|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉస్తాద్ భగత్ సింగ్ పాట రెస్పాన్స్ లేదు! పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిరాశ?

Published: 25-02-2026, 1:05 PM
ఉస్తాద్ భగత్ సింగ్ పాట రెస్పాన్స్ లేదు! పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిరాశ?
  • పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మార్చి 26న విడుదల కానుంది.
  • హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
  • ‘దేఖ్‌లేంగే సాలా’ పాటకు మంచి స్పందన లభించింది.
  • ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పాట ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మార్చి 26న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటల్లో ‘దేఖ్‌లేంగే సాలా’ మంచి స్పందన రాబట్టింది. అయితే, ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

మార్చి 26న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల

Aura of Ustaad: ‘ఓజీ’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నుంచి రాబోతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ‘గబ్బర్ సింగ్’ దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం మార్చి 26న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదట ఏప్రిల్‌లో రిలీజ్ అన్నారు. కానీ, మార్చి 27కి రావాల్సిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం వాయిదా పడటంతో, ఆ డేట్ కంటే ఒక రోజు ముందు ఈ సినిమాను థియేటర్లలోకి దించబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మరోవైపు మ్యూజిక్ ప్రమోషన్స్‌ కూడా స్టార్ట్ చేసి, రెండు పాటలను విడుదల చేశారు. అందులో న్యూ ఇయర్ స్పెషల్‌గా వచ్చిన ‘దేఖ్‌లేంగే సాలా’ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా వచ్చిన ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ (Aura of Ustaad) మాత్రం అనుకున్నంతగా వినబడటం లేదు.

‘దేఖ్‌లేంగే సాలా’కు మంచి స్పందన

ఈ మధ్య మెగా ఫ్యామిలీ హీరోల చిత్రాల నుంచి వచ్చిన సాంగ్స్ అన్నీ చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ లోని ‘మీసాల పిల్ల’ సాంగ్ సెన్సేషన్‌ని క్రియేట్ చేయగా, ‘పెద్ది’ నుంచి వచ్చిన ‘చికిరి చికిరి’ అయితే రికార్డులను కొల్లగొడుతూ దూసుకెళుతోంది. పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన ‘దేఖ్‌లేంగే సాలా’ కూడా మంచి స్పందనను రాబట్టుకుంది. కానీ, రెండో పాటగా వచ్చిన ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ మాత్రం మరీ డబ్బా కొట్టించుకున్నట్లుగా లిరిక్స్ ఉన్నాయనేలా ఫీడ్ బ్యాక్‌ని సొంతం చేసుకుంటుంది. నిజంగా పవన్ కళ్యాణ్‌పై అభిమానంతో హరీష్, చంద్రబోస్ ఈ ప్రయోగం చేశారు. ‘మెడ పట్టుకుంటే తొడ కొట్టినట్టే’.. ఇలా పద ప్రయోగాలైతే బాగానే ఉన్నాయి కానీ, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్న స్థాయిని దృష్టిలో పెట్టుకుని, సహజంగా లిరిక్స్ ఉంటే బాగుండేదని ఫ్యాన్స్‌లోనే కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పాటపై విమర్శలు

మరోవైపు డై హార్డ్ ఫ్యాన్స్‌కి మాత్రం ఈ పాటలోని లిరిక్స్ బాగా నచ్చుతున్నాయి. వాళ్లంతా హరీష్‌కు థ్యాంక్స్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. మాములుగా అయితే, ఈ టైమ్‌కి పాట మోత మోగుతూ ఉండాలి. కానీ ఎక్కడా సౌండే లేదు. అంటే, ఈ పాట అంతగా జనాలకు ఎక్కలేదనే చెప్పుకోవాలి. అందుకే ఈ పాటను ఎలాగైనా జనాల్లోకి తీసుకెళ్లాలని, ఎప్పుడూ లేని విధంగా హరీష్ శంకర్ కూడా ప్రమోషన్స్ చేస్తుండటం విశేషం. ఆయన అలా ప్రమోషన్స్‌కు దిగినప్పుడే.. ఈ పాట అంతగా క్లిక్ అవ్వలేదనేలా టాక్ మొదలైంది. ఇంకా ఈ మెడ, తొడలు కాకుండా, మంచి సాహిత్యంతో పవన్ కళ్యాణ్‌కు పాటలు ఇవ్వాలని నెటిజన్లు కూడా కోరుకుంటున్నారు. చూద్దాం మరి.. ఇకపై రాబోయే పాటలు ఎలా ఉంటాయో? శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

మొత్తానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. పాటల విషయంలో మిశ్రమ స్పందనలు వస్తున్నప్పటికీ, సినిమాపై అంచనాలు మాత్రం భారీగా ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.