|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సత్యదేవ్ ‘రావు బహదూర్’ ఫస్ట్ డే కలెక్షన్ల సునామీ! షాకింగ్ సక్సెస్ టార్గెట్ ఎంతంటే?

Published: 07-07-2026, 6:41 AM
సత్యదేవ్ 'రావు బహదూర్' ఫస్ట్ డే కలెక్షన్ల సునామీ! షాకింగ్ సక్సెస్ టార్గెట్ ఎంతంటే?
  • రావు బహదూర్‌ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 3.11 కోట్లు వసూలు చేసి సత్యదేవ్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది.
  • ఓవర్సీస్‌లో అద్భుతమైన వసూళ్లు: ఇండియా కంటే ఎక్కువగా రూ. 1.50 కోట్లు సాధించి బాక్సాఫీస్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది.
  • సినిమా బడ్జెట్ భారీగా రూ. 40 కోట్లు. నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ. 12 కోట్లు ఇప్పటికే వచ్చాయి.
  • థియేట్రికల్ సక్సెస్ కోసం ఇంకా రూ. 25-28 కోట్లు అవసరం. శని, ఆదివారాల వసూళ్లు అత్యంత కీలకం.

సత్యదేవ్ ‘రావు బహదూర్’ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్ తో దూసుకుపోతోంది! విలక్షణ నటుడి ప్రయోగం అంచనాలకు మించి వసూళ్లను సాధించి ట్రేడ్‌ను ఆశ్చర్యపరిచింది. మరి ఈ సినిమా సక్సెస్ టార్గెట్ ఎంత? పూర్తి వివరాలు చూద్దాం!

అదిరిపోయే ఓపెనింగ్స్.. సత్యదేవ్‌ మ్యాజిక్!

సత్యదేవ్‌ని హీరో అనడం కంటే విలక్షణ నటుడు అంటే బాగా సెట్‌ అవుతుంది. ఆయన పాత్ర ఏదైనా ఇరగదీస్తారు. పాత్రలో జీవిస్తారు. కానీ ఆయన నటించిన సినిమాలు కమర్షియల్‌గా ఆ స్థాయిలో పర్‌ఫెర్మ్‌ చేయడం లేదు. ఇప్పుడు మరోసారి ప్రయోగాత్మక చిత్రంతో వచ్చాడు. `రావు బహదూర్` అనే చిత్రంలో నటించాడు. అనుమానం అనే కాన్సెప్ట్ తో తీసిన చిత్రమిది. రాజవంశంలోని వారసుడు, తన కొడుకు తనకే పుట్టాడా? అనే అనుమానంతో జీవితాన్నే పోగొట్టుకున్న వ్యక్తి కథని ఇందులో ఆవిష్కరించారు.

కాన్సెప్ట్ వైజ్‌గా ఇది కొత్తగా ఉంది. టేకింగ్‌, మేకింగ్‌ కూడా చాలా కొత్తగా ఉంది. కానీ మన ఆడియెన్స్ కి ఎంత వరకు కనెక్ట్ అవుతుందనేదే ఇక్కడ ప్రశ్న. అయితే శుక్రవారం(జులై 3న ) విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తోంది. కానీ మొదటి రోజు మాత్రం మంచి వసూళ్లని రాబట్టింది. సత్యదేవ్‌ కెరీర్లోనే ఇది బెస్ట్ ఓపెనింగ్స్ గా చెప్పొచ్చు.

ఓవర్సీస్‌లో రికార్డు కలెక్షన్లు!

`రావు బహదూర్‌` ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా రూ.3.11కోట్లు రాబట్టడం విశేషం. ఇండియాలో దీనికి రూ.1.61కోట్ల గ్రాస్‌, రూ.1.40కోట్ల నెట్‌ వచ్చింది. అయితే ఓవర్సీస్‌లో ఇది అదిరిపోయే వసూళ్లని రాబట్టింది. అక్కడే దీనికి రూ.1.50కోట్లు రావడం విశేషం. ఇండియా కంటే ఓవర్సీస్‌లోనే ఎక్కువగా వచ్చాయని చెప్పొచ్చు. మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ ని రాబట్టుకున్న ఈ మూవీ రెండో రోజు ఏ స్థాయిలో సత్తా చాటుతుందనేది చూడాలి.

ఇదిలా ఉంటే ఈ మూవీకి సుమారు రూ.40కోట్ల బడ్జెట్‌ అయ్యిందని సమాచారం. నాన్‌ థియేట్రికల్‌గా రూ.12కోట్లు రాబట్టింది. ఓటీటీ రైట్స్ ని నెట్‌ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. రూ.7కోట్లు ఓటీటీ రూపంలో వచ్చినట్టు సమాచారం. అలాగే శాటిలైట్‌, ఆడియో రైట్స్ రూపంలో మరో ఐదు కోట్లు వచ్చాయని సమాచారం. థియేట్రికల్‌గా ఈ సినిమాకి ఇంకా రూ.25-28కోట్లు రావాలి. అంటే సుమారు రూ.50కోట్ల గ్రాస్‌ని వసూలు చేయాలి. మరి శనివారం నుంచి సినిమా పుంజుకుంటే అది సాధ్యం లేదంటే డిజాస్టర్‌ తప్పదు. శనివారం, ఆదివారం వసూళ్లని బట్టి ఈ మూవీ సక్సెస్‌ ఆధారపడి ఉంటుంది. మరి సత్యదేవ్‌ ఎలాంటి మ్యాజిక్‌ చేస్తాడో చూడాలి.

సక్సెస్ టార్గెట్ ఎంతంటే.. బడ్జెట్ షాకింగ్!

సత్యదేవ్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో దీపా థామస్‌ హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. వెంకటేష్‌ మహా దర్శకత్వం వహించారు. మహేష్‌బాబుకి చెందిన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌తో కలిసి శరత్ చంద్ర, అనురాగ్‌ వంటి వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. మేకింగ్‌, స్క్రీన్‌ ప్లే పరంగా ఇదొక ప్రయోగాత్మక చిత్రం అని చెప్పొచ్చు. కాకపోతే కామెడీ వర్కౌట్‌ కాలేదు. ఎమోషన్స్ లేవు. కేవలం విజువల్స్, బీజీఎం, సత్యదేవ్‌ యాక్టింగ్‌ మాత్రమే ప్లస్‌గా నిలిచాయి. వీటిని బేస్‌ చేసుకొని మూవీ ఎంత వరకు ఆడుతుందనేది చూడాలి.

‘రావు బహదూర్’ ప్రయాణం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. సత్యదేవ్ మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా వెంట ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.