
2022లో విడుదలైన కన్నడ సినిమా ‘కాంతార’ అనూహ్యంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. కేవలం 16 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడిన ఈ సినిమా 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
Key Points
కేవలం 16 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడిన కాంతార సినిమా
400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది.
రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం అద్భుతంగా ఆకట్టుకున్నాయి.
వరాహ రూపం పాట సోషల్ మీడియాలో సంచలనం.
కాంతార: అనూహ్య విజయం
మూడేళ్ల క్రితం అంటే 2022లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కన్నడ చిత్రం ‘కాంతార’ అనూహ్యంగా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.16 కోట్ల కంటే తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పాన్ ఇండియా సినిమా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక సరికొత్త రికార్డు సాధించింది.
మనిషికి ప్రకృతికి మధ్య జరుగుతున్న సంఘర్షణను ఆధారంగా రాసుకున్న కథతో రూపొందించబడింది ఈ సినిమా. కన్నడనాట మాత్రమే కాదు అన్ని భాషల్లో అద్భుతం చేసింది కాంతార. కర్ణాటకలోని గిరిజన సంప్రదాయాలను కళ్లకు కట్టినట్టు చూపించిన ఈసినిమా అందరిని ఆకర్శించింది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతారకు మౌత్-ఆఫ్-మౌత్ ప్రచారం ద్వారా భారీ రెస్పాన్స్ లభించింది.
రిషబ్ శెట్టి అద్భుత ప్రదర్శన
‘కాంతార’ సినిమాకి కథ, దర్శకత్వం తో పాటు హీరో పాత్రలో రిషబ్ శెట్టి నటించారు. ఆయన అద్భుతమైన నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు వచ్చాయి. ఈ చిత్రంలో సప్తమి గౌడ, కిషోర్, మానసి సుధీర్, అచ్యుత్ కుమార్, స్వరాజ్ ముఖ్యపాత్రలు పోషించారు. ముఖ్యంగా భూత కోల అనే ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా ఈ సినిమా ప్రత్యేక గుర్తింపు పొందింది.
కన్నడ భాషలో తెరకెక్కిన కాంతార హిందీ, తెలుగు, తమిళం, మలయాళం లో విడుదలైన దేశవ్యాప్తంగా 310 కోట్ల వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 408 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
వరాహ రూపం పాట సంచలనం
ఈ సినిమాలోని ‘వరాహ రూపం’ పాట సోషల్ మీడియాలో సంచలనం రేపింది. కేరళ సంప్రదాయ ట్యూన్ ను కాపీ కొట్టారంటూ వివాదం చెలరేగింది. ఆతరువాత వివాదం కోర్డు ద్వారా పరిష్కారం అయ్యింది. ఇక ఇప్పటికీ ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ విజయంతో ‘కాంతార’ సెకండ్ పార్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాంతార ప్రీక్వెల్ ను రిషబ్ శెట్టి ప్రెస్టేజియస్ గా తీసుకున్నారు. భారీ బడ్జెట్ తో.. పాన్ ఇండియా రేంజ్ లో కాంతార ఛాప్టర్ 1 ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు రిషబ్. ఇందుకోసం ప్రత్యేకంగా యుద్ధ విద్యలను కూడా నేర్చుకున్నాడు కన్నడ హీరో. ఈ మూవీ ఈ ఏడాది అక్టోబర్ లో రిలీజ్ కాబోతోంది.
కాంతార సినిమా సాధించిన విజయం చిన్న బడ్జెట్ సినిమాలకు కూడా భారీ విజయం సాధించవచ్చని చూపించింది. రిషబ్ శెట్టి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు.


