|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ సంచలన నిర్ణయం: లారెన్స్ vs త్రిష.. టికెట్ ఎవరికి? మాస్ వార్!

Published: 01-07-2026, 2:22 AM
విజయ్ సంచలన నిర్ణయం: లారెన్స్ vs త్రిష.. టికెట్ ఎవరికి? మాస్ వార్!
  • విజయ్ రాజకీయం: సీఎం అయ్యాక తొలి ఉప ఎన్నిక.. తమిళనాట ఉత్కంఠ పతాక స్థాయికి!
  • తిరుచ్చి ఈస్ట్ స్థానం కోసం లారెన్స్, త్రిష మధ్య తీవ్ర పోటీ.. విజయ్ మద్దతు ఎవరికి?
  • లారెన్స్ పోటీ చేయనని స్పష్టం చేసినా.. విజయ్ అడిగితే మారే అవకాశం.
  • త్రిషకు నెగిటివిటీ భయం.. విజయ్ సంచలన నిర్ణయం కోసం ఎదురుచూపులు!

తమిళనాట రాజకీయాలు ఉత్కంఠగా మారాయి! స్టార్ హీరో విజయ్ రాజకీయ ఎంట్రీ, సీఎం పదవి తర్వాత తొలి ఉప ఎన్నిక ఇప్పుడు హాట్ టాపిక్. తిరుచ్చి ఈస్ట్ స్థానం కోసం లారెన్స్, త్రిషలలో విజయ్ ఎవరికి టికెట్ ఇస్తారు? సంచలన నిర్ణయం కోసం ఎదురుచూపులు!

విజయ్ రాజీనామా.. తిరుచ్చి ఈస్ట్ పాలిటిక్స్ హాట్ హాట్!

Vijay : విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర్నుంచి తమిళనాడు రాజకీయాలు కూడా ఆసక్తికరంగా మారాయి. ఇక విజయ్ భార్య విడాకులు అప్లై చేయడం, విజయ్ – త్రిష రిలేషన్ తో తమిళ రాజకీయాలు దేశవ్యాప్తంగా మరింత ఆసక్తిగా మారాయి.

అయితే తమిళనాడు ఎన్నికల్లో గెలిచి సీఎం అయిన విజయ్ ఈ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసాడు. ఒకటి పెరంబూరు కాగా మరొకటి తిరుచ్చి ఈస్ట్. ఈ రెండు స్థానాల్లోనూ విజయ్ గెలిచారు. సీఎం అయ్యాక తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రాజీనామా చేసారు. దాంతో ఆ నియోజకవర్గాన్ని ఎలాగైనా మళ్ళీ విజయ్ TVK పార్టీనే దక్కించుకోవాలని చూస్తుంది.

త్రిష ఎంట్రీపై మొదట చర్చ.. అనూహ్య మలుపు!

ఈ క్రమంలో రాజకీయాల్లోకి వస్తాను అని గతంలో త్రిష చెప్పడం, TVK పార్టీ కోసం అనధికారికంగా పనిచేయడం, విజయ్ – త్రిష రిలేషన్ తో త్రిషను తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నిలబడతారని అంతా అనుకున్నారు. త్రిషను నిలబెడితే నెగిటివిటి వస్తుందని మళ్ళీ రాఘవ లారెన్స్ వైపు చూసారు. విజయ్, లారెన్స్ క్లోజ్ అవ్వడం, లారెన్స్ రాజకీయాల్లోకి వస్తున్నాను అని ప్రకటించడంతో తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ టికెట్ లారెన్స్ కి ఇస్తారని అంతా భావించారు.

లారెన్స్ నో.. మరి టికెట్ ఎవరికి? విజయ్ గెలిచేదెలా?

కానీ లారెన్స్ నేను తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చెయ్యట్లేదు అని అధికారికంగా చెప్పేసాడు. కానీ విజయ్ అడిగితే లారెన్స్ ఒప్పుకుంటాడు. దీంతో మళ్ళీ అందరూ త్రిషకు టికెట్ ఇస్తారా అని చర్చించుకుంటున్నారు. ఇలా విజయ్ గెలిచి రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీలో ఉప ఎన్నికల్లో విజయ్ పార్టీ నుంచి లారెన్స్ లేదా త్రిషని ఎవర్ని నిలబెడతారో అని తమిళ పాలిటిక్స్ లో చర్చగా మారింది. ఈ ఇద్దర్ని కాకుండా ఎవరూ ఊహించని వారికి విజయ్ టికెట్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

విజయ్ నిర్ణయం తమిళ రాజకీయాల్లో కీలక మలుపు కానుంది. తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికల్లో ఎవరు బరిలోకి దిగుతారో చూడాలి. ఈ ఉత్కంఠభరిత పరిణామాలపై మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.