|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్! హీరో అశ్విన్ కుమార్‌కు అవమానం! ‘హాట్‌స్పాట్-2’తో రీఎంట్రీ! వైరల్ న్యూస్!

Published: 21-01-2026, 5:05 AM
షాకింగ్! హీరో అశ్విన్ కుమార్‌కు అవమానం! 'హాట్‌స్పాట్-2'తో రీఎంట్రీ! వైరల్ న్యూస్!
  • యంగ్ హీరో అశ్విన్ కుమార్‌కు చేదు అనుభవం! రిపోర్టర్ ప్రశ్నతో ఒక్కసారిగా షాక్!
  • ‘ఎన్న సొల్ల పొగిరై’ మూవీ సమయంలో 40 కథలు విన్నానని చెప్పిన అశ్విన్.
  • ‘హాట్‌స్పాట్-2’తో రీఎంట్రీకి సిద్ధమైన అశ్విన్ కుమార్! జనవరి 23న విడుదల.
  • విఘ్నేష్ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం! తంబి రామయ్య, ప్రియా భవాని శంకర్ కీలక పాత్రలు.

కోలీవుడ్ యంగ్ హీరో అశ్విన్ కుమార్ గురించి ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. ఒకప్పుడు చేసిన కామెంట్లకు ఇప్పుడు మళ్లీ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ‘హాట్‌స్పాట్-2’ మూవీతో రీఎంట్రీ ఇస్తున్నాడు.

అశ్విన్ కుమార్‌కు చేదు అనుభవం.. రిపోర్టర్ ప్రశ్న!

కోలీవుడ్ యంగ్ హీరో అశ్విన్ కుమార్ (Ashwin Kumar)చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక తెలుగులో ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఇక 2022లో ‘ఎన్న సొల్ల పొగిరై’ (Enna Solla Pogirai)మూవీ సమయంలో అశ్విన్ ఒకేరోజు 40 కథలు విన్నానని.. అవి చప్పగా ఉండటంతో సగంలోనే నిద్రపోయానని కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అది కాస్ వివాదాస్పదం కావడంతో విమర్శలు వచ్చాయి. దీంతో ఎవరినీ బాధపెట్టాలని ఉద్దేశం తనకు లేదని క్షమాపణలు చెప్పాడు. తాజాగా, ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. హీరో అశ్విన్ కుమార్ ఓ కార్యక్రమంలో పాల్గొనగా.. ఇందులో ఓ రిపోర్టర్ దారుణంగా అవమానించాడు. దీంతో వెంటనే అశ్విన్ స్పందిస్తూ.. మీరెప్పుడూ సినిమా చూసేటప్పుడు థియేటర్‌లో నిద్రపోలేదా? అని కౌంటర్ ఇచ్చాడు. అప్పుడేదో 40 కథలు చెప్పేసరికి నిద్రపోయాను.

బహుశా ఆ సంఖ్య 40 కన్నా ఎక్కువే ఉండొచ్చు.. తక్కువ కూడా ఉండొచ్చు. అయినా దానిపై గతంలోనే క్లారిటీ ఇచ్చాను. అయినప్పటికీ మళ్లీ మళ్లీ అదే ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు. నన్ను అవమానించడానికా?బాధపెట్టడానికా? అని ఫైర్ అయ్యాడు. కాగా.. దాదాపు రెండేళ్ల తర్వాత ‘హాట్‌స్పాట్-2’తో రాబోతున్నాడు. విఘ్నేష్ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తంబి రామయ్య, ఆదిత్య భాస్కర్, ప్రియా భవాని శంకర్, భవాని శ్రీ, సంజన తివారి, భాస్కర్,రక్షన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా గత ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘హాట్ స్పాట్’కు సీక్వెల్‌గా రాబోతుంది. అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 23న థియేటర్స్‌లోకి రానుంది.

‘హాట్‌స్పాట్-2’తో రీఎంట్రీకి సిద్ధమైన హీరో!

జనవరి 23న విడుదల.. భారీ అంచనాలు!

అశ్విన్ కుమార్ ‘హాట్‌స్పాట్-2’ మూవీతో మళ్లీ తన సత్తా చాటడానికి వస్తున్నాడు. ఈ సినిమా ఎలా ఉంటుందో చూడటానికి అందరూ ఆసక్తిగా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.