
యామీ గౌతమ్ తాజా ఇంటర్వ్యూలో తన సినిమా పాత్రలపై ఉన్న అంకితభావాన్ని వివరించింది. ఒక పాత్రకు కమిట్ అయ్యాక, తన సమయాన్ని పూర్తిగా దానికే అంకితం చేస్తుందని, సోషల్ మీడియాకు దూరంగా ఉంటుందని తెలిపింది.
Key Points
కమిట్ అయిన పాత్రలకు పూర్తి ఫోకస్ ఇస్తుంది యామీ.
షూటింగ్ సమయంలో సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది.
ప్రతి పాత్రకు న్యాయం చేయడమే తన లక్ష్యమని చెబుతోంది.
యామీ గౌతమ్ యొక్క కెరీర్
యామీ గౌతమ్(Yami Gautam) ‘గౌరవం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చింది. ఆ తర్వాత ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ మూవీలో నటించింది కానీ పెద్దగా ఫేమ్ రాబట్టుకోలేకపోయింది. ఆ తర్వాత హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో వరుస చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఇటీవల ‘ధూమ్ ధామ్’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘ధురందర్’(Dhurandar) మూవీ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉంది. జీ స్టూడియోస్ బ్యానర్‌పూ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్(Sanjay Dutt), అక్షయ్ ఖన్నా, ఆదిత్య ఆధార్, జ్యోతి దేశ్ పాండే(Jyoti Deshpande), మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
పాత్రల ఎంపికపై ఆమె అభిప్రాయాలు
ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యామీ గౌతమ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నేను నిర్మాతలకు ఎప్పుడూ ఒకే విషయం చెబుతాను. కథను చెబితే వినడం కన్నా చదవడానికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. స్క్రిప్ట్ రాసిన విధానం వల్ల ఆ పాత్రలో నన్ను నేను ఊహించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటుంటాను. ఒకవేళ పాత్ర బలంగా అనిపిస్తే స్క్రిప్ట్ మొత్తం చదవకుండానే చాలా ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నాను.
షూటింగ్ సమయంలో ఆమె విధానం
కానీ ఒకసారి ఓ పాత్రకు కమిట్ అయితే మాత్రం దాని మీద పూర్తి ఫోకస్ పెడతా. నా టైమ్ మొత్తాన్ని దానికి ఉపయోగిస్తాను. అందుకే షూటింగ్ సమయంలో సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటా. ఫోన్‌లో కూడా సమయం గడపను. ఎందుకంటే నేను ఏదైనా సినిమా ఓకే చేస్తే నా పాత్రకు వందశాతం న్యాయం చేయాలని డిసైడ్ అవుతాను. అదే నా లక్ష్యం’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
చివరగా, యామీ గౌతమ్ తన పనితీరుపై ఉన్న అంకితభావాన్ని, ప్రతి పాత్రకు న్యాయం చేయాలనే తన కోరికను వెల్లడించింది. ఆమె నిబద్ధత ప్రేక్షకులను ఆకర్షిస్తుంది.


