|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అల్లరి నరేష్ మళ్ళీ నవ్వుల బాట పట్టాడా? ‘రంభ ఊర్వశి మేనక’తో అంచనాలు అమాంతం!

Published: 30-06-2026, 4:38 PM
అల్లరి నరేష్ మళ్ళీ నవ్వుల బాట పట్టాడా? 'రంభ ఊర్వశి మేనక'తో అంచనాలు అమాంతం!
  • అల్లరి నరేష్ సీరియస్ పాత్రల నుండి కామెడీ జానర్‌కు తిరిగి వస్తున్నాడు.
  • ‘రంభ ఊర్వశి మేనక’ సోషియో-ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది.
  • సెప్టెంబర్ 4న విడుదల కానున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ వంటి ప్రముఖ కమెడియన్లు ఉన్నారు.
  • ‘నాంది’ మినహా గత సీరియస్ చిత్రాలు ఆశించిన విజయం సాధించలేదు.

కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అల్లరి నరేష్, సీరియస్ చిత్రాల తర్వాత మళ్ళీ నవ్వుల బాట పట్టాడు. ‘రంభ ఊర్వశి మేనక’ అనే సోషియో-ఫాంటసీ కామెడీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అల్లరి నరేష్ కామెడీ రీఎంట్రీ: అంచనాలు

Allari Naresh: అల్లరి నరేష్ ..ఈ పేరు వింటే చాలు థియేటర్లు గొల్లు మనేవి ,ఆడియన్స్ పొట్టలు చేక్కలయ్యేవి. అంతలా స్క్రీన్ పై నవ్వుల వరద పారించిన ఈ అల్లరోడు గత కొంతకాలంగా సీరియస్ సబ్జెక్ట్స్ పై మనసు పారేసుకొని కామెడీకి కిలోమీటర్ దూరం జరిగేశాడు.దీంతో మళ్ళీ వింటేజ్ అల్లరోడు ఎప్పుడొస్తాడా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కామెడీ లవర్స్.

అయితే లేటెస్ట్ గా మీ వెయింటింగ్ కి ఎండ్ కార్డ్ వేసేసేస్తున్నానోచ్ అంటూ సరికొత్త కామెడీ ఎంటర్ టైనర్ తో ఎంట్రీ ఇచ్చాడు.అవును “రంభ ఊర్వశి మేనక” అంటూ సరికొత్త క్యాచీ టైటిల్ దానికి తోడు కామెడీ గోస్ కాస్మిక్’ అనే క్యాచీ ట్యాగ్‌లైన్ తో రావడం సినిమా పై అంచనాలని మరింత పెంచేసింది.ఇక ఫస్ట్ లుక్ పోస్టర్‌ లో అల్లరి నరేష్ స్వర్గపు మెట్లపై కూర్చుని చేతిలో పెన్నుతో ఏదో రాస్తూ కనిపించగా, స్క్రోల్‌ పై రంభ, ఊర్వశి, మేనక పేర్లు ఉండగా.. వెనుక మేఘాల మధ్య అప్సరసల బొమ్మలు చూపించడం బట్టి ఇదొక సోషియో పాంటసీ అన్న క్లారిటీ వచ్చేస్తుంది.

‘రంభ ఊర్వశి మేనక’ కథా నేపథ్యం

నిజానికి కామెడీ అంటే నరేష్,,నరేష్ అంటే కామెడీ అన్నట్టుగా ఉండేది. కితకితలు, అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ, సుడిగాడు, సీమ శాస్త్రి, బ్లేడ్ బాబ్జీ ఇలా ఎన్నో సినిమాలు దాన్ని ప్రూవ్ చేశాయి కూడా.కానీ మొనాటనీ కొట్టిందేమో,లేక వెరైటీ గా ట్రై చేయాలని అనుకున్నాడెమో కాని గత కొన్నేళ్లుగా రూట్ మార్చి నాంది, ఉగ్రం, బచ్చలమల్లి, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి సీరియస్ కథలతో ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి తెగ ట్రై చేశాడు.కానీ వీటిలో విజయ్ కనకమేడల దర్శకత్వంలో వచ్చిన ఒక్క నాంది తప్ప మరే సినిమా నరేష్ కి మంచి అనుభూతుల్ని మిగల్చలేకపోయాయి.

దీంతో అచ్చొచ్చిన జానర్ లోనే మెచ్చిన సినిమా చేద్దామంటూ మళ్ళీ ఇదిగో ఇలా రంభ ఊర్వశి మేనక సినిమాతో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టినట్టు అర్థమవుతుంది. చంద్ర మోహన్ చింతడ చెప్పిన కథకి ఫిదా అయిన నరేష్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, సినిమా కంప్లీట్ అయిపోయి సెప్టెంబర్ 4న రిలీజ్ కి సిద్దం అవుతుండటం విశేషం.ఇక రాజేష్ దండ, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తుండటం ఇక్కడ మరో విశేషం.

నరేష్ కెరీర్ మలుపు: సీరియస్ నుండి కామెడీకి

పైగా ఇందులో ఇండస్ట్రీలో బెస్ట్ కామెడీ గ్యాంగ్‌ అయిన వెన్నెల కిషోర్, నరేష్ వీకే, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ వంటి క్రేజీ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు కూడా.ఇక వీరి కాంబినేషన్‌లో వచ్చే సీన్లు థియేటర్లను నవ్వుల వర్షంలో ముంచెత్తడం పక్కా అని చెప్పక్కర్లేదు కూడా. మొత్తానికి అస్త్ర శస్త్రాలతో ఈసారి హిట్ కొడతానని వస్తున్న ఈ అల్లరోడు నిజంగానే అలరిస్తాడో లేదో సెప్టెంబర్ 4న తేలిపోనుంది !

‘రంభ ఊర్వశి మేనక’తో అల్లరి నరేష్ మళ్ళీ తన కామెడీ మార్కును నిరూపించుకోవాలని చూస్తున్నాడు. సెప్టెంబర్ 4న విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.