|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దూరదర్శని రివ్యూ: వింటేజ్ లవ్ స్టోరీ.. బ్లాక్‌బస్టరా? షాకింగ్ రిపోర్ట్!

Published: 23-06-2026, 1:18 AM
దూరదర్శని రివ్యూ: వింటేజ్ లవ్ స్టోరీ.. బ్లాక్‌బస్టరా? షాకింగ్ రిపోర్ట్!
  • సువిక్షిత్ బొజ్జ, గీతికా రతన్ జంటగా ‘దూరదర్శని’ సినిమా గ్రాండ్ రిలీజ్!
  • 90ల నాటి విలేజ్ లవ్ స్టోరీ.. ప్రేక్షకులను ఆకట్టుకుందా? బ్లాక్‌బస్టర్ టాక్ ఏంటి?
  • కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వరాహ మూవీ మేకర్స్ నిర్మించిన వింటేజ్ చిత్రం!
  • ఎమోషనల్ ప్రేమకథ, నోస్టాల్జియా ఫీలింగ్.. రివ్యూలో పూర్తి వివరాలు!

టాలీవుడ్‌లో ఇప్పుడు వింటేజ్ లవ్ స్టోరీల ట్రెండ్ నడుస్తోంది! ఆ కోవలోనే వచ్చిన ‘దూరదర్శని’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 90ల నాటి ప్రేమకథతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను మాయ చేసిందా? ఆసక్తికరమైన రివ్యూ కోసం సిద్ధంగా ఉండండి!

వింటేజ్ ప్రేమకథ: ఆనాటి జ్ఞాపకాలు!

ఇటీవల కాలంలో విలేజ్‌ నేపథ్యంలో చాలా చిత్రాలు రూపొందుతున్నాయి. ముఖ్యంగా వింటేజ్‌ లవ్‌స్టోరీస్‌ ట్రెండ్‌ నడుస్తుంది. 80, 90 నాటి కథలతో మంచి విజయాలు అందుకుంటున్నారు మేకర్స్. అవి మళ్లీ పాతరోజులకు తీసుకెళ్తూ ఒక నోస్టాల్జియా ఫీలింగ్‌ని తెప్పిస్తున్నాయి. తాజాగా వింటేజ్‌ విలేజ్‌ లవ్‌స్టోరీతో `దూరదర్శని` సినిమా రూపొందింది. దీనికి కార్తికేయ కొమ్మి దర్శకత్వం వహించగా, వరాహ మూవీ మేకర్స్ పతాకంపై జయశంకర్‌ రెడ్డి ఎం, పాటి మీది సంతోష్‌ నిర్మించారు. సువిక్షిత్‌ బొజ్జ, గీతిక రతన్‌ జంటగా నటించిన ఈ చిత్రం నేడు శుక్రవారం(మే 15న) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

90 టైమ్‌లో మట్టిపర్రు అనే విలేజ్‌లో సాగే కథ ఇది. హరి(సువిక్షిత్‌), వాణి(గీతికా రతన్‌)ని ప్రేమిస్తుంటాడు. వీరిద్దరి ప్రేమకి అప్పట్లో ఒక దూరదర్శని టీవీ అడ్డా అవుతుంది. పేకబాబు(భాస్కర్‌) ఇంట్లోనే టీవీ ఉంటుంది. ఆ టీవీ చూడ్డానికి వెళ్లి వాణిని ఇష్టపడతాడు హరి.  ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ఇష్టం ఉంటుంది, కానీ బయటకు చెప్పుకోలేరు. వాణికి తన ప్రేమని చెప్పాలని ప్రయత్నం చేస్తుంటాడు హరి, కానీ కుదరదు. అయితే వీరిద్దరి మధ్య లవ్‌ ట్రాక్‌ నడుస్తుందని పేకబాబుకి తెలుస్తుంది. అదే సమయంలో వాణిపై మనసు పడతాడు పేకబాబు. హరిని, వాణిని విడగొట్టాలని ప్రయత్నం చేస్తాడు. వాణి అన్న పరశురామ్‌(విజయ్‌ కృష్ణారెడ్డి)కి లేనిపోనిది చెప్పి గొడవలు పెడతాడు. కులం పేరుతో ఊర్లోనూ గొడవలు పెడతాడు. వాణిల ప్రేమ విషయం  తెలిసి పరశురామ్‌ ఏం చేశాడు? కులం గొడవలతో ఊరు ఎలా మారిపోయింది? పరువు కోసం జరిగే ఈ ప్రేమ యుద్ధంలో ప్రేమ గెలిచిందా? పరువు గెలిచిందా? హరి, వాణిల ప్రేమ కథ విషాదాంతమా? సుఖాంతమా? అనేది మిగిలిన సినిమా.

