|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అల్లు శిరీష్ పెళ్లిలో రాజకీయ సందడి! రేవంత్ రెడ్డి రాకతో అల్లు అర్జున్ గ్రాండ్ వెల్కమ్!

Published: 06-03-2026, 1:35 PM
అల్లు శిరీష్ పెళ్లిలో రాజకీయ సందడి! రేవంత్ రెడ్డి రాకతో అల్లు అర్జున్ గ్రాండ్ వెల్కమ్!
  • అల్లు శిరీష్, నయనిక రెడ్డి వివాహానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
  • గతంలో జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటూ అల్లు అర్జున్ సీఎంను సాదరంగా ఆహ్వానించారు.
  • వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డితో అల్లు అర్జున్ ముచ్చటించారు.
  • విజయ్ దేవరకొండ ఇంటికి స్వయంగా వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వదించిన విషయం తెలిసిందే.

అల్లు శిరీష్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అల్లు అర్జున్ ఆయనను సాదరంగా ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అల్లు శిరీష్ వివాహానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

Allu Family Wedding: అల్లు వారింట పెళ్లి వేడుకలు (Allu Family Wedding) అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. అల్లు అరవింద్ (Allu Aravind) చిన్న కుమారుడు, అల్లు అర్జున్ (Allu Arjun) సోదరుడైన అల్లు శిరీష్ (Allu Sirish) తన ప్రేయసి నయనిక రెడ్డి (Nayanika Reddy) తో మార్చి 6న ఏడు అడుగులు వేయబోతున్న విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల నడుమ ఈ పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరుగుతోంది. ఈ పెళ్లికి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని తెలిసి, అల్లు ఫ్యామిలీ మొత్తం ఆయనను రిసీవ్ చేసుకోవడానికి బయటకు వచ్చారు. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ ఈసారి ఎటువంటి తప్పు చేయలేదు.

గత తప్పిదం సరిదిద్దుకున్న అల్లు అర్జున్

సీఎం రేవంత్ రెడ్డికి ఎదురెళ్లి మరీ అల్లు అర్జున్ ఆహ్వానించారు. గతంలో ఓ వేడుకపై సీఎం రేవంత్ రెడ్డి పేరు మరిచిపోయిన అల్లు అర్జున్.. ఈసారి మాత్రం ఎటువంటి పొరపాటు చేయకుండా, గ్రాండ్‌గా వెల్‌కమ్ పలికారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. వేదిక వద్ద కూడా సీఎం పక్కనే కూర్చుని.. చేతిలో చెయ్యేసి మరీ కబుర్లు చెప్పారు. వారి పక్కన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. ఇక ఈ ఫొటోలను అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. రీసెంట్‌గా సీఎం రేవంత్ రెడ్డి.. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మికల రిసెప్షన్‌కు హాజరు కాలేదని, స్వయంగా ఇంటికి వెళ్లి మరీ వారిని ఆశీర్వదించిన విషయం తెలిసిందే. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే తమ ఇంటికి రావడంతో విజయ్ ఫ్యామిలీ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.

వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు

ఇప్పుడు అల్లు ఫ్యామిలీ కూడా సీఎం రాకతో ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది. అల్లు శిరీష్ విషయానికి వస్తే.. గత కొన్ని రోజులుగా అల్లు వారింట శిరీష్ పెళ్లి సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. మార్చి 2వ తేదీన హైదరాబాద్‌లో ఘనంగా ప్రీ వెడ్డింగ్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలెందరో హాజరై, నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పెళ్లి వేడుకను కూడా అల్లు అరవింద్ ఎంతో గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు.

అల్లు వారింట జరిగిన ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అల్లు అర్జున్ మర్యాదపూర్వకంగా వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.