|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగాస్టార్ చిరు ట్వీట్‌తో సమంతకు డబుల్ ధమాకా! ఆ గుడ్ న్యూస్ నిజమేనా? టాలీవుడ్‌లో కొత్త చర్చ!

Published: 26-06-2026, 1:04 PM
మెగాస్టార్ చిరు ట్వీట్‌తో సమంతకు డబుల్ ధమాకా! ఆ గుడ్ న్యూస్ నిజమేనా? టాలీవుడ్‌లో కొత్త చర్చ!
  • ‘మా ఇంటి బంగారం’ చిత్రం తొలి వీకెండ్‌లో రూ. 43 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సంచలనం.
  • మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందాన్ని తన నివాసానికి ఆహ్వానించి, ఘనంగా సత్కరించారు.
  • సమంత, రాజ్ నిడిమోరు దంపతులకు చిరంజీవి ‘కొత్త అధ్యాయం’పై ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
  • ఈ మెగా ట్వీట్ టాలీవుడ్‌లో సమంత వ్యక్తిగత గుడ్ న్యూస్‌పై భారీ చర్చకు దారి తీసింది.

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఒకే చర్చ! స్టార్ హీరోయిన్ సమంతకు మెగాస్టార్ చిరంజీవి నుండి అరుదైన సత్కారం, అభినందనలు. ‘మా ఇంటి బంగారం’ సినిమా ఘన విజయంతో పాటు, చిరు ట్వీట్ సమంత జీవితంలోకి మరో శుభవార్తను సూచిస్తుందా? ఈ సంచలన వార్తపై పూర్తి వివరాలు ఇక్కడ!

‘బంగారం’ బ్లాక్‌బస్టర్: చిరు ప్రశంసలు!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం ‘ మా ఇంటి బంగారం ’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రముఖ క్రియేటర్ రాజ్ నిడిమోరు నిర్మాణంలో, ప్రతిభావంతురాలైన దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. టాక్‌తో సంబంధం లేకుండా దూసుకుపోతున్న ఈ చిత్రం, మొదటి వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 43 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఘన విజయంతో మంచి జోష్‌లో ఉన్న ‘బంగారం’ టీమ్‌కు తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. * నారా లోకేష్‌తో పోలిక… నేషనల్ మీడియా డిబేట్‌లో రామ్‌చరణ్ క్రేజీ కామెంట్స్ సినిమా సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకుని, మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా చిత్ర బృందాన్ని తన నివాసానికి ఆహ్వానించి అభినందించారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ భేటీలో దర్శకురాలు నందిని రెడ్డితో పాటు సమంత, రాజ్ నిడిమోరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి – సురేఖ దంపతులు సమంత, రాజ్ జంటకు సాంప్రదాయబద్ధంగా ‘సారె’ పెట్టి ఘనంగా సత్కరించడం విశేషం. వారికి ఒక అందమైన చీరతో పాటు పవిత్రమైన శంఖాన్ని బహుమతిగా అందించి, కాసేపు సినిమా విశేషాలను ముచ్చటించారు. ఈ సందర్భంగా “మా ఇంటి బంగారం” సినిమా చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో యాక్షన్‌, భావోద్వేగాలను అద్భుతంగా మేళవిస్తూ దర్శకురాలు నందిని రెడ్డి తనదైన శైలిలో ఈ చిత్రాన్ని ఎంతో వినోదాత్మకంగా తెరకెక్కించారు. సమంత నటన ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా చీరకట్టులో ఆమె చేసిన యాక్షన్‌ సన్నివేశాలు ఎంతో ప్రభావవంతంగా అనిపించాయి. ఇలాంటి వైవిధ్యభరితమైన కథలతో, మహిళలను ప్రధాన పాత్రల్లో నిలబెట్టే సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమకు అవసరం. ఈ విజయానికి సమంత, నందిని రెడ్డి, రాజ్ అలాగే మొత్తం చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. అలాగే జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత – రాజ్ దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ మెగా ‘బంగారం’ మూమెంట్‌కు సంబంధించిన అందమైన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. * నారా వారి ఇంట వారసుడు.. మగబిడ్డకు జన్మనిచ్చిన నారా రోహిత్ భార్య శిరీష మెగాస్టార్ చిరంజీవి చూపించిన ఈ అపారమైన ఆదరణకు, సత్కారానికి సమంత పూర్తిగా ఫిదా అయిపోయారు. ఈ సంతోషాన్ని పంచుకుంటూ చిరంజీవి ట్వీట్‌ని ట్యాగ్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. “మెగాస్టార్ చిరంజీవి గారు, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ‘మా ఇంటి బంగారం’ చిత్రంపై మీరు చూపించిన ప్రేమ, అందించిన ప్రశంసలు మా చిత్ర యూనిట్ మొత్తానికి ఎంతో గుర్తింపును ఇచ్చాయి. మీలాంటి లెజెండరీ వ్యక్తి నుండి ఇలాంటి అభినందనలు అందుకోవడం ఒక కలలా ఉంది. మా సినిమా మీకు నచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను” అంటూ సమంత ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే చిరంజీవి, సమంత చర్చలో ఓ ఆసక్తికరమైన విషయం బయటపడింది. చిరంజీవి తన ట్వీట్‌లో ‘జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత – రాజ్ దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు’ అంటూ ప్రస్తావించడాన్ని బట్టి సమంత ప్రెగ్నెన్సీని ఆయన కన్ఫామ్ చేశారని నెటిజన్లు చర్చించుంటుకుంటున్నారు. ఇటీవల కాలంలో తన సినిమాలకు సంబంధించి మేకర్స్‌తో సంబంధం లేకుండానే చిరంజీవి చాలా లీకులు ఇచ్చేస్తున్నారు. ఆ కోవలోనే సమంత ప్రెగ్నెన్సీ‌ గురించి కూడా లీక్ చేశారని అభిప్రాయపడుతున్నారు.

మెగాస్టార్ ట్వీట్: సమంత కొత్త అధ్యాయం!

టాలీవుడ్‌లో వైరల్: ఆ గుడ్ న్యూస్ నిజమేనా?

‘మా ఇంటి బంగారం’ విజయంతో పాటు, సమంత వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయంపై మెగాస్టార్ ఆశీస్సులు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ గుడ్‌న్యూస్‌పై మరింత స్పష్టత కోసం, తాజా అప్‌డేట్‌ల కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.