
📌 Key Points
- రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ తొలిరోజు రూ.135 కోట్ల భారీ ఓపెనింగ్స్ సాధించింది.
- పుష్ప, పెద్ది కథల్లో హీరోలు తమ గుర్తింపు కోసం పోరాడటం ప్రధానాంశం.
- పెద్దిలో హీరో న్యాయమైన మార్గంలో, క్రీడల ద్వారా సమాజానికి స్ఫూర్తినిస్తాడు.
- పుష్పరాజ్ జర్నీ కూలీ నుండి సిండికేట్ లీడర్‌గా ఎదిగే అక్రమ పోరాటం.
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఒకటే చర్చ! రామ్ చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంటే, ‘పుష్ప’తో దీనికి పోలికలు ఎందుకు వస్తున్నాయి? ఈ రెండు భారీ చిత్రాల మధ్య ఉన్న అద్భుతమైన కనెక్షన్ ఏంటి? అసలు నిజాలు తెలుసుకుందాం!
పెద్ది vs పుష్ప: షాకింగ్ పోలికలు!
రామ్ చరణ్ హీరోగా నటించిన `పెద్ది` సినిమా ప్రస్తుతం థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ ని రాబట్టుకుంది. ఈ చిత్రానికి రూ.135కోట్లు వచ్చినట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ మూవీకి అసలు పరీక్ష ఈ శుక్రవారం నుంచే స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు. ఇకపై ఏ స్థాయిలో వసూళ్లని రాబడుతుందనే దాన్ని బట్టి ఈ మూవీ విజయం ఆధార పడి ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి, `పుష్ప`కి పోలికలున్నాయనేది ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్లు షురూ అయ్యాయి. మరి `పుష్ప`కి, `పెద్ది`కి మధ్య ఉన్న పోలికలేంటి? తేడాలేంటి? అనేది చూద్దాం.
`పెద్ది` సినిమా.. అటవి ప్రాంతంలోని ఒక పేరుకి, గుర్తింపుకి నోచుకోని గ్రామ ప్రజల స్ట్రగుల్స్ ని తెలియజేస్తుంది. తమ పుట్టుకకి, తమ ఊరుకి గుర్తింపు లేని ఒక ఆటగాడు.. తమ గుర్తింపు కోసం ఆటని ఎంచుకోవడమే ఈ కథ. గుర్తింపు లేక అనేక అవమానాలు ఎదుర్కొన్న నేపథ్యంలో పెద్ది క్రికెటర్ నుంచి కుస్తీ పోటీలకు టర్న్ తీసుకోవడం, అట్నుంచి రన్నర్‌గా మారడం విశేషం. రన్నింగ్‌లో ఆయన ఛాంపియన్‌గా నిలిచి తమ ఊరుకి గుర్తింపు తీసుకురావడం కోసం ఆయన చేసే పోరాటమే ఈ సినిమా.
గుర్తింపు కోసం పోరాటం: ఎవరు గెలిచారు?
`పుష్ప` కథకి దీనికి సంబంధం ఏంటంటే.. `పుష్ప`లోనూ హీరో తన గుర్తింపు కోసం పోరాడుతుంటాడు. తన కుటుంబంలో తనకు గుర్తింపు లేదు. ఉంచుకున్న తల్లికి పుష్పరాజ్ జన్మిస్తాడు. తండ్రి నుంచి వాళ్లు.. ఇంటిపేరు ఇచ్చేందుకు నిరాకరిస్తారు. పైగా ప్రతి చోట అవమానిస్తారు. అటు పోలీస్ ఆఫీసర్ కూడా అవమానిస్తాడు. దీంతో తన గుర్తింపు కోసం, తానేంటో నిరూపించుకోవడం కోసం హీరో చేసే పోరాటమే ఈ మూవీ. ఎర్రచందనం కులీగా ప్రారంభమైన పుష్పరాజ్ జర్నీ.. కులీ నుంచి కూలీ పెద్దగా, ఆ తర్వాత ఒక ప్రాంతం లీడర్‌గా, అట్నుంచి సిండికేట్ ని శాసించే నాయకుడిగా ఎదగడమే ఈ మూవీ కథ. ఈ లెక్కన పెద్ది కథ, పుష్ప కథ ఒక్కటే అని చెప్పొచ్చు. రెండింటిలోనూ తమ గుర్తింపు కోసం పోరాటమే అని చెప్పాలి.
మరి పుష్ప, పెద్దికి మధ్య ఉన్న తేడాలు ఏంటంటే?.. పెద్దిలో హీరో తమ ఊరు, తమ మనుషుల గుర్తింపు కోసం పోరాడుతాడు. ఒక న్యాయపరమైన పోరాటం చేస్తాడు. యువతకు స్పూర్తినింపే క్రీడని ఎంచుకుంటాడు. ఎన్నో అవమానాలు ఎదురైనా, వాటిని దాటుకొని ప్రపంచ ఛాంపియన్‌గా నిలుస్తాడు. పెద్దిది ఇన్‌స్పైర్ చేసే జర్నీ. తన వారి కోసం పోరాడిన వ్యక్తి కథ. కానీ పుష్పలో తన గుర్తింపు కోసం మాత్రమే హీరో పోరాడుతాడు. పైగా తాను ఎంచుకున్నది కూడా అక్రమ మార్గం. ఎర్రచందన స్మగ్లింగ్ అనేది నేరం. దాన్ని ఎంచుకుని ఆయన బాగా సంపాదించడం, సీఎంలనే మార్చే స్థాయికి ఎదిగడం గమనార్హం. స్మగ్లింగ్ సింగికేట్‌కే రూలర్‌గా మారతాడు పుష్ప.
బాక్సాఫీస్ వద్ద పెద్ది సంచలనం!
పెద్ది సినిమా హీరో స్ట్రగుల్స్ బేస్డ్ గా సాగుతుంది. హీరో ఆవేదన, బాధ ఉంటుంది. అతని పెయిన్ అడగడుగునా కనిపిస్తుంది. కానీ పుష్పలో ఎలివేషన్లు ఉంటాయి. యాక్షన్ సీన్లు, ఎలివేషన్లే ప్రధానంగా ఈ మూవీ సాగుతుంది. పెద్ది ఎమోషన్స్ ప్రధానంగా సాగితే, పుష్ప ఎలివేషన్ల ప్రధానంగా సాగుతుంది. అందుకే పెద్దికి మిశ్రమ స్పందన, పుష్ప బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోయింది. అయితే `పుష్ప`లో నటనకు అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డు వరించింది. ఇప్పుడు పెద్దిలోని రామ్ చరణ్ నటనకు కూడా జాతీయ అవార్డు వస్తుందని భావిస్తున్నారు. `పుష్ప2` మూవీ సుమారు రూ.1800కోట్లు రాబట్టింది. మరి పెద్ది ఏ రేంజ్‌లో వసూళ్లని రాబడుతుందో చూడాలి.
పెద్ది, పుష్ప.. రెండు కథలు, రెండు పోరాటాలు. టాలీవుడ్ తెరపై సంచలనం సృష్టిస్తున్న ఈ చిత్రాల గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం వేచి ఉండండి. బాక్సాఫీస్ వార్ మరింత రసవత్తరంగా మారనుంది!


