
📌 Key Points
- శౌర్య మార్కులపై ఎగతాళి చేసిన జ్యోత్స్నపై కార్తీక్ ప్రతీకారం! శివ నారాయణ మాస్ ఆర్డర్.
- శౌర్యకు ట్యూషన్ చెప్పలేక జ్యోత్స్న తలపట్టుకుంది. కార్తీక్ పంచులు, దీప సపోర్ట్.
- జ్యోత్స్న పారిజాతంను ఇరికించి వెళ్లిపోవడంతో పారు పరిస్థితి అగమ్యగోచరం.
- సూరజ్ తల్లిదండ్రుల గురించి కార్తీక్ ఆరా, శివ నారాయణ ఆగ్రహం. రహస్యాలు బట్టబయలు?
కార్తీక దీపం 2 అభిమానులకు షాకింగ్ న్యూస్! నేటి ఎపిసోడ్ ఊహించని మలుపులతో, సంచలన సన్నివేశాలతో ఉత్కంఠ రేపుతోంది. కార్తీక్ పగ, శౌర్య ట్యూషన్ డ్రామా, పారు ఇరుక్కున్న వైనం.. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం!
కార్తీక్ ప్రతీకారం: జ్యోత్స్నపై మాస్ అటాక్!
Karthika Deepam 2 Serial July 4th Episode: కార్తీక దీపం 2 సీరియల్ జూలై 4వ ఎపిసోడ్‌లో దక్షిణామూర్తితో మాట్లాడొద్దని సూరజ్‌పై చాలా సీరియస్ అవుతాడు శివ నారాయణ. శౌర్యకు వచ్చిన మార్కులపై జ్యోత్స్న ఎగతాళి చేస్తుంది. శౌర్యకు జ్యోనే ట్యూషన్ చెప్పాలని తాత ఆర్డర్ వేస్తాడు. పారును ఇరికించి జ్యో వెళ్లిపోతుంది.
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో శివ నారాయణ రెస్టారెంట్స్ బ్రాంచ్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ పోటీగా తన బ్రాంచ్స్ ఓపెన్ చేశానని దక్షిణామూర్తి చెప్పి వెళ్లిపోతాడు. మా బ్రాంచ్ సీక్రెట్స్ ఎలా తెలిసాయి. ఆఫీస్‌లో దక్షిణామూర్తి మనిషి ఎవరైనా ఉన్నారా అని శివ నారాయణ అనుమానపడతాడు.
ఆయన అడిగిన దానికి చెప్పాను. అతను మీ ఇంట్లో విషయాలు గురించి అడిగాడు. ఇలాంటి వివరాలు నన్ను అడగొద్దు మా సర్ లోపలే ఉన్నాడు కావాలంటే అడగండని చెప్పాను. వద్దులే అని వెళ్లిపోయాడు అని సూరజ్ అంటాడు. ఇకనుంచి ఆ మనిషితో ఎప్పుడు మాట్లాడకు అని శివ నారాయణ అంటాడు. ఎందుకు అని సూరజ్ అంటే. మాట్లాడొద్దని చెప్పానుగా అని చాలా సీరియస్ అయి సూరజ్‌పై అరుస్తాడు శివ నారాయణ .
ఏమైంది సర్ అని సూరజ్ అంటుంటే.. బ్రదర్ ఇటు రా అని కార్తీక్ పిలుస్తాడు. నా మీద ఎందుకు అంత సీరియస్ అయ్యారని సూరజ్ అడుగుతాడు. అది తర్వాత చెబుతానను సూరజ్‌ను తీసుకెళ్తాడు కార్తీక్. ఇకనుంచి నేనే నీకు పోటీ అని దక్షిణామూర్తి చెప్పింది గుర్తు చేసుకుని ఆలోచిస్తాడు శివ నారాయణ. ఇంతలో శౌర్య వస్తుంది.
శౌర్య ట్యూషన్ డ్రామా: జ్యో తల పట్టుకుంది!
దాంతో జ్యో షాక్ అవుతుంది. కార్తీక్ నవ్వుతాడు. శౌర్యకు నీకు సంబంధం లేదు అయిన మాట్లాడావ్. ఏ నోటితో శౌర్య చదువు ఎగతాళి చేశావో అదే నోటీతో శౌర్యకు ట్యూషన్ చెప్పు. ఇది నా ఆర్డర్ అని శివ నారాయణ వెళ్లిపోతాడు. శౌర్యకు ట్యూషన్ చెప్పేందుకు జ్యో కూర్చుంటుంది. మిస్ జ్యో అంటూ పిలుస్తుంది శౌర్య. కార్తీక్ పంచులు వేస్తాడు.
