
📌 Key Points
- హీరో అర్జున్ తన 46 ఏళ్ల సినీ జీవితంలో నమ్మిన వాళ్ళ చేతిలో మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
- పెట్టుబడుల విషయంలో తన చుట్టూ ఉన్నవారే తప్పుదోవ పట్టించారని అర్జున్ తెలిపారు.
- శోభన్ బాబు పెట్టుబడుల గురించి సలహాలు ఇచ్చినా వినలేదని అర్జున్ గుర్తు చేసుకున్నారు.
- 63 ఏళ్ల వయసులో కూడా ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఇంటి భోజనం, వ్యాయామం చేయడమేనని అర్జున్ చెప్పారు.
హీరో అర్జున్ తన సినీ జీవితంలో ఎదురైన మోసాల గురించి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, తన 46 ఏళ్ల కెరీర్‌లో నమ్మిన వారే మోసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడుల విషయంలో జరిగిన నష్టాన్ని ఆయన వివరించారు.
నమ్మిన వారే మోసం చేశారన్న అర్జున్
Hero Arjun:సినీ పరిశ్రమలో మోసం చేయడం.. మోసపోవడం అత్యంత కామన్ గా కనిపించే అంశం. అయితే ముఖ్యంగా నమ్మినవాళ్లే మోసం చేయడం అన్నది ఎదుటివారిని తీవ్ర మనస్థాపానికి గురిచేస్తుందనటంలో సందేహం లేదు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు నమ్మిన వారే మోసం చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ జాబితాలోకి యాక్షన్ హీరో అర్జున్ (Arjun )కూడా వచ్చి చేరారు. తన 46 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎంతోమంది చేతుల్లో నమ్మి మోసపోయాను అని ఆవేదన వ్యక్తం చేశారు. మరి అర్జున్ మోసపోవడానికి కారణం ఏమిటి? అసలు ఏం జరిగింది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్జున్ మాట్లాడుతూ.. “46 ఏళ్ల నా సినీ ప్రయాణంలో నేను అసలు పెట్టబడులు పెట్టలేదు. ముఖ్యంగా నేను పేర్లు చెప్పదలుచుకోలేదు.. కానీ చాలామంది నన్ను మోసం చేశారు. పైగా ఇండస్ట్రీలో నా చుట్టూ ఉండే మనుషులే నాకు ఏమీ తెలియని వయసులో నాతో పెట్టుబడి పెట్టించి నన్ను మిస్ లీడ్ చేశారు. ముఖ్యంగా డబ్బు వస్తోంది ఎక్కడ పెట్టాలో తెలియదు.. నన్ను ఎవరు మిస్ లీడ్ చేస్తున్నారో తెలియదు. అప్పుడు నేను పెట్టుబడి పెట్టి ఉంటే ఈరోజు ఆ ప్రాపర్టీ మరో రేంజ్ లో ఉండేది” అంటూ తెలిపారు. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో శోభన్ బాబు ఎన్నో సలహాలు ఇచ్చినా అర్జున్ వినలేదట. ఇక తెలిసీ తెలియని వయసులో శోభన్ బాబు మాటలు తాను పట్టించుకోలేదని.. ఇప్పుడు జ్ఞానోదయం అయ్యిందని చెప్పుకొచ్చారు అర్జున్. మొత్తానికైతే నమ్మిన వాళ్లే తనను మోసం చేశారని అలా సరైన దారిలో వెళ్లకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడ్డానని ఆయన చెప్పుకొచ్చారు.
పెట్టుబడుల విషయంలో తప్పుదోవ పట్టించారని ఆవేదన
ఇకపోతే అర్జున్ 63 సంవత్సరాల వయసులో కూడా ఫిట్ గా ఉండడానికి కారణం ఇంటి భోజనం తినడమే.. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల ఆయన ఈ వయసులో కూడా ఇంత ఫిట్ గా ఉండడానికి కారణం అని చెబుతున్నారు. దీనికి తోడు పాజిటివ్గా ఉండాలని, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని.. అదే మనల్ని యంగ్గా ఆరోగ్యంగా ఉంచుతుందని అర్జున్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అర్జున్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే ఈయన తన కూతుర్నీ టాలీవుడ్ కి పరిచయం చేసే ఉద్దేశంతో స్వీయ దర్శకత్వంలో ‘సీతాపయణం’ అనే సినిమాను నిర్మించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఐశ్వర్య అర్జున్ తన తండ్రి దర్శకత్వంలో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. మరి ఈ సీతాపయణం సినిమా ఐశ్వర్య అర్జున్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఇక అటు యాక్షన్ కింగ్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అర్జున్ ఇప్పుడు దర్శకుడిగా మారి సినిమాలు నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతో అర్జున్ ఇంకెలాంటి సక్సెస్ సొంతం చేసుకుంటారో చూడాలి.
ఆరోగ్యంపై అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు
నమ్మిన వారే మోసం చేశారని అర్జున్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆయన తన కూతురు ఐశ్వర్య అర్జున్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నారు.


