
📌 Key Points
- కన్నడ నటి శుభ పూంజా 42 ఏళ్ల వయసులో భర్త సుమంత్ బిల్లావాతో విడాకులు తీసుకున్నారు.
- 2022లో వివాహం చేసుకున్న ఈ జంట నాలుగేళ్లకే విడిపోవాలని నిర్ణయించుకుంది.
- మనస్పర్థల కారణంగా మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు.
- శుభ పూంజా 2004లో సినీ రంగ ప్రవేశం చేసి, ‘మొగ్గినా మనసు’తో గుర్తింపు పొందారు.
కన్నడ సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన నటి శుభ పూంజా జీవితంలో ఒక షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. 42 ఏళ్ల వయసులో ఆమె తన భర్త సుమంత్ బిల్లావాతో విడాకులు తీసుకుని మళ్లీ ఒంటరిగా మారారు. నాలుగేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికిన ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
శుభ పూంజా విడాకుల వెనుక అసలు కారణం!
Shubha Divorce: శుభ పూంజా ..కన్నడ సినీ ఇండస్ట్రీలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నఈ ప్రముఖ నటి గురించి ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అందం, అభినయంతో ఒకప్పుడు సౌత్ స్క్రీన్‌పై మెరిసిన ఈ బ్యూటీ, ప్రస్తుతం 42 ఏళ్ళ వయసులో తన భర్తకి విడాకులు ఇచ్చేసిందన్న వార్త సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తుంది.నాలుగేళ్ళ క్రితం ఎంతో వైభవంగా జరిగిన తన పెళ్లి బంధానికి గుడ్‌బై చెప్పేస్తూ, భర్త నుంచి విడిపోయేందుకు ఆమె ఏకంగా కోర్టు మెట్లెక్కడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే… నటి శుభ పూంజా, ప్రముఖ వ్యాపారవేత్త సుమంత్ బిల్లావా కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని 2022లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.కరోనా లాక్‌డౌన్ ఆంక్షల మధ్యలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన వీరి పెళ్లి జరిగింది.ఇక ఈ వేడుక అప్పట్లో కన్నడ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కూడా.
నాలుగేళ్ల బంధానికి ముగింపు: కోర్టు మెట్లెక్కిన జంట
దాదాపు నాలుగేళ్ల పాటు సాఫీగానే సాగుతోందని అందరూ భావించిన వీరి సంసారంలో గత కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య వచ్చిన విభేదాల కారణంగా ఇక కలిసి జీవించడం సాధ్యం కాదని గ్రహించిన ఈ జంట, మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి, లీగల్‌గా విడిపోయేందుకు విడాకుల పిటిషన్ దాఖలు చేశారు.
శుభ పూంజా సినీ కెరీర్ ప్రస్థానం
శుభ పూంజా, సుమంత్ బిల్లావా విడాకుల నిర్ణయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత జీవితంలో ఈ కష్టాన్ని ఎదుర్కొంటున్న శుభ పూంజా, భవిష్యత్తులో తన కెరీర్‌ను ఎలా కొనసాగిస్తారో చూడాలి. ఆమెకు అభిమానుల మద్దతు ఎప్పుడూ ఉంటుంది.


