
ఢిల్లీలో జరిగిన సీజేపీ నిరసనలో ఓ యువకుడు ప్రధాని మోడీని ఉద్దేశించి తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పాటు చంపేస్తానని బెదిరించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. నెటిజన్లు యువకుడి తీరుపై మండిపడుతున్నారు.
Key Points
ఢిల్లీలో సీజేపీ ఆందోళనలో ప్రధాని మోడీని యువకుడు బూతులు తిడుతూ బెదిరించాడు.
మోడీని చంపేస్తానని హెచ్చరించిన వీడియో వైరల్‌గా మారింది.
నెటిజన్లు యువకుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శాంతియుత నిరసనను కోరారు.
సీజేపీ నాయకులు తమ నిరసన శాంతియుతమని, ఘర్షణలకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
మోడీపై యువకుడి అనుచిత వ్యాఖ్యలు
ఢిల్లీలో సీజేపీ ఆందోళన జరుగుతున్న సమయంలో ఓ యువకుడు బూతులతో రెచ్చిపోయాడు. ఏకంగా ప్రధాని మోడీనే బూతులు తిడుతూ ఆగ్రహంతో ఊగిపోయాడు. మోడీ నువ్వు నాకు దొరికితే వదిలిపెట్టను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిన్న కాల్చి చంపేస్తా అంటూ హెచ్చరించాడు. అంతేకాకుండా రాయలేని భాషలో బూతులు తిట్టాడు. మోడీ తల్లిని కూడా దూషించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు యువకుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసన శాంతియుతంగా చేయాలని ఇలా బూతులు తిట్టడంవల్ల అసలైన విద్యార్థులు నష్టపోతారని మండిపడుతున్నారు.
మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజిత్ దీప్కే ఇప్పటికే తాము దేశభక్తులం అని శాంతియుతంగానే నిరసన తెలుపుతున్నామని ప్రకటంచాడు. జంతర్ మంతర్ వద్ద తప్ప ఢిల్లీలో మరెక్కడా తాము నిరసన వ్యక్తం చేయడంలేదని అన్నాడు. ఎవరైనా సీజేపీ పేరుతో ఘర్షణలకు పాల్పడితే సీజేపీకి వారితో సంబంధం లేదని స్పష్టం చేశాడు. నిన్న పోలీసులు తమపై లాఠీ ఛార్జ్ చేసినా తాము మాత్రం ఎలాంటి ఎదురుదాడి చేయలేదని శాంతియుతంగానే ఉన్నామని చెప్పాడు.
నెటిజన్ల ఆగ్రహం, శాంతియుత నిరసన ఆవశ్యకత
సీజేపీ నాయకుల స్పష్టత, ఘటనపై వివరణ
ఈ ఘటన నిరసనల స్వరూపంపై, వ్యక్తుల బాధ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. శాంతియుత మార్గంలోనే తమ నిరసనను వ్యక్తం చేయాలని సీజేపీ నాయకులు కోరుతున్నారు. ఈ వివాదం రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది.


