|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Happy Journey: ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. బండి సంజయ్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్!

Published: 23-06-2025, 12:13 PM
Happy Journey: ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. బండి సంజయ్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్!

‘హ్యాపీ జర్నీ’ అనే సినిమాకు బండి సంజయ్ గారు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. హరిప్రసాద్, ఇషాని గోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం చైతన్య కొండ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది.

Key Points

1

హరిప్రసాద్ కోనే, ఇషాని గోష్ జంటగా నటిస్తున్నారు.

2

బండి సంజయ్ గారు 'హ్యాపీ జర్నీ' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

4

దువ్వాసి మోహన్, వి6 సత్య, సంజయ్ రాయచూర, ఆనంద్ భారతి కీలక పాత్రల్లో నటించారు.

హ్యాపీ జర్నీ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్

హరిప్రసాద్ కోనే, ఇషాని గోష్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం హ్యాపీ జర్నీ. ఈ సినిమకాు  చైతన్య కొండా దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యూచర్ బ్రైట్ ఫిలిమ్స్ పతాకంపై గంగాధర్ పెద్ద కొండ నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఎమోషనల్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకులు చైతన్య కొండ, నిర్మాత గంగాధర్ పెద్ద కొండ, కెమెరామెన్ అరుణ్ కుమార్ , సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..”ఈ కథ విన్న తర్వాతనే ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేయడానికి అంగీకరించాను. ఇలాంటి సినిమా చేసిన ఈ డైరెక్టర్‌ను  అభినందిస్తున్నా. ప్రస్తుత పరిస్థితుల్లో సొసైటీలో అలజడులు, దానిమీద సామాజిక బాధ్యతల మీద స్పృహ ఉన్న డైరెక్టర్. మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు కలసి ఇలాంటి సినిమాలు తీయడం అభినందనీయం. హిందీ, తెలుగు భాషలలో విడుదల కానున్న ఇలాంటి సినిమాలకు నేను ఎంతవరకైనా  సహకరిస్తా. ‘అని అన్నారు. కాగా.. ఈ  సినిమాకు చైతన్య రాజ్  సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో దువ్వాసి మోహన్, వి6 సత్య, సంజయ్ రాయచూర, ఆనంద్ భారతి కీలక పాత్రలు పోషించారు.

బండి సంజయ్ ప్రశంసలు

నటీనటులు మరియు సినిమా వివరాలు

బండి సంజయ్ గారి అభినందనలతో ‘హ్యాపీ జర్నీ’ సినిమా పట్ల అంచనాలు పెరిగాయి. ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.