
📌 Key Points
- జూన్ నెలలో సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.
- జూలై మొదటి వారంలో పలు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్‌కు సిద్ధం.
- సత్యదేవ్ ‘రావు బహదూర్’ జూలై 3న విడుదల.
- ‘నాగబంధం’, ‘ఆల్ఫా’, ‘బేబీ డూ డై డూ’ కూడా ఈ వారం బాక్సాఫీస్ బరిలో.
జూన్ నెలలో నిరాశపరిచిన టాలీవుడ్ బాక్సాఫీస్, జూలై మొదటి వారంలో తిరిగి సందడి చేయనుంది. ఈ వారం పలు కొత్త సినిమాలు థియేటర్లలోకి వస్తుండగా, వాటి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.
జూలైలో స్టార్ హీరోల సందడి
Theater Releases : ప్రతి నెల టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి.. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో సినిమాల సందడి కాస్త తగినట్లు అనిపిస్తుంది.. జూన్ నెలలో రిలీజ్ అయిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు.. పెద్ది, మా ఇంటి బంగారం సినిమాలు తప్ప మిగిలిన సినిమాలు అంతగా బాక్సాఫీస్ వద్ద టాక్ ని సొంతం చేసుకోలేకపోయాయి.. అయితే జూలై నెలలో స్టార్ హీరోల సినిమాలు చాలావరకు రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్నాయి.. మరి ఈ జూలై మొదటి వారం థియేటర్లలోకి ఏఏ సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం రావు బహదూర్.. కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేశ్ మహా తెరకెక్కించిన సైకలాజికల్ ఎమోషనల్ డ్రామా చిత్రం ఇది.. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు బయటకు వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ముఖ్యంగా సత్యదేవ్ గెటప్ మాత్రం అంచనాలను పెంచేస్తుంది. ఇక దీప థామస్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో A+S మూవీస్, శ్రీచక్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈనెల జూలై 3న మూవీ థియేటర్లలోకి రాబోతుంది..
ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలు
యంగ్ హీరో విరాట్ కర్ణా హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం నాగబంధం.. అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యాన్ ఇండియా యాక్షన్ మైథాలజికల్ మూవీ. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ కూడా సినిమా పై హైప్ ను క్రియేట్ చేస్తున్నారు.. ఈవారం బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా పోటీ పడబోతుంది.. జులై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.
యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లో రూపొందిన తొలి మహిళా ప్రధాన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఆల్ఫా.. ఆలియా భట్, శర్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం హిందీతో పాటుగా తెలుగు, తమిళ భాషల్లో జూలై 3న థియేటర్లలోకి రానుంది..
వివిధ జానర్ల మధ్య పోటీ
వీటితో పాటుగా బాలీవుడ్ ప్రముఖ నటి హుమా ఖురేషి నటించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘బేబీ డూ డై డూ’.. ఇది కూడా జూలై 3న థియేటర్లలో రిలీజ్ అవుతుంది.. మొత్తానికి జూలై మొదటివారం బాక్సాఫీస్ వద్ద యాక్షన్, మైథలాజికల్, సైకలాజికల్ డ్రామా, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు పోటీ పడుతున్నాయి.. మరి ఈ సినిమాలలో ఏ సినిమా బాక్సాఫీస్ విన్నర్ గా నిలుస్తుందో చూడాలి.. గత వారంతో పోలిస్తే ఈ వారం ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలే ఎక్కువగా వస్తున్నాయని తెలుస్తుంది.. థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలతో పాటుగా అటు ఓటీటీలో కూడా చాలా సినిమాలు రాబోతున్నాయి.
మొత్తానికి జూలై మొదటి వారం బాక్సాఫీస్ వద్ద యాక్షన్, మైథలాజికల్, సైకలాజికల్ డ్రామా, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ చిత్రాలు ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తాయో వేచి చూడాలి.


