగా నష్టపోతారు.

ఎక్స్ తీసుకుంటున్న ఈ చర్యల ద్వారా స్పామ్ కంటెంట్ తగ్గి, నిజమైన కంటెంట్‌కు ప్రాధాన్యత లభిస్తుందని ఆశిస్తున్నారు. రాబోయే రోజుల్లో దీని ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.