|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బెడిసికొట్టిన ముగ్గురు సీనియర్ హీరోయిన్ల రీ ఎంట్రీ.. ఏమాత్రం కలిసి రాని కమ్ బ్యాక్.. జెనీలియా-లయ సేమ్ టు సేమ్!

Published: 21-07-2025, 4:44 AM

తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ హీరోయిన్ల రీ ఎంట్రీలు సర్వసాధారణం. తాజాగా జెనీలియా, లయ, అన్షులు తమ కమ్ బ్యాక్ ప్రయత్నాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ, వారి సినిమాల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Key Points

1

జెనీలియా, లయ, అన్షుల రీ ఎంట్రీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి.

2

అన్షు 'మజాకా', లయ 'తమ్ముడు' సినిమాల్లో నటించింది.

4

సీనియర్ హీరోయిన్ల కమ్ బ్యాక్ ప్రయత్నాలు అనుకున్నంత విజయవంతం కాలేదు.

అన్షు – మజాకా సినిమాతో రీ ఎంట్రీ

సినీ ఇండస్ట్రీలో ఎంట్రీలు, రీ ఎంట్రీలు సాధారణమే. ఇది ఎక్కువగా హీరోయిన్స్‌లలో జరుగుతుంది. స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్న తర్వాత భర్త, కుటుంబం, పిల్లలు అంటూ సినిమాలకు దూరంగా ఉంటారు. తర్వాత ఒక సమయంలో మళ్లీ కీలక పాత్రలతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారు.

ఇలా రీసెంట్‌గా తెలుగులో ముగ్గురు సీనియర్ హీరోయిన్స్ రీ ఎంట్రీ ఇచ్చారు. వారే జెనీలియా, లయ, అన్షు. ఈ ముగ్గురు సీనియర్ ముద్దుగుమ్మలు హీరోయిన్స్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. మన్మథుడు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన అన్షు ఆ తర్వాత ప్రభాస్‌ తో రాఘవేంద్ర చేసింది. అనంతరం భూమిక మిస్సమ్మ మూవీలో కెమియో చేసింది.

కేవలం ఈ రెండు, మూడు సినిమాలు చేసిన అన్షు తన బ్యూటీతో చాలా ఫేమ్ తెచ్చుకుంది. పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిపోయిన అన్షు మజాకా సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో రావు రమేష్‌తో జోడీ కట్టింది అన్షు .

లయ – తమ్ముడు సినిమాతో రీ ఎంట్రీ

రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన మజాకా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో 22 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన అన్షుకు మంచి కమ్ బ్యాక్ సినిమా పడలేదు. అన్షు తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ లయ. నితిన్ హీరోగా తెరకెక్కిన తమ్ముడు సినిమాలో అక్క పాత్రలో కనిపించింది.

తన నటనతో నంది అవార్డ్ అందుకున్న లయ పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది. తమ్ముడు కథ నచ్చడంతో ఓకే చెప్పిన లయ సుమారు 21 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ, తమ్ముడు సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బెడిసికొట్టింది. రొటీన్ కాన్సెప్ట్, టేకింగ్‌తో వేణు శ్రీరామ్ దర్శకత్వం పాలిపోయిందని కామెంట్స్ వచ్చాయి.

అలా లయకు కూడా రీ ఎంట్రీ బెడిసికొట్టింది. ఇక ముచ్చటగా మూడో ముద్దుగుమ్మ జెనీలియాకు వీరిద్దరి కంటే తెలుగులో ఫుల్ క్రేజ్ ఉండేది. హా హా హాసిని అంటూ అందరి మనసు దోచిన చిన్నది జెనీలియా. అలాంటి జెనీలియా కెరీర్ బాగుండగానే బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడి అక్కడే స్థిరపడిపోయింది.

జెనీలియా – సితారే జమీన్ పర్, జూనియర్ సినిమాలు

భర్త, పిల్లలతోపాటు పలు ప్రొడక్షన్ పనులు చూసుకున్న జెనీలియా రీసెంట్‌గానే అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమాతో బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది. దాంతోపాటు తెలుగు, కన్నడలో విడుదలైన జూనియర్ మూవీలో కూడా జెనీలియా కీలక పాత్ర చేసింది.

లయ లాగే సేమ్ టు సేమ్ జెనీలియా కూడా హీరోకు అక్కలా నటించింది. కానీ, జూనియర్ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంటోంది. చాలా వరకు ఆడియెన్స్ జూనియర్‌పై నెగెటివ్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ, జెనీలియా సీరియస్ యాక్టింగ్, ఆమె స్క్రీన్ ప్రజెన్స్ బాగుందని కామెంట్స్ వచ్చాయి.

ఇలా హిందీలో జెనీలియా చేసిన సితారే జమీన్ పర్ కూడా పెద్దగా ఆడలేదు. జెనీలియాకు రెండు సినిమాలు కలిసి రాలేదు. దీంతో స్టార్ హీరోయిన్‌గా ముద్ర వేసిన జెనీలియా కమ్ బ్యాక్ చిత్రం బెడిసికొట్టింది. మరి ఈ ముగ్గురికి ఈ సినిమాల తర్వాత మరో మూవీ ఆఫర్ ఏమైనా వస్తుందేమో చూడాలి.

చివరకు, ముగ్గురు సీనియర్ హీరోయిన్ల రీ ఎంట్రీ ప్రయత్నాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేదు. వారి కమ్ బ్యాక్ ప్రయాణం అభిమానులకు కొంత నిరాశను కలిగించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.