వింటేజ్‌ లవ్‌ స్టోరీస్‌ మనల్ని మళ్లీ పాతకాలంలోకి తీసుకెళ్తాయి. అప్పటి తీపి గుర్తులను గుర్తు చేసుకుంటాయి. ఒక అద్భుతమైన ఫీలింగ్‌ని అందిస్తాయి. నవ్విస్తాయి, కవ్విస్తాయి. భావోద్వేగానికి గురి చేస్తాయి. అయితే వాటిని అంతే సహజంగా, అంతే బాగా తెరకెక్కిస్తేనే. లేదంటే చిరాకు తెప్పించడం ఖాయం. ఇటీవల వస్తోన్న చాలా సినిమాలు ఇలానే ఉంటాయి. ఆకట్టుకునే చిత్రాలు ఒకటి అర మాత్రమే ఉంటాయి. ఆ కోవలో `దూరదర్శని` మూవీ కొంత పాజిటివ్‌ సైడ్‌ ఉంటుందని చెప్పొచ్చు. ఇది కూడా అప్పటి రోజులను గుర్తు చేస్తుంది. మనకు టీవీ లేని రోజుల్లో దూరదర్శని ఒక్కటే టీవీ ఉన్న రోజుల్లో ఊర్లో అందరు దాని వద్దకు వెళ్లి చూస్తారు, అక్కడే చాలా ప్రేమ కథలు పుడతాయి. ఈ సినిమాలో అదే మెయిన్‌గా చూపించారు. దీంతో అప్పటి రోజుల్లోకి వెళ్లొచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. టీవీకి యాంటినా ఉండటం, సిగ్నల్‌ సరిగా రాక దాన్ని కదిలించడం వంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక హరి వన్‌ సైడ్ లవ్‌ కూడా మనకు అప్పటి రోజులను గుర్తు చేస్తుంది. వాణికి హరిపై ఇష్టం ఉన్నా, ఆమె చెప్పలేకపోవడం, ఆయనకోసం ఆమె కూడా టీవీ వద్దకు రావడం, ఇద్దరూ చూపులతోనే ప్రేమించుకోవడం వంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. హీరో పాత్ర తీరుతెన్నులు ఉదయ్‌ కిరణ్‌ సినిమాలను గుర్తు చేస్తుంది. ఫస్టాఫ్‌ అంతా వీరి లవ్‌ స్టోరీ, హీరో ఫ్రెండ్స్ చేసే అల్లరితో సాగుతుంది. అలాగే హీరో ఫ్యామిలీ పరిస్థితిని ఎస్టాబ్లిష్‌ చేశారు. ఇంటర్వెల్‌ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. సీరియస్‌ వైపు టర్న్ తీసుకుంటుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది?

ఇక సెకండాఫ్‌ అంతా సీరియస్‌గా సాగుతుంది. ప్రేమ కోసం వీరిద్దరు తప్పించడం, ప్రేమ విషయం తెలిసి పెద్ద వాళ్లు దూరం పెట్టడం, ముఖ్యంగా హీరోయిన్‌ అన్న వార్నింగ్‌ ఇవ్వడం, కులం పేరుతో ఊర్లో గొడవలు జరగడం వంటి సన్నివేశాలతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంటుంది. లావణ్య రెడ్డి, జెమినీ సురేష్‌ జంటకి సంబంధించిన సీన్లు భావోద్వేగానికి గురి చేస్తాయి. ఆ తర్వాత పరువు హత్యలను తలపిస్తుంది. కథ విషాదాంతంగా ముగింపు పలికి, ఆ తర్వాత ఇచ్చిన ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది. సినిమా మొత్తానికి అది హైలైట్‌గా నిలుస్తుంది. హృదయాన్ని కదిలిస్తుంది. అయితే మూవీలో స్వచ్ఛమైన ప్రేమ కథని చూపించిన తీరు బాగుంది. ఇప్పుడు లవ్‌ స్టోరీలు అంటే లిప్‌ లాక్‌లు, పబ్‌లు, రొమాన్స్ ప్రధానంగా నడుస్తోన్న నేపథ్యంలో అప్పట్లో స్వచ్ఛమైన ప్రేమకి, త్యాగానికి, పోరాటానికి ప్రతీకగా ఇది నిలుస్తుంది. కొంత కామెడీ నవ్విస్తుంది, లవ్‌ స్టోరీని ఆకట్టుకుంది. ఎమోషన్స్ హృదయాన్ని హత్తుకుంటాయి. అయితే మూవీ చాలా స్లోగా సాగుతుంది. కథ మాత్రమే కాదు, డైలాగ్‌లు, నటీనటుల ప్రదర్శన కూడా అప్పటి మాదిరిగానే ఉండటం కొంత మైనస్‌గా చెప్పొచ్చు. కథనం చాలా స్లోగా సాగుతుంది. అక్కడక్కడే తిరుగుతుంది. చాలా డైలాగ్‌లు రొటీన్‌గా ఉంటాయి. మరోవైపు భారీ డైలాగులు ఉన్నా, ఆ స్థాయిలో సన్నివేశాలు లేకపోవడం కొంత మైనస్‌గా చెప్పొచ్చు. కులానికి సంబంధించిన అంశాలు ఆకట్టుకున్నాయి. వాటి వల్ల ఎంత నష్టం ఉంటుందో కళ్లకి కట్టినట్టు చూపించిన చిత్రమిది.

