|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తన తెలంగాణ యాసపై ట్రోల్స్.. చెంపచెల్లుమనిపించే సమాధానం ఇచ్చిన విజయ్ దేవరకొండ

Published: 02-08-2025, 9:15 PM
తన తెలంగాణ యాసపై ట్రోల్స్.. చెంపచెల్లుమనిపించే సమాధానం ఇచ్చిన విజయ్ దేవరకొండ

‘కింగ్డమ్’ సినిమాతో విజయవంతమైన రన్ చేస్తున్న విజయ్ దేవరకొండ, సినిమా విజయం, తన తెలంగాణ యాసపై వచ్చిన ట్రోల్స్‌కు సమాధానం ఇచ్చారు. ఈ విషయాల గురించి ఆయన పంచుకున్న ఆసక్తికర విషయాలివి.

Key Points

1

విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' సినిమా సక్సెస్‌ను జరుపుకుంటున్నారు.

2

తెలంగాణ యాసపై వచ్చిన ట్రోల్స్‌కు ఆయన సమాధానం ఇచ్చారు.

4

ప్రేక్షకుల ప్రేమకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

‘కింగ్డమ్’ సినిమా విజయం

విజయ్‌ దేవరకొండ తాజాగా `కింగ్డమ్‌` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ సినిమా విజయవంతంగా రన్‌ అవుతోంది. మంచి వసూళ్లని రాబడుతోంది. ఈ నేపథ్యంలో శనివారం విజయ్‌ దేవరకొండ ప్రింట్‌, వెబ్‌ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆఫీస్‌లో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. `కింగ్డమ్‌` సక్సెస్‌కి సంబంధించిన బెస్ట్ కాంప్లిమెంట్స్ గురించి వెల్లడించారు. అలాగే తన తెలంగాణ యాసపై ట్రోల్స్ పై కూడా రియాక్ట్ అయ్యారు.

`కింగ్డమ్‌` మూవీకి బెస్ట్ కాంప్లిమెంట్స్ ని వివరిస్తూ, `ఈ సినిమా సక్సెస్‌తో చాలా రిలీఫ్‌ అయ్యాను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాలలో, ఓవర్సీస్ లో సినిమాకి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా మలయాళంలో ఈ స్థాయి స్పందన ఊహించలేదు. మలయాళ వెర్షన్ విడుదల చేయకపోయినా అక్కడి ప్రేక్షకులు ఇంతటి ప్రేమ చూపించడం చాలా ఆనందంగా ఉంది. కెరీర్ ప్రారంభంలో సినిమా హిట్ అయితే సెలెబ్రేట్ చేసుకోవాలనే ఆలోచన ఉండదు. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే ఇంకో సినిమా చేసే అవకాశం వస్తుందని ఆశ ఉంటుంది. `పెళ్లి చూపులు` హిట్ అయినప్పుడు ఇంకొన్ని అవకాశాలు వస్తాయని ఆనందపడ్డాను. కానీ, ఇప్పుడు అలా కాదు. సినిమా హిట్ అయితే ఆనందం కంటే కూడా మరిన్ని మంచి సినిమాలు చేయాలనే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ సినిమా విడుదలకు ముందు ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. `కింగ్‌డమ్` విడుదలకు ముందు నాక్కూడా అలాంటి ఒత్తిడి ఉంది. ఎప్పుడైతే మొదటి షో పూర్తయ్యి, పాజిటివ్ టాక్‌ వచ్చిందో అప్పుడు రిలీఫ్‌ అయ్యాను` అని అన్నారు విజయ్‌.

