|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

20 నిమిషాల పాత్రకి 20కోట్లట..పదేళ్ల క్రితం హీరో పాత్రకి అదే పారితోషికం

Published: 29-05-2025, 6:21 AM
20 నిమిషాల పాత్రకి 20కోట్లట..పదేళ్ల క్రితం హీరో పాత్రకి అదే పారితోషికం

తెలుగు సినీరంగంలో బాలకృష్ణకున్న ప్రాముఖ్యతను జైలర్ 2 సినిమాలోని ఆయన పాత్రకు ఇచ్చిన పారితోషికం మరోసారి నిరూపిస్తోంది. కేవలం 20 నిమిషాల పాత్రకు రూ.20 కోట్లు అంటే ఆశ్చర్యం కలిగించే విషయం.

Key Points

1

జైలర్ 2 లో 20 నిమిషాల పాత్రకు బాలకృష్ణ రూ.20 కోట్లు పారితోషికం అందుకుంటున్నారు.

2

పదేళ్ల క్రితం ఒక పూర్తి సినిమాకు ఆయనకు దాదాపు ఇంతే పారితోషికం ఉండేది.

4

ఆయన కెరీర్ లో విజయాల కంటే అపజయాలే ఎక్కువ ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆయనకు అపూర్వమైన డిమాండ్ ఉంది.

బాలకృష్ణ పారితోషికం: ఒక కొత్త రికార్డు

సినిమా రంగం ఎవరిని ఎప్పుడు నెత్తికి ఎక్కించుకుంటుందో ఎవరిని నేలకేసి కొడుతుందో అంచనా వేయడం అంత సులభం కాదు. అందుకు నిదర్శనంగా మన తెలుగు హీరోను చెప్పొచ్చు. వయసులో ఉన్నప్పుడు  ఉరకలేసే ఉత్సాహంతో ఫైట్లూ, డ్యాన్సులూ వేసినా సమకాలికులైన హీరోలపై సాధించలేకపోయిన పైచేయిని..సక్సెస్‌నూ వృద్ధాప్యంలో సాధిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు బాలకృష్ణ. ఇటవలి కాలంలో సీనియర్‌ నటుల్లో బాలకృష్ణ అందుకుంటున్న విజయాలు మరెవ్వరికీ సాధ్యం కావడం లేదనేది వాస్తవం. నిజానికి యుక్తవయసులో ఉండగా కూడా బాలయ్య ఇంత సందడి చేయలేదని చెప్పొచ్చు. వయసులో ఉండగా చేయలేకపోయిన యాడ్స్‌లో కూడా ఆయన ఇప్పుడు సత్తా చాటుతుండడం దీనికో నిదర్శనం.

ఈ నేపధ్యంలో తాజాగా సినీరంగంలో హల్‌చల్‌ చేస్తున్న ఒక వార్త మరోసారి బాలకృష్ణ సరికొత్త స్టామినాను చాటి  చెబుతోంది. అదేమిటంటే జైలర్‌ 2 సినిమాలో అతిధి పాత్రలో బాలకృష్ణ కనిపించబోతున్నాడని, అందుకు గాను అత్యధిక పారితోషికం అందుకుంటున్నారని.. కేవలం 20 నిమిషాల నిడివి ఉండే పాత్ర కోసం బాలకృష్ణ ఏకంగా రూ.20కోట్లకు పైనే రెమ్యునరేషన్‌ ఇవ్వడానికి జైలర్‌2 నిర్మాతలు ఓకే అన్నారని తెలుస్తోంది. ఈ సమాచారం ఒక్కసారిగా టాక్‌ ఆఫ్‌ ద ఇండస్ట్రీగా మారింది. ఒకప్పుడు అంటే దాదాపుగా ఒక పదేళ్ల క్రితం  డిక్టేటర్‌ వంటి సినిమాల్లో నటించే సమయంలో బాలకృష్ణ మొత్తం సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్‌ కూడా దాదాపుగా అంతే ఉంటుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఒక సినిమా మొత్తం కనిపించే  హీరోగా పదేళ్ల క్రితం తీసుకున్న పారితోషికాన్ని ఇప్పుడు కేవలం 20 నిమిషాల పాత్ర కోసం తీసుకుంటూ బాలకృస్ణ కొత్త రికార్డ్‌ సాధించారని చెప్పొచ్చు.

జైలర్ 2: అతిధి పాత్రలో బాలయ్య

మొదటి నుంచీ నిర్మాతలకు అందుబాటులో ఉండే హీరోగా బాలకృష్ణకు పేరుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా  పారితోషికం  రూపంలో నిర్మాతల నెత్తిన భారం మోపే వాడు కాదని అందుకే ఎన్ని ఫ్లాపులొచ్చినా బాలకృష్ణ చేతిలో సినిమాలు లేని పరిస్థితి ఎప్పుడూ లేదని అంటుంటారు. అంతెందుకు ఆయన రెమ్యునరేషన్‌ అమాంతం పెరిగిన ఈ పదేళ్లలో చూసుకున్నా… బాలకృష్ణ కెరీర్‌లో విజయాలకన్నా అపజయాలే ఎక్కువ.గత 2014లో లెజెండ్‌ తర్వాత లయన్, డిక్టేటర్, గౌతమ్‌ పుత్ర శాతకర్ణి, పైసా వసూల్, జై సింహా, కధానాయకుడు పార్ట్‌ 1, కధానాయకుడు పార్ట్‌ 2, రూలర్‌… వరకూ వరుస ప్లాఫులే. ఆ తర్వాత ‘అఖండ’తో మాత్రమే విజయాలు ప్రారంభమయ్యాయి. వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి, ఢాకూ మహరాజ్‌..లు హిట్స్‌గా నిలిచాయి.అంటే పదేళ్లలో 9 ఫ్లాపులు, 4 మాత్రమే విజయాలు.

పదేళ్ల క్రితం పరిస్థితి vs ప్రస్తుతం

హిట్టయిన నాలుగింటిలోనూ  బాలకృష్ణ డ్యాన్సులు ఫైట్లు చేసే కుర్ర హీరోలా కాకుండా డైలాగులు  పేల్చడం, విలన్లను నరకడం వరకే పరిమితమైన వయసుకు తగ్గ పాత్రలు పోషించడం కూడా ఈ సినిమాల సక్సెస్‌కు కారణంగా చెప్పొచ్చు. ఏదేమైనా వచ్చే జూన్‌ 10వ తేదీతో 65ఏళ్లు నిండుతున్న బాలయ్య… రేపోమాపో యువహీరోగా తెరకెక్కనున్న తన కొడుకుతో పోటీపడే స్థాయిలో నిలవడం విశేషమే అని చెప్పాలి.

బాలకృష్ణ వృత్తి జీవితంలోని ఎత్తుపల్లాలను ఈ వార్త మరోసారి చాటుతోంది. అపజయాల తర్వాత సాధించిన విజయాలే ఆయనకు ఈ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.