|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్: వెంకీ, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ జనవరి 13న ఎందుకు? అసలు రహస్యం ఇదే!

Published: 30-06-2026, 4:37 PM
అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్: వెంకీ, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ జనవరి 13న ఎందుకు? అసలు రహస్యం ఇదే!
  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ జనవరి 13న విడుదల.
  • సంక్రాంతి పండుగ సెలవులను సద్వినియోగం చేసుకోవడమే ప్రధాన లక్ష్యం.
  • గతంలో అనిల్ రావిపూడి F2, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో సంక్రాంతి హిట్స్ ఇచ్చారు.
  • ‘సంక్రాంతి మొగుళ్ళు’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు.

డైరెక్టర్ అనిల్ రావిపూడి తన కొత్త మల్టీస్టారర్ చిత్రాన్ని జనవరి 13న విడుదల చేయనున్నారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి సెలవులను లక్ష్యంగా చేసుకుని వస్తోంది. అనిల్ గత విజయాలను బట్టి, ఇది ఒక తెలివైన వ్యూహంగా కనిపిస్తోంది.

అనిల్ రావిపూడి సంక్రాంతి సెంటిమెంట్

Sankranti Release :’సంక్రాంతి పండగ నా అడ్డా’ అని ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇదే క్రమంలో తాజాగా మొదలెట్టిన విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో మొదలెట్టిన సినిమా కూడా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు ఫిలిం నగర్ సర్కిల్ వినిపిస్తుంది .

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో 13 అంటే డెవిల్ నెంబర్ గా భావిస్తారు కానీ అనిల్ రావిపూడి వ్యవహారం మాత్రం దీనికి భిన్నంగా కనిపిస్తుంది. పండగ సీజన్ ని క్యాష్ చేసుకోవడంలో ఆరితేరిన ఈ కుర్ర డైరెక్టర్ 13వ తేదీ తర్వాత వచ్చే హాలిడేస్ ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు తప్ప ఇలాంటి నెంబర్ భయాలని  అస్సలు పట్టించుకోనట్టే కనిపిస్తుంది .

జనవరి 13 అంటే సంక్రాంతికి ముందు వచ్చే భోగి. ఇక ఆ తర్వాత వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి ఎలాగు ఉండనే ఉంది ,తర్వాత  కనుమ.సో వరుస  పబ్లిక్ హాలిడేస్ లలో సాలిడ్  కలెక్షన్స్ ని కొల్లగొట్టడానికి ఇది ఒక మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ అనే చెప్పాలి. గతంలో అనిల్ రావిపూడి ఇచ్చిన బ్లాక్ బాస్టర్స్ ని పరిశీలిస్తే ఈ ప్లాన్ వెనుకున్న అస్సల్ సీక్రెట్ క్లియర్ గా అర్థమవుతుంది కూడా .

జనవరి 13 రిలీజ్ వెనుక అసలు వ్యూహం

వెంకటేష్ తో చేసిన ఎఫ్2 సినిమా 12న రిలీజ్ అయి సూపర్ హిట్ కాగా మహేష్ బాబుతో తీసిన సరిలేరు నీకెవ్వరు సినిమా జనవరి 12న రిలీజ్ అయి సాలిడ్ కలెక్షన్స్ ని కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఇక 2025లో దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా, 2026 లో సాహూ గార పాటి నిర్మాణంలో జనవరి 14న వచ్చిన మన శంకర్ ప్రసాద్ గారు సినిమా ఎలాంటి సాలిడ్ కలెక్షన్స్ రాబట్టాయో  చెప్పక్కర్లేదు అలా వరుసగా పండుగ సీజన్లోనే హిట్టు కొడుతూ హిట్ మిషిన్ గా మారిన ఈ కుర్ర డైరెక్టర్ తన పదవ సినిమాకి కూడా అదే రూట్ మ్యాప్ ని సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తుంది.

ఇక వెంకీ కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకి సంక్రాంతి మొగుళ్ళు అనే టైటిల్ పెట్టనున్నారని ఫిలిం సర్కిల్లో గట్టిగా వినిపిస్తుంది. ఇక ఈ సినిమాకి మరో ఎసెట్ ఏంటంటే డిఫరెంట్ ఇమేజ్ ఉన్న స్టాఫ్ హీరోలు స్క్రీన్ షేర్ చేసుకోవడం. తనకు డైరెక్టర్ గా  లైఫ్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ .అలాగే తన కెరీర్ లో 100 కోట్ల సినిమాని ఇచ్చిన విక్టరీ వెంకటేష్ ని ఒకే ఫ్రేమ్ లో చూపించబోతున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

వెంకీ-కళ్యాణ్ రామ్ కాంబినేషన్ ప్రత్యేకతలు

ఇక ఈ సినిమాకి కోలీవుడ్ మల్టీ టాలెంటెడ్ జీవి ప్రకాష్ సంగీతమందిస్తుండడం విశేషం .మొత్తానికి సెంటిమెంట్ల ప్రకారం 13వ తేదీని డెవిల్ నెంబర్ అనుకున్న బాక్సాఫీస్ వద్ద హాలిడేస్ లలో వచ్చే ఓపెనింగ్స్ ముందు ఏ సెంటిమెంట్లు పనిచేయవని కంటెంట్ బాగుంటే ఆ డెవిల్ నెంబర్ లక్కీ నెంబర్ గా మారుతుందని అని రావిపూడి గట్టిగా ఫిక్స్ అయ్యాడన్నమాట చూడాలి మరి పొంగల్ బరిలో దిగుతూ వరుస సక్సెస్ లు చూస్తున్న అనిల్ రావిపూడి కి జనవరి 13 ఇలాంటి జ్ఞాపకాలను మిగులుస్తుందో!

సంక్రాంతి పండగ సీజన్‌ను అనిల్ రావిపూడి మరోసారి తన అడ్డాగా మార్చుకోవాలని చూస్తున్నారు. జనవరి 13న విడుదలవుతున్న ఈ మల్టీస్టారర్, వరుస సెలవులతో భారీ వసూళ్లను సాధించడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.