
📌 Key Points
- టాక్సిక్ మూవీ తెలుగు హక్కులు దక్కించుకున్న దిల్ రాజు – భారీ ప్లానింగ్‌తో ఈవెంట్!
- యశ్ టాక్సిక్ మూవీ ఈవెంట్‌కు గెస్ట్‌లుగా రానున్న టాలీవుడ్ స్టార్ హీరోలు!
- 120 కోట్లతో టాక్సిక్ హక్కులు కొనుగోలు చేసిన దిల్ రాజు – టాలీవుడ్‌లో సరికొత్త రికార్డ్!
- దురంధర్-2కు పోటీగా యశ్ టాక్సిక్ – బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు!
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ మూవీ టాలీవుడ్‌లో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ ధరకు సొంతం చేసుకున్నారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
దిల్ రాజు చేతికి టాక్సిక్ మూవీ హక్కులు!
Toxic : కేజీఎఫ్-2 తర్వాత కన్నడ స్టార్ యశ్ చేస్తున్న సినిమా టాక్సిక్. ఈ మూవీ మార్చి 19న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన టాక్సిక్ మూవీ ట్రైలర్‌కు ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. అయితే టాక్సిక్ సినిమాను తెలుగులో భారీ స్థాయిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు.
దాదాపు 120 కోట్లతో టాక్సిక్ రైట్స్ దక్కించుకున్న ఆయన.. మూవీ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారట. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఏ సినిమా ఈవెంట్ జరగని రేంజ్‌లో టాక్సిక్ మూవీ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది.
టాలీవుడ్ స్టార్స్ గెస్ట్‌లుగా టాక్సిక్ ఈవెంట్!
సినిమా రిలీజ్‌కు టైమ్ దగ్గర పడుతుండటంతో చాలా డిఫరెంట్‌గా ప్రమోషన్స్ ప్లానింగ్స్ చేస్తున్నారట దిల్‌రాజు. అంతే కాదు ఈవెంట్‌కు గెస్ట్‌లు కూడా చాలామందే ఉన్నారని జూనీయర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రభాస్ లాంటి స్టార్స్ ఈవెంట్ కు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు.
దురంధర్-2కు టాక్సిక్ పోటీ.. బాక్సాఫీస్ బద్దలే!
ఇక ఇటీవల రిలీజ్ అయిన టాక్సిక్ మూవీ టీజర్, ట్రైలర్ కూడా పుల్ హైప్ క్రియేట్ చేయటంతో సినిమాపై చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయంటున్నారు. ఇది పక్కా ధురంధర్-2కు కాంపిటేషన్ అంటున్నారు. టాక్సిక్ మూవీ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడ జరుపుతారో, ఎవరెవరు గెస్ట్‌లుగా వస్తారో వేచి చూడాలి.
టాక్సిక్ మూవీ గురించి వస్తున్న ఈ వార్తలు టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


