
📌 Key Points
- ఎన్టీఆర్-త్రివిక్రమ్ మైథలాజికల్ చిత్రానికి అనిరుధ్ సంగీతం, తమన్ కు షాక్.
- తమన్ గతంలో ఈ సినిమాకు సంగీతం అందించనున్నట్టు పరోక్షంగా ప్రకటించాడు.
- గతంలో త్రివిక్రమ్-తమన్ కాంబోలో బ్లాక్ బస్టర్ హిట్స్, నాలుగు సినిమాలు.
- అనిరుధ్ గతంలో అజ్ఞాతవాసికి పనిచేసినా, మ్యూజిక్ పెద్దగా మెప్పించలేదు.
త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో రానున్న మైథలాజికల్ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. అయితే, ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో త్రివిక్రమ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తమన్ కు షాక్ ఇస్తూ అనిరుధ్ ఎంట్రీ వెనుక అసలు కథ ఏంటి? తెలుసుకుందాం!
త్రివిక్రమ్-ఎన్టీఆర్ మైథలాజికల్ సినిమా మ్యూజిక్ మలుపు!
త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్ తో ఆదర్శకుటుంబం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయ్యాక ఎన్టీఆర్ తో భారీ మైథలాజికల్ సినిమా చేయబోతున్నట్టు ఇటీవలే ప్రకటించారు. కుమారస్వామి కథతో ఈ సినిమా ఉండబోతుంది. అయితే ఈ సినిమా విషయంలో పలువురు నెటిజన్లు తమన్ కి సపోర్ట్ గా మీమ్స్, పోస్టులు వేస్తున్నారు.
త్రివిక్రమ్ – ఎన్టీఆర్ మైథలాజికల్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ ని ప్రకటించారు. ఈ సినిమా అప్డేట్ నిర్మాత నాగవంశీ ఇచ్చినప్పుడు దాన్ని షేర్ చేస్తూ ఎమోజిస్ తో సినిమాపై హైప్ పెంచాడు తమన్. ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో కూడా తమన్ ఈ సినిమాకు తనే సంగీత దర్శకుడిగా ఉండబోతున్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పాడు.
తమన్ కు షాక్: అనిరుధ్ ఎంట్రీ వెనుక మర్మం ఏంటి?
కానీ ఇప్పుడు అనిరీద్ ని ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట్ గా ప్రకటించడంతో విమర్శలు వస్తున్నాయి. ఆల్రెడీ త్రివిక్రమ్ తో తమన్ గుంటూరు కారం, అల వైకుంఠపురంలో, అరవింద సమేత వీరరాఘవ సినిమాలకు పనిచేసి మంచి మ్యూజిక్, హిట్ సాంగ్స్ ఇచ్చారు. ఇప్పుడు నాలుగోసారి ఆదర్శ కుటుంబం సినిమాకు పనిచేస్తున్నారు. ఇంత హిట్ కాంబోని వదిలేసి త్రివిక్రమ్ ఎందుకు అనిరుధ్ ని తీసుకున్నాడు అని ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్, నెటిజన్ల ప్రశ్నలు!
త్రివిక్రమ్ గతంలో అనిరుధ్ తో కలిసి పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాకు పనిచేసారు. ఆ సినిమాలో ఒక్క సాంగ్ తప్ప మిగిలిన సాంగ్స్, మ్యూజిక్ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. సినిమా కూడా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. మంచి హిట్స్ ఇచ్చిన తమన్ ని వదిలేసి అనిరుధ్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో త్రివిక్రమ్ కే తెలియాలి. దీంతో పాపం తమన్ అంటూ త్రివిక్రమ్ పై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో అరవింద వీర రాఘవ సినిమాకు ముందు అనిరుధ్ ని ప్రకటించి తర్వాత తమన్ ని తీసుకున్నారు. ఆ సినిమాకు తమన్ అదిరిపోయే సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఒకవేళ దాని రీప్లేస్మెంట్ కోసం ఇప్పుడు తమన్ సినిమాని అనిరుధ్ కి ఇచ్చారేమో అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
తమన్ ఫ్యాన్స్ లో ఆగ్రహం, అనిరుధ్ ఎంట్రీతో కొత్త చర్చ! ఈ మ్యూజిక్ మార్పు వెనుక ఉన్న అసలు కారణాలు త్రివిక్రమ్ ఎప్పుడు వెల్లడిస్తారో చూడాలి. మరిన్ని సంచలన అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి!


