|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

12A Railway Colony OTT: ఓటీటీకి వచ్చేసిన 12ఏ రైల్వే కాలనీ.. స్ట్రీమింగ్ ఎక్కడ అంటే?

Updated: 11-12-2025, 12:49 AM
12A Railway Colony OTT: ఓటీటీకి వచ్చేసిన 12ఏ రైల్వే కాలనీ.. స్ట్రీమింగ్ ఎక్కడ అంటే?
  • అల్లరి నరేష్ నటించిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ’12ఏ రైల్వే కాలనీ’.
  • నవంబర్ 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.
  • రొటీన్ కథనం కారణంగా ప్రేక్షకులు ఈ మూవీని రిజెక్ట్ చేశారు.
  • డిసెంబర్ 10 నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

అల్లరి నరేష్ నటించిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ’12ఏ రైల్వే కాలనీ’ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో ఆశించిన విజయం సాధించలేకపోయిన ఈ చిత్రం, ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. డిసెంబర్ 10 నుండి అందుబాటులో ఉన్న ఈ సినిమా వివరాలు తెలుసుకోండి.

సినిమా కథాంశం & తారాగణం

12A Railway Colony OTT: అల్లరి నరేష్ రీసెంట్ సినిమా ’12ఏ రైల్వే కాలనీ(12A Railway Colony OTT)’. సూపర్ నేచురల్ థ్రిల్లర్ అండ్ హారర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు నాని కసరగడ్డ తెరకెక్కించగా.. కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటించింది. అల్లరి నరేష్ లాంటి హీరో మొదటి సారి హారర్ కాన్సెప్ట్ లో సినిమా చేయడం, అదికూడా పొలిమేర లాంటి దర్శకుడు ఈ సినిమాకు కథను అందించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకునేలా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. నవంబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

థియేట్రికల్ రెస్పాన్స్ & ఓటీటీ డీల్

Ashu Reddy: ఎద గుత్తులతో మత్తెక్కిస్తున్న ఆషు రెడ్డి.. హాట్ ఫోటోలు

ఇప్పుడు ఎక్కడ చూడవచ్చు?

కానీ, అనుకున్నంతగా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది ఈ మూవీ. రొటీన్ కథ, కథనంతో వచ్చిన ఈ సినిమాను ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. దీంతో నెల రోజులు కూడా గడవక ముందే ఈ సినిమాను ఓటీటీకి తీసుకువచ్చారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ 12ఏ రైల్వే కాలనీ ఓటీటీ హక్కులను దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 10 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తోంది. మరి ఈ సినిమాను థియేటర్స్ లో మిస్ అయినవాళ్లు వెంటనే అమెజాన్ ప్రైమ్ లో చూసేయండి.

12ఏ రైల్వే కాలనీ సినిమా థియేటర్లలో చూడలేని వారు, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ద్వారా ఇంట్లో కూర్చునే ఈ హారర్ థ్రిల్లర్‌ను ఎంజాయ్ చేయవచ్చు. మిస్ అయిన వాళ్లు వెంటనే చూసేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.