తెలంగాణ యాసపై ట్రోల్స్

`సినిమా బాగుందని అందరు చెబుతుంటారు. అది కామన్‌, కానీ మనల్ని బాగా ప్రేమించేవాళ్లు పంచుకునే ఆనందం వేరే లెవల్‌లో ఉంటుంది. పదేళ్ల క్రితం నేనంటే ఎవరో కూడా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు కొన్ని లక్షల, కోట్ల మందికి తెలుసు. నన్ను చూసి సినిమా చూసేందుకు థియేటర్‌కి వస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత హిట్‌ కొడితే వారంతా ఎమోషనల్‌ అవుతున్నారు. `అన్నా మనం కొట్టామన్నా` అంటూ ఏడుస్తూ మెసేజ్‌లు, వీడియోలు పంపుతుంటే ఇంతకంటే ఏం కావాలనిపించింది. ఇంతటి ప్రేమని పొందుతున్నందుకు యాక్టర్ గా నేను లక్కీగా భావిస్తున్నా. వారి ప్రేమని మాటల్లో చెప్పలేను. వాళ్లు ఏడుస్తూ వీడియోలు పంపుతుంటే నాకు కూడా ఎమోషనల్‌`గా ఉందన్నారు విజయ్‌ దేవరకొండ.

`కింగ్డమ్‌` సినిమాకి ఇండస్ట్రీ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది అనే ప్రశ్నకి విజయ్‌ స్పందిస్తూ, యూఎస్‌లో సినిమా చూసిన దర్శకుడు సుకుమార్‌ నాకు ఫోన్ చేశారు. సినిమా తనకు ఎంతగానో నచ్చిందని చెప్పారు. నాకు సుకుమార్ గారంటే ఎంతో ఇష్టం. ఆయన నుంచి ప్రశంసలు రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. `అర్జున్ రెడ్డి` సమయం నుంచే నేను, సుకుమార్ గారు కలిసి సినిమా చేయాలి అనుకుంటున్నాం. ఆయనకు కూడా నేనంటే ఇష్టం. భవిష్యత్ లో మా కలయికలో సినిమా వస్తుందని ఆశిస్తున్నాను. ప్రస్తుతం అయితే నా దృష్టి అంతా నా చేతిలో ఉన్న సినిమాలపైనే ఉంది` అని చెప్పారు విజయ్‌.

ప్రేక్షకుల ప్రేమ

ఈ సందర్భంగానే తెలంగాణ యాసపై ప్రశ్న ఎదురైంది. `కల్కి`లో అర్జునుడు పాత్రకి డైలాగ్‌ డెలివరీ తెలంగాణ యాసకి దగ్గరగా ఉందని అప్పట్లో చాలా మంది విజయ్‌ని ట్రోల్‌ చేశారు. దీనిపై విజయ్‌ స్పందస్తూ చెంపచెల్లుమనిపించే సమాధానం ఇచ్చారు. అర్జునుడు ఏ భాషలో మాట్లాడాడో తెలిస్తే చెప్పాలని, అర్జునుడు డైలాగ్‌లను వేరే యాసలో చెబితే వినాలని ఉందని, అర్జునుడికి ఇదే భాషలో మాట్లాడాలనే రూల్‌ ఏదైనా ఉందా? ఆయన ఏ యాసలో మాట్లాడారో మీకు తెలుసా అని ప్రశ్నించారు. సైలెంట్‌గా ట్రోలర్స్ కి మతిపోయే సమాధానం చెప్పారు. సినిమాలో మాదిరిగా తాను కూడా ఓ దేశానికి రాజు అయితే ఏం చేస్తానో తెలిపారు. మనం కులాలు, మతాలు, ప్రాంతాలు అనే బారియర్స్ ని గిరుగీసుకుని బతుకుతున్నాం. కొందరు తమ రాజకీయ, అధికార స్వలాభం కోసం ఇవన్నీ సృష్టించారని, తాను రాజు అయితే ఈ బారియర్స్ అన్నింటిని బ్రేక్‌ చేస్తానని చెప్పారు విజయ్‌ దేవరకొండ.

విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమా విజయంతో పాటు ప్రేక్షకుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ యాసపై వచ్చిన విమర్శలకు ఆయన స్పందన ఆసక్తికరంగా ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.