|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సౌందర్య మరణం వెనుక షాకింగ్ నిజాలు! రెండు లక్షల ఆఫర్.. దర్శకుడు గీతా కృష్ణ సంచలన వ్యాఖ్యలు!

Published: 02-07-2026, 2:33 AM
సౌందర్య మరణం వెనుక షాకింగ్ నిజాలు! రెండు లక్షల ఆఫర్.. దర్శకుడు గీతా కృష్ణ సంచలన వ్యాఖ్యలు!
  • సౌందర్య మరణానికి కారణం రెండు లక్షల ఆఫరేనని దర్శకుడు గీతా కృష్ణ షాకింగ్ నిజం బయటపెట్టారు.
  • ఎన్నికల ప్రచారానికి వెళ్లకపోతే సౌందర్య బతికేదని గీతా కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
  • హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె సోదరుడు అమర్‌నాథ్ కూడా మరణించారు.
  • టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సౌందర్య మరణంపై అభిమానుల్లో తీవ్ర చర్చ.

టాలీవుడ్ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన నటి సౌందర్య మరణంపై ఇప్పుడు సంచలన నిజాలు బయటపడ్డాయి. ఒక దర్శకుడు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీని, అభిమానులను తీవ్ర షాక్‌కు గురిచేస్తున్నాయి. అసలు సౌందర్య మరణం వెనుక ఉన్న రహస్యం ఏంటి? పూర్తి వివరాలు చూసేయండి!

సౌందర్య మరణంపై దర్శకుడి సంచలన వ్యాఖ్యలు!

సౌందర్య.. హీరోయిన్‌గా తనకంటూ సెపరేట్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకుంది. గ్లామర్‌ ప్రపంచంలోనూ పద్ధతిగా ఉండటం ఎలాగో చాటి చెప్పింది. చీర కట్టుతో ఆ చీరకే అందం తెచ్చింది సౌందర్య. మంచి కంటెంట్ ఉన్న చిత్రాల్లో నటించి మెప్పించింది. అత్యధిక సక్సెస్‌ రేట్‌ని సొంతం చేసుకుంది. అప్పట్లో సౌందర్య, వెంకటేష్‌ కాంబినేషన్‌కి మంచి క్రేజ్‌ ఉండేది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన చాలా సినిమాలు విజయాలు సాధించాయి.

చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున, బాలకృష్ణ, మోహన్‌ బాబు, రాజశేఖర్, జగపతిబాబు, జేడీ చక్రవర్తి వంటి వారితోనూ సినిమాలు చేసి మెప్పించింది. తెలుగులో తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌ రాణించింది. సౌందర్యకి కొంత మంది హీరోలతో ఎఫైర్లు ఉన్నాయనే వార్తలు అప్పట్లో వినిపించాయి. జగపతిబాబు, వెంకటేష్‌తో ప్రధానంగా వినిపించాయి. కానీ వాటికి ఫుల్‌ స్టాప్‌ పెడుతూ, సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్ రఘుని పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిల్‌ అయ్యింది. పెళ్లైన ఏడాదికే ఆమె చనిపోయింది.

రెండు లక్షల ఆఫర్ వెనుక అసలు నిజం ఏంటి?

2004లో ఎన్నికల సమయంలో ఆమె బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లింది. హెలికాఫ్టర్‌లో వెళ్తుండగా, అందులో ప్రమాదం చోటు చేసుకొని పడిపోయింది. ఈ ప్రమాదంలో సౌందర్యతోపాటు ఆమె సోదరుడు అమర్‌నాథ్‌ కూడా చనిపోయాడు. అప్పట్లో ఈ ఘోర ప్రమాదం అందరిని కలిచివేసింది. ఇండస్ట్రీని కుదిపేసింది. ఎవరూ నమ్మలేకపోయారు. అభిమానులు తల్లడిల్లిపోయారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై తాజాగా దర్శకుడు గీతా కృష్ణ స్పందించారు. ఆమె చాలా మంచి అమ్మాయి అయిన, ఒకసారి హైదరాబాద్‌ వచ్చినప్పుడు ప్రశాంత్‌ కుటీర్‌లో ఉండమని తానే సజెస్ట్ చేశానని, ఆ తర్వాత ఆమె ఎప్పుడు వచ్చినా అక్కడే ఉండేదని తెలిపారు. ఆమెతో వర్క్ చేసే అవకాశం తనకు రాలేదని చెప్పారు.

సౌందర్య నటిగా ఎంతగానో ఆకట్టుకుందని, ఆమె గొప్ప నటి అని చెప్పారు. గొప్ప కలర్‌ ఏమీ కాదని, కానీ స్క్రీన్‌ లుక్‌ మాత్రం అదిరిపోయేదని, మన ఇంటి అమ్మాయిలానే ఉండేదని చెప్పారు. అయితే కెరీర్‌ మంచి పీక్‌లో ఉండగానే ఆమె తప్పు చేసిందని చెప్పారు. బీజేపీ నాయకుడు విద్యాసాగర్‌ రావు రెండు లక్షలు ఆఫర్‌ చేస్తే ఎన్నికల ప్రచారానికి వెళ్లిందని, ఈ సమయంలోనే ఆమె ప్రమాదానికి గురై మరణించిందన్నారు. రెండు లక్షలకు కక్కుర్తి పడి చివరికి తన ప్రాణాలే తీసుకుందని చెప్పారు గీతా కృష్ణ. ఆ రోజు ఎన్నికల ప్రచారానికి పోకుండా ఉండి ఉంటే, ఇప్పుడు మనం సౌందర్యని చూసుకునేవాళ్లమని వెల్లడించారు.

అభిమానులను కలచివేస్తున్న గీతా కృష్ణ మాటలు!

కన్నడకు చెందిన సౌందర్య.. `మనవరాలి పెళ్లి` అనే చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యింది. `రాజేంద్రుడు గజేంద్రుడు`, `మాయలోడు` చిత్రాలతో విజయాలు అందుకుంది. `నెంబర్‌ వన్‌`, `హలో బ్రదర్‌`, `అల్లరి ప్రేమికుడు`, `సూపర్‌ పోలీస్‌`, `మేడం`, `టాప్‌ హీరో`, `అమ్మదొంగ`, `రాజా సింహం`, `పెదరాయుడు`, `భలే బుల్లోడు`, `అమ్మోరు`, `రిక్షావోడు`, `ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు`, `పవిత్ర బంధం`, `పెళ్లి చేసుకుందాం`, `చూడాలని వుంది`, `శ్రీ రాములయ్య`, `అంతపురం`, `రాజా`, `ప్రేమకు వేళయేరా`, `అన్నయ్య`, `రవన్న`, `మూడు ముక్కలాట`, `నిన్నే ప్రేమిస్తా`, `అజాద్‌`, `జయం మనదేరా`, `దేవి పుత్రుడు`, `ఎదురులేని మనిషి`, `కలిసి నడుద్దాం`, `కొండవీటి సింహం` వంటి చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా రాణఙంచింది సౌందర్య.

సౌందర్య మరణంపై దర్శకుడు గీతా కృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. ఆమె మరణం వెనుక ఉన్న ఈ కోణం నిజంగా షాకింగ్‌గా ఉంది. మరిన్ని సంచలన అప్‌డేట్స్ కోసం మా పేజీని చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.