|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

40 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న నటి.. ‘మగవాడ్ని ఇలాంటి ప్రశ్నలు అడగ్గలరా?’

Published: 06-08-2025, 5:22 AM
40 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న నటి.. 'మగవాడ్ని ఇలాంటి ప్రశ్నలు అడగ్గలరా?'

ప్రముఖ కన్నడ నటి భావన రామన్న 40 ఏళ్ల వయసులో కవలలకు తల్లి కాబోతున్నారు. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన ఆమె సీమంత వేడుకలో జరిగిన సంఘటన గురించి ఆమె మాట్లాడారు.

Key Points

1

40 ఏళ్ల వయసులో కవలలకు తల్లి కాబోతున్న కన్నడ నటి భావన రామన్న.

2

ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన ఆమె సింగిల్ మదర్‌గా పిల్లలను పెంచాలని నిర్ణయించుకుంది.

4

మహిళల స్వేచ్ఛా నిర్ణయాలకు సమాజంలో మార్పు రావాలని ఆమె కోరుకుంటున్నారు.

భావన రామన్న సీమంతం

మాతృత్వాన్ని కోరుకోని మహిళ ఉంటుందా? ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఓ వయసు దాటాక తల్లి కావాలని కోరుకుంటుంది. కన్నడ నటి భావన రామన్న ( Bhavana Ramanna ) కూడా అదే ఆశించింది. అమ్మ అని పిలిపించుకోవాలని ఆశపడింది. 40 ఏళ్ల వయసులో ఐవీఎఫ్‌ ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వబోతోంది. ఇంతవరకు ఆమె పెళ్లి చేసుకోలేదు. వివాహానికి దూరంగా ఉన్న ఆమె సింగిల్‌ మదర్‌గానే పిల్లలను పెంచేందుకు సిద్ధమవుతోంది.

సీమంతంలో అలాంటి ప్రశ్నలు తాజాగా ఆమె సీమంతం జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు, బంధుమిత్రులు ఈ ఫంక్షన్‌కు హాజరై ఆమెను దీవించారట! అదే సమయంలో కొందరు తనపై ప్రశ్నల వర్షం కురిపించి ఇబ్బంది పెట్టారంటోంది భావన. ఆమె మాట్లాడుతూ.. నా సీమంతం వేడుక ఎంతో సంతోషంగా జరిగింది. కానీ కొందరు అనవసరమైన ప్రశ్నలు వేయడమే నన్ను షాక్‌కు గురి చేసింది. నాకింకా ఛాన్స్‌ ఉన్నప్పుడు ఇంకా పెళ్లెందుకు చేసుకోలేదన్నారు.

అనవసర ప్రశ్నలు, విమర్శలు

నా ఇష్టం మరికొందరేమో పిల్లల్ని దత్తత తీసుకునే అవకాశం ఒకటుంది, మర్చిపోయావా? అని ఎద్దేవా చేశారు. నేను నా జీవితంలో సంతోషకర క్షణాల్ని ఎంజాయ్‌ చేస్తున్న సమయంలో ఇలాంటి ప్రశ్నలు ఎవరైనా అడుగుతారా? ఇవే ప్రశ్నలు మగవాడిని అడగ్గలరా?నేను పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉంటాను. అందుకు మీకేంటి అభ్యంతరం? నా జీవితం నా ఇష్టం. సమాజంలో చాలావాటిలో మార్పొచ్చింది. కానీ, ఇప్పటికీ మహిళ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు.

నీచమైన కామెంట్లు ఏం చేసినా తప్పుపడుతూనే ఉన్నారు. ఈ విషయంలో మార్పు రావాలి. వెనకటి కాలంలో సంతానం లేని మహిళలను పండగలకు, శుభకార్యాలకు దూరంగా ఉంచేవారు. అది చూసి నా మనసు చివుక్కుమనేది. ఐవీఎఫ్‌ వంటి ఆధునాతన పద్ధతులు.. అలా సంతానం లేనివారిలో ఓ కొత్త ఆశను రేకెత్తిస్తున్నాయి. ప్రతిదాన్నీ తప్పుపట్టడం, నీచమైన కామెంట్లు చేయడం మానండి. ఈ ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పుకొచ్చింది. కన్నడలో అనేక సినిమాలు చేసిన భావన రామన్న తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. చివరగా మలయాళంలో ఒట్ట మూవీ చేసింది.

మహిళల స్వేచ్ఛా నిర్ణయాలు

భావన రామన్న తన అనుభవాలను పంచుకుంటూ, సమాజంలో మార్పు కోసం పిలుపునిచ్చారు. మహిళల స్వేచ్ఛా నిర్ణయాలకు ప్రోత్సాహం అవసరమని, అనవసరమైన ప్రశ్నలు, విమర్శలను ఆపాలని కోరారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.