|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జాతీయ ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్.. ఈ సినిమా నేర్పే జీవిత పాఠాలివే.. ఏ ఓటీటీలో ఉందంటే? తెలుగులోనూ.. 8.7 ఐఎండీబీ రేటింగ్

Published: 02-08-2025, 4:42 AM
జాతీయ ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్.. ఈ సినిమా నేర్పే జీవిత పాఠాలివే.. ఏ ఓటీటీలో ఉందంటే? తెలుగులోనూ.. 8.7 ఐఎండీబీ రేటింగ్

71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో 12th ఫెయిల్ అనే చిన్న సినిమా అద్భుత విజయం సాధించింది. జాతీయ ఉత్తమ చిత్రం అవార్డుతో పాటు, ఉత్తమ నటుడి అవార్డును కూడా దక్కించుకుంది. ఈ సినిమా ఓటీటీలోనూ అలరించడంతో, దాని కథ మరియు జీవిత పాఠాల గురించి తెలుసుకుందాం.

Key Points

1

జాతీయ ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్ అవార్డు గెలుచుకుంది.

2

విక్రాంత్ మస్సే అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు.

4

8.7 ఐఎండీబీ రేటింగ్‌తో అద్భుతమైన విజయాన్ని సాధించింది.

12th ఫెయిల్: జాతీయ అవార్డు విజయం

71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో 12th ఫెయిల్ మూవీ అదరగొట్టింది. 2023కి గాను బెస్ట్ మూవీ అవార్డుతో పాటు.. జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం కూడా సొంతం చేసుకుంది. విక్రాంత్ మస్సే ఈ మూవీలో అద్భుతంగా నటించాడు. చిన్న సినిమాగా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఈ మూవీ నేర్పే జీవిత పాఠాలపై ఓ లుక్కేద్దాం.

12th ఫెయిల్ సినిమా 2023 అక్టోబర్ 27న థియేటర్లలో రిలీజైంది. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ నిజ జీవిత కథతో ఈ హిందీ మూవీని విధు వినోద్ చోప్రా తెరకెక్కించాడు. ఆయనే ప్రొడ్యూసర్ కూడా. మనోజ్ కుమార్ శర్మ పాత్రలో విక్రాంత్ మస్సే నటించాడు. రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.70 కోట్లు రాబట్టింది.

థియేటర్లలో ఆడియన్స్ ను అలరించిన 12th ఫెయిల్ మూవీ 2023 డిసెంబర్ 29 నుంచి జియోహాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటీకీ ఓటీటీ లో ఈ మూవీకి క్రేజ్ తగ్గలేదు. తెలుగులోనూ మూవీ అందుబాటులో ఉంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఐఎండీబీలో ఈ మూవీకి 8.7 రేటింగ్ ఉండటం విశేషం.

విక్రాంత్ మస్సే అద్భుత నటన

చంబల్ రీజియన్లోని ఓ చిన్న గ్రామం. అక్కడ 12వ తరగతి పాస్ కావడానికి మనోజ్ కుమార్ (విక్రాంత్) కష్టాలు పడుతుంటాడు. పరీక్షల్లో చీటింగ్ చేయాలని చూస్తాడు. కానీ డీఎస్పీ ఆఫీసర్ పరీక్ష హాల్ లోకి వచ్చి చెక్ చేయడంతో మనోజ్ ఫెయిల్ అయిపోతాడు. ఆ తర్వాత తన అన్నతో కలిసి ఓ వెహికల్ నడపుతుంటాడు. అప్పుడు గుండాలతో గొడవ జరిగితే డీఎస్పీ రక్షిస్తాడు. అప్పుడే ఆ డీఎస్పీ నిజాయితీ చూసి మనోజ్ కూడా డీఎస్పీ కావాలని టార్గెట్ గా పెట్టుకుంటాడు. మరి అతను 12వ తరగతి పాస్ అయ్యాడా? డీఎస్పీ కావాలనుకున్నవాడా ఐపీఎస్ అధికారిగా ఎలా మారాడన్నదే కథ.

కొన్ని సినిమాలు ఎంటర్ టైన్మెంట్ అందిస్తాయి. మరికొన్ని సినిమాలు స్ఫూర్తి నింపి జీవితాలనే మార్చేస్తాయి. అలాంటి మూవీనే 12th ఫెయిల్. ఫస్ట్ 12వ తరగతి పాస్ అయ్యేందుకు అష్ట కష్టాలు పడ్డ కుర్రాడు.. చివరకు పట్టుదలతో ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అయ్యాడనేది అందరినీ ఇన్ స్పైర్ చేస్తుంది. ఆ క్రమంలో ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గని తీరు కట్టిపడేస్తుంది.

ఏదైనా పని చేస్తుంటే ఆటంకాలు వస్తుంటాయి. అలా అని ఆపేస్తే లక్ష్యాన్ని చేరుకోలేం. ఈ సినిమాలో మనోజ్ జీవితంలోనూ పేదరికం, ప్రేమ లాంటి అడ్డంకులు వస్తాయి. ఒకట్రెండు సార్లు ఫెయిల్ అవుతాడు. కానీ ఒక వైపు పగలంతా పని చేస్తూనే.. ఇరుకు గదిలో ఉంటూ రాత్రంతా చదువుతాడు మనోజ్. ఏదేమైనా లక్ష్యాన్ని చేరాలనే తపనతో ఉంటే ఏదీ అడ్డంకి కాదని ఈ మూవీ చాటుతుంది.

ఓటీటీ విడుదల మరియు అందుబాటు

సినిమాలో మనోజ్ కుమార్ తండ్రి ఓ నిజాయతీ కలిగిన ప్రభుత్వ ఉద్యోగి. కానీ పై అధికారుల అవినీతిని ప్రశ్నించి అతను సస్పెండ్ అవుతాడు. అయినా కూడా ఎప్పుడూ అక్రమ మార్గంలో సాగిపోడు. తను నమ్మిన విలువలకు కట్టుబడి ఉంటాడు. నిజాయతీకి ఉన్న గొప్పతనాన్ని చాటుతాడు.

జీవితంలో ఉన్నత స్థానాల్లో నిలిచిన ప్రతి ఒక్కరి వెనుకు కనీసం ఒక ఫ్రెండ్ ఉంటాడు. కష్టాల్లో ఆదుకుని ముందుకు నడిపిస్తాడు. ఈ సినిమాలోనూ మనోజ్ ను ఆదుకునే అలాంటి ఫ్రెండ్స్ ఉంటారు. మనోజ్ ను మోటివేట్ చేస్తూ, అవసరాలకు డబ్బు ఇస్తూ అండగా నిలుస్తారు. మరోవైపు ఆత్మన్యూనతను దాటి విజయం సాధించే హీరో క్యారెక్టర్ అందరి మనసుల్లోనూ బలంగా నిలిచిపోతుంది. అందుకే ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.

12th ఫెయిల్ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉండటంతో, ఈ స్ఫూర్తిదాయక కథను చూడటానికి ఇది సరైన సమయం. ఈ సినిమా జీవితంలోని అనేక అంశాల గురించి ఆలోచించేలా చేస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.