హరి పాత్రలో సువిక్షిత్‌, వాణిగా గీతికా రతన్‌ అదరగొట్టారు. సువిక్షిత్‌ ఒదిగిపోయి నటించాడు. చాలా సెటిల్డ్ గా చేసి మెప్పించాడు. అతని నటన తీరు కొంత ఉదయ్‌ కిరణ్‌ని గుర్తు చేస్తుంది. ఇక వాణిగా గీతికా కూడా పాత్రలో ఒదిగిపోయింది. పల్లెటూరి అమ్మాయిగా బాగా చేసింది. ప్రేమ, ఎమోషన్స్ ని బాగా పలికించింది. పేకబాబుగా భాస్కర్‌ అదరగొట్టాడు. ఊర్లో కొడవలకు కారణమైన పాత్రలో బాగా చేశాడు. అలాగే పరశురామ్‌గా విజయ్‌ కృష్ణారెడ్డి పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. జెమినీ సురేష్‌, లావణ్య రెడ్డి ఫర్వాలేదనిపించారు. భద్రం పాత్ర నవ్విస్తుంది. హీరో ఫ్రెండ్స్ గా తేజ విహాన్‌, బాలరాజు పులుసు, పాండు  నవ్వించారు. బాలరాజు పాత్ర నవ్విస్తుంది. ఏడిపిస్తుంది. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.

దర్శకుడి టేకింగ్: ప్లస్సులు, మైనస్సులు!

మ్యూజిక్‌ బాగుంది. పాటలు కవిత్వంతో కూడి ఉన్నాయి. ఆర్‌ఆర్ఆర్‌ కూడా ఆకట్టుకుంది. డైలాగ్‌లు, సన్నివేశాల్లో కవిత్వం కనిపిస్తుంది. విజువలైజేషన్‌లోనూ ఆ స్టయిల్‌ కనిపించింది. దర్శకుడు మంచి కథని ఎంచుకున్నాడు, ఇంకా బాగా ఆకట్టుకునేలా తెరకెక్కించాల్సింది. ఎమోషనల్‌ పరంగా, లవ్‌ స్టోరీ పరంగా, ఇంకా రియాలిటీకి దగ్గరగా తీస్తే బాగుండేది, స్పీడ్‌ కూడా పెంచాలి. నిర్మాణ విలువలకు కొదవ లేదు. బాగా తీశారు. విజువల్‌గా సినిమా బాగుంది. ఎడిటింగ్‌ పరంగా ఇంకా కేర్‌ తీసుకోవాలి.

30ఏళ్లు వెనక్కి తీసుకెళ్లి ఆ పాత రోజులను, ఆ గ్రామీణ వాతావరణాన్ని, ఆ ప్రేమ కథలను గుర్తు చేసే చిత్రం దూరదర్శని.

దూరదర్శని సినిమాపై మీ అభిప్రాయాలను పక్కన పెట్టి, ఈ రివ్యూని చదివి, మీ నిర్ణయాన్ని తీసుకోండి. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్‌డేట్స్ కోసం మా పేజీని చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.