శౌర్య అడిగే ప్రశ్నలకు జ్యోత్స్న తలపట్టుకుంటుంది. నీలాంటి మేధావికి ట్యూషన్ చెప్పడం నావల్ల కాదని జ్యో అంటుంది. అంతలో పారిజాతం వస్తుంది. పిల్లలకు చదువు చెప్పడం ఒక ఆర్ట్ అని పారు అంటే.. అయితే నువ్వు కూర్చుని చెప్పు అని కూర్చొబెట్టి పోతుంది జ్యోత్స్న. కార్తీక్, దీప కూడా వెళ్లిపోతారు. పారిజాతంను జ్యో ఇరికించి పోతుంది.
నాకంటూ చెప్పుకునే వాళ్లు ఎవరు లేరు. కానీ, ఇప్పుడు నాకు అన్నయ్య, వదిన ఉన్నారు. అది మీరే అని సూరజ్ అంటాడు. నా ఒంటరి జీవితంలో దేవుడు ఇచ్చిన కొత్త బంధాలు. నన్ను నువ్వు ఎవరి తాలూకా అని చెప్పుకునేదానికి బంధం దొరికిందని సూరజ్ అంటాడు. తర్వాత దక్షిణామూర్తి గురించి చెబుతానని చెప్పావని సూరజ్ అంటే.. కార్తీక్ చెబుతాడు.
ప్రస్తుతం వీళ్లిద్దరు బద్ద శత్రువులు అని, కొట్టుకునేంత శత్రువులు. ఆయన విషయంలో మనల్ని ఎవరు అనుమానించకుండా చూసుకోవాలి. అనుమానం రానివ్వకూడదని అంటున్నా. పెద్ద పెద్ద సంస్థలు ఇతరులకు అమ్ముడుపోవడం వల్లో, భయపడటం వల్ల నాశనం అయ్యాయని కార్తీక్ అంటాడు. అలాంటి భయాలు నా విషయంలో పెట్టుకోవాల్సిన అవసరం లేదని, నీతో ఉన్న బంధాన్ని జీవితాంతం కాపాడుకుంటామని సూరజ్ అంటాడు.
పారు ఇరుక్కుంది: సూరజ్ తల్లిదండ్రులపై కార్తీక్ ఆరా!
మీరంతా కలిసిపోయింది నన్ను అంతం చేయడానికే అని తెలుసు బావ. మీరెంతమంది అయినా సరే నేను ఒక్కదాన్ని చాలు సమాధానం చెప్పడానికి అని జ్యోత్స్న అనుకుంటుంది. మరోవైపు పారు పద్యాలు పాడుతుంది. శౌర్య ఇరిటేట్ అవుతుంది. పారిజాతం మాటలకు శౌర్య పంచులు వేస్తుంది. పుస్తకంలోని పదాలకు అర్థాలు అడుగుతుంది శౌర్య .
పారిజాతం తప్పుగా చెబితే తప్పని శౌర్య అంటుంది. పద్యానికి మీనింగ్ అడిగితే పారు తప్పుగా చెబుతుంది. శౌర్య కరెక్ట్ చెబుతుంది. పారిజాతానికే శౌర్య ట్యూషన్ చెప్పినట్లు అవుతుంది. అదంతా విన్న శివ నారాయణ వెరీ గుడ్ అని శౌర్యను మెచ్చుకుంటాడు. శివ నారాయణ కూడా చంటిదే నీకు చెబుతుందని అంటాడు. శౌర్య ఇకనుంచి నువ్వు పారిజాతానికి ట్యూషన్ చెప్పమని వెళ్లిపోతాడు శివ నారాయణ.
అంత టైమ్ లేదు. రేపు ఉదయమే పెద్దసారుకు ఇవ్వాలట. సీఈఓ ఆర్డర్ అని కార్తీక్ అంటాడు. తాత వేసిన శిక్ష గుర్తుకు వచ్చి చేస్తానంటుంది. ఇంతకంటే మేము ఎక్కువే చేశాం. మీరు తిని తిరగడం తప్పా ఏనాడైనా వర్క్ చేశారా అని సెటైర్లు వేస్తాడు కార్తీక్. నువ్వు మీ ఆవిడ కలిసి నా మీద పాత పగలు తీర్చుకుంటున్నారా అని జ్యోత్స్న అంటుంది.
నిజంగా పగ తీర్చుకోవాలనుకుంటే బాలరాజు గాడి గురించి సుమిత్ర అత్తకు ఎప్పుడో చెప్పేవాన్ని. చెప్పలేదంటే మారడానికి అవకాశం ఇచ్చాం. అది ఇచ్చినప్పుడు ఉపయోగించుకోవడం మంచిది. లేకుంటే దీపను మీ నానమ్మ ఎక్కడ వదిలేసిందో నిన్ను అక్కడే వదిలేస్తారు అని కార్తీక్ అంటాడు. అంటే చెత్తకుప్పే అని కార్తీక్ ఇన్‌డైరెక్ట్‌గా అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
కార్తీక దీపం 2లో ఈ సస్పెన్స్, డ్రామా ఇంకా ఎన్నో మలుపులు తిరగబోతోంది. అభిమానులు ఊపిరి బిగబట్టి చూడాల్సిన ఎపిసోడ్ ఇది. మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం వేచి ఉండండి!


