
2026లో సినీ ప్రియులకు పౌరాణిక కథలతో కూడిన భారీ చిత్రాలు అలరించనున్నాయి. 2000 కోట్ల బడ్జెట్‌తో ‘రామాయణం’ సిరీస్, ‘హను-మాన్’ సీక్వెల్, ‘పరశురాముడి’ కథ వంటి 6 చిత్రాలు విడుదల కానున్నాయి. వాటి విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.
Key Points
2000 కోట్ల బడ్జెట్‌తో రామాయణం సిరీస్ 2026 దీపావళికి రానుంది.
రణబీర్ కపూర్ (రాముడు), సాయి పల్లవి (సీత), యష్ (రావణాసురుడు) నటిస్తున్నారు.
ప్రశాంత్ వర్మ 'హను-మాన్' సీక్వెల్లో రిషబ్ శెట్టి హనుమాన్‌గా కనిపించబోతున్నారు.
విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో దినేష్ విజన్ 'పరశురాముడి' కథను నిర్మిస్తున్నారు.
2026లో రాబోయే భారీ పౌరాణిక సినిమాలు
విడుదల తేదీ : దీపావళి 2026
రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, సౌత్ స్టార్ హీరో యష్ రావణాసురిడిగా నటిస్తోన్న సినిమా రామాయరణం పార్ట్ 1. సన్నీ డియోల్ కూడా ఈసినిమాలో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రీరాముడి జీవిత గాథను చూపించనున్నారు. నితేష్ తివారీ దర్శకుడు. నమిత్ మల్హోత్రా, శ్రీధర్ రాఘవన్ నిర్మాతలు. దాదాపు గా ఈసినిమా సిరీస్ ల కోసం 2000 కోట్లుకు పైగా బడ్జెట్ ను ఖర్చు చేస్తున్నారు.
విడుదల తేదీ : 2026 (తేదీ ఖరారు కాలేదు)
శ్రీరాముడికి ఇచ్చిన మాటను హనుమంతుడు నిలబెట్టుకోవడం ఈ సినిమా కథ. ఇది 2024 బ్లాక్‌బస్టర్ ‘హను-మాన్’కి సీక్వెల్. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నా ఈసినిమాలో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హనుమాన్ గా కనిపించబోతున్నారు. ఈమూవీలో రానా, తేజ సజ్జ, అమృత అయ్యర్ నటిస్తున్నారు.
రణబీర్ కపూర్ ‘రామాయణం’ – పూర్తి వివరాలు
విడుదల తేదీ : క్రిస్మస్ 2026
‘స్త్రీ’, ‘భేదియా’ లాంటి హారర్ కామెడీ చిత్రాలకు ప్రసిద్ధి చెందిన దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమర్ కౌశిక్ దర్శకుడు. విష్ణువు అవతారమైన పరశురాముడి కథ ఇది. విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.
మైథలాజికల్ సినిమాలలో ఎక్కువగా టాలీవుడ్ నుంచే తెరకెక్కుతున్నాయి. అందులో మరో క సినిమా పవనపుత్ర హనుమంతుడి కథ ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ యానిమేటెడ్ చిత్రానికి చందూ మొండేటి దర్శకుడు. నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
విడుదల తేదీ : 14 ఆగస్టు 2026 (అంచనా)
హనుమాన్, పరశురామ్: రాబోయే ఇతర చిత్రాలు
ఇది ఫాంటసీ-కామెడీ చిత్రం. కార్తీక్ ఆర్యన్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలు. మృగదీప్ సింగ్ లాంబా దర్శకత్వం వహిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మూడు భాగాలుగా రానుండగా, మొదటి భాగం 2026లో విడుదల కానుంది.
విడుదల తేదీ : హనుమాన్ జయంతి 2026
ఇది AI టెక్నాలజీతో రూపొందుతున్న చిత్రం. విక్రమ్ మల్హోత్రా, విజయ్ సుబ్రమణియన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈమూవీకి సంబంధించి మరిన్న వివరాలు తెలియాల్సి ఉంది.
మొత్తంగా, 2026 సంవత్సరం సినీ చరిత్రలో ఒక మైలురాయి కానుంది. భారీ బడ్జెట్‌లు, అగ్ర తారలు, పురాణ గాథలతో వస్తున్న ఈ చిత్రాలు ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని పంచనున్నాయి. ఈ మెగా ప్రాజెక్ట్‌ల కోసం ఎదురుచూద్దాం.


