|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సత్యదేవ్ ‘రావు బహదూర్’ ట్రైలర్: మహేష్ బాబు వాయిస్‌తో మాస్టర్ పీస్ ఖాయమా?

Published: 01-07-2026, 2:21 AM
సత్యదేవ్ 'రావు బహదూర్' ట్రైలర్: మహేష్ బాబు వాయిస్‌తో మాస్టర్ పీస్ ఖాయమా?
  • సత్యదేవ్ ప్రధాన పాత్రలో ‘రావు బహదూర్’ సైకలాజికల్ థ్రిల్లర్ ట్రైలర్ విడుదలైంది.
  • సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు, ట్రైలర్‌లో ఆయన వాయిస్ ఓవర్ హైలైట్.
  • ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
  • జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం మాస్టర్ పీస్ అవుతుందని అంచనా.

టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ నటించిన ‘రావు బహదూర్’ సైకలాజికల్ థ్రిల్లర్ ట్రైలర్ విడుదలైంది. మహేష్ బాబు సమర్పణలో, వెంకటేష్ మహా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ సినిమాపై మరింత ఉత్కంఠను రేపుతోంది.

మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ కొత్త చిత్రం

Rao Bahadur Trailer: రా వు బహదూర్.. టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ప్రధాన పాత్రలో వస్తున్న సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్.సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పిస్తున్న ఈ సినిమా తాజాగా ట్రైలర్ ని ఘనంగా రిలీజ్ చేసింది.టాలీవుడ్ లో వెరైటీ స్టోరీస్ తో తనదైన స్టాంప్ వేసుకున్నఈ వెర్సటైల్ యాక్టర్ ఈసారి మరింత విలక్షణమైన పాత్రతో మన ముందుకు రాబోతున్నాడని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.

ఈ  ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేష్ బాబు స్వయంగా ప్రజెంట్ చేస్తుండటంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.ముఖ్యంగా ట్రైలర్ మొదట్లో వినిపించే మహేష్ బాబు వాయిస్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది అని చెప్పాలి.

వెంకటేష్ మహా దర్శకత్వంలో సైకలాజికల్ థ్రిల్లర్

ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని డిఫరెంట్ అప్రోచ్ తో  స్క్రీన్ మీదకి తీసుకొస్తున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా.కేరాఫ్ కంచరపాలెం ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి కల్ట్  సినిమాలతో సత్తా చాటిన వెంకటేష్ ఇప్పుడు పూర్తిగా తన జోనర్ మార్చి మైండ్ బెండింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ ని ఎంచుకోవడం విశేషం .ఇక టైలర్ చూస్తుంటేనే ఇదో సరికొత్త సినిమా వరల్డ్ అని మనకు అర్థమయిపోతుంది.చింతా గోపాల్ రెడ్డి అనురాగ్ రెడ్డి శరత్చంద్ర ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో దీప థామస్ హీరోయిన్ గా  నటిస్తుంది.

జూలై 3న విడుదల: అంచనాలు పెంచుతున్న ట్రైలర్

ఇక ఇప్పటికే షూటింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకున్న ఈ రావు బహదూర్ జులై మూడున వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి అడుగుపెట్టబోతున్నాడు.మామూలుగా సత్యదేవ్ నటించిన బ్లఫ్ మాస్టర్ లేదా గాడ్సే సినిమాలోని ఇంటెన్సిటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.అయితే ఈసారి వెంకటేష్ మహా మేకింగ్ స్టైల్ సత్యదేవ్ కి తోడవడంతో ఇదొక మాస్టర్ పీస్ కాబోతుందని ఇన్సైడ్ వినిపిస్తున్న టాక్.”మ్యాజిక్ అంటే కేవలం కళ్ళకు కట్టే గారడి కాదు వెండితెరపై ఆవిష్కరించే ఒక అద్భుతమైన దృశ్య కావ్యం” అంటూ మహేష్ బాబు చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో తెగ హైలెట్ అవుతుంది.మరి ఈ సినిమాలో కనిపించే ఆ  మ్యాజిక్ ఏంటో తెలియాలంటే జులై 3న థియేటర్లో చూడాల్సిందే.

చూడాలి మరి సత్యదేవ్, వెంకటేష్ మహాకాంబో ప్రేక్షకులను ఏ విధంగా మెప్పించబోతుందో  జులై మూడున బాక్సాఫీస్ వద్ద ఈ రావు బహుదూర్ ఇలాంటి సంచలనాలు స్ప్రుష్టించబోతాడో !

సత్యదేవ్, వెంకటేష్ మహా కాంబోలో వస్తున్న ఈ ‘రావు బహదూర్’ జూలై 3న థియేటర్లలోకి రానుంది. మహేష్ బాబు వాయిస్ ఓవర్, విలక్షణమైన కథనంతో ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.