
అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా సూపర్ హిట్ ‘పుష్ప’ సినిమాలోని షెకావత్ పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలిసిందా? ఈ పాత్రను మొదట ఓ యంగ్ హీరోకు ఆఫర్ చేశారట. ఆయన ఎవరో, ఆ పాత్ర ఎలా ఫహద్ ఫాజిల్ చేతికి వెళ్లిందో ఇప్పుడు చూద్దాం.
Key Points
పుష్ప సినిమాలోని షెకావత్ పాత్రకు నారా రోహిత్ మొదట ఎంపిక.
రోహిత్ ఏ కారణం చేతనో ఆ అవకాశాన్ని వదులుకున్నారు.
ఫహద్ ఫాజిల్ ఆ పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు.
నారా రోహిత్ తాజాగా 'భైరవం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
షెకావత్ పాత్రకు నారా రోహిత్ మొదటి ఎంపిక
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’, పుష్ప 2′. ఈ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో విజయం సాధించాయి. దర్శకుడు సుకుమార్ తన మార్క్ తో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్‌టైనర్లు ప్రేక్షకుల్ని పూర్తిగా ఆకట్టుకున్నాయి. పుష్పరాజ్ గా అల్లు అర్జున్ ఎంత అద్భుతంగా నటించాడో, నాగవల్లిగా అంతకు మించిన యాక్టింగ్ చేసింది హీరోయిన్ రష్మిక మందన్న.
అయితే ఈ సినిమాలో ప్రత్యేకించి విలన్ పాత్రలో నటించిన మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ తన నటనతో పాన్ ఇండియాను మెప్పించాడు. టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్యారెక్టర్ కు ఆయన అయితేనే న్యాయం చేస్తాడు అనేట్టుగా పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు ఫహాద్. అయితే ఇండస్ట్రీ సమాచారం ప్రకారం షెకావత్ పాత్ర చేయాల్సింది ఫహాద్ కాదని తెలుస్తోంది.
రోహిత్ నిర్ణయం వెనుక కారణాలు
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఫహాద్ పోషించిన భన్వర్ సింగ్ షెకావత్ పాత్రను ముందుగా టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ కు ఆఫర్ చేశారట. ఈ విషయాన్ని స్వయంగా నారా రోహిత్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, ఎందుకో ఆయన ఆ సమయంలో ఈ ప్రాజెక్ట్‌ను ఓకే చేయలేకపోయారు. దాంతో ఈ పాత్ర ఫహాద్ ఫాజిల్ చేతిలోకి వెళ్లింది. ఆ పాత్రలో తనదైన ముద్రవేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు మలయాళ హీరో.
ఈ వార్త తెలిసిన తర్వాత నారా రోహిత్ అభిమానులు కొంత వరకూ నిరాశ చెందారు ఎందుకంటే ‘పుష్ప’లాంటి భారీ బ్లాక్ బస్టర్ లో ముఖ్యమైన పాత్రను పోషించడానికి అవకాశం వస్తే వదులుకున్నాడేంటి అని గుసగుసలాడుకుంటున్నారు. ఇక తాజాగా భైరవం’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు రోహిత్. ఈ సినిమాలో అతని పాత్ర అంద్భుతంగా ఉందని ప్రశంసలు వినిపిస్తున్నాయి.
ఫహద్ ఫాజిల్ ఘన విజయం
యాక్టింగ్ కు చాలా గ్యాప్ ఇచ్చిన నారా రోహిత్ రీసెంట్ గా మళ్లీ యాక్టీవ్ అవుతున్నాడు. వరుస సినిమాలకు సైన్ చేస్తున్నాడు. ఇక నారా రోహిత్ భవిష్యత్తు ప్రాజెక్టులపై అభిమానుల్లో కూడా నమ్మకం పెరిగింది.
చివరగా, నారా రోహిత్ ‘పుష్ప’లోని షెకావత్ పాత్రను వదులుకోవడం బాధాకరం అయినప్పటికీ, ఫహద్ ఫాజిల్ ఆ పాత్రకు న్యాయం చేశారు. రోహిత్ తన భవిష్యత్తు సినిమాలతో మంచి విజయం సాధిస్తాడని ఆశిద్దాం.


