|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

2025 వివాహ సంచలనం: ఏడడుగులు వేసిన అగ్రతారలు వీళ్లే! ఎన్నో ఆశ్చర్యకర విషయాలు!

Published: 28-12-2025, 1:05 AM
2025 వివాహ సంచలనం: ఏడడుగులు వేసిన అగ్రతారలు వీళ్లే! ఎన్నో ఆశ్చర్యకర విషయాలు!
  • అఖిల్ అక్కినేని తన ప్రియురాలు జైనబ్‌తో జూన్ 6న ఏడడుగులు వేశాడు.
  • సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరుల రెండో పెళ్లి డిసెంబర్ 1న జరిగింది.
  • అవికా గోర్, మిలింద్ చంద్వానీ; అర్మాన్ మాలిక్, ఆష్నా ష్రాఫ్ కూడా 2025లో ఒక్కటయ్యారు.
  • టాలీవుడ్, బాలీవుడ్, సంగీత రంగం నుండి పలువురు ప్రముఖులు పెళ్లి చేసుకున్నారు.

2025 సంవత్సరం సెలబ్రిటీలకు వివాహ బంధంతో మరిచిపోలేని జ్ఞాపకాలను ఇచ్చింది. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ప్రేమలో మునిగి, ఏడడుగులు వేశారు. సమంత, అఖిల్ అక్కినేని వంటి స్టార్స్ కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈ ఏడాది విశేషాలు తెలుసుకుందాం.

2025లో ప్రేమ బంధంతో ఒక్కటైన టాలీవుడ్ స్టార్స్

Rewind 2025: ప్రతీ ఇయర్ లాగానే 2025 కూడా చాలా స్పెషల్ గా గడిచింది. కొంతమందికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాలను ఇచ్చింది. అందులో పెళ్లి అనేది చాలా ప్రత్యేకం. మరి అలాంటి ప్రత్యేకమైన ప్రయాణాన్ని 2025లో చాలా మంది స్టార్స్ మొదలుపెట్టారు ఈ ఇయర్ లో(Rewind 2025). మరి ఆ స్టార్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

Akhil Raj-Anupama:రాజు వెడ్స్ రాంబాయి హీరోకి బంపర్ ఆఫర్.. అనుపమతో మూవీ.. డైరెక్టరో ఎవరో తెలుసా?

అఖిల్- జైనబ్: టాలీవుడ్ కింగ్‌ నాగార్జున రెండో కొడుకు అఖిల్‌ అక్కినేని ఈ ఏడాదే పెళ్లి చేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న తన ప్రియురాలు జైనబ్‌తో కలిసి ఏడడుగులు వేశాడు. జూన్‌ 6వ తేదీన వీరి పెళ్లి ఘనంగా జరిగింది.

బాలీవుడ్, ఇతర సినీ ప్రముఖుల వివాహ విశేషాలు

సమంత- రాజ్‌: స్టార్ బ్యూటీ సమంత, దర్శకుడు రాజ్‌ నిడిమోరు కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు అఫీషియల్‌గా డిసెంబర్‌ 1న పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి కోయంబత్తూరులో ఈషా సెంటర్‌లో అతికొద్ది మంది సమక్షంలో జరిగింది. ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ ఇద్దరికీ ఇది రెండో పెళ్లే.

అవికా గోర్‌- మిలింద్‌ చంద్వానీ: చిన్నారి పెళ్లికూతురు నటి అవికా గోర్‌ కూడా ఈ ఇయర్ పెళ్లి చేసుకుంది. చాలా కాలంగా రిలేషన్ లో ఉంటున్న తన ప్రియుడు మిలింద్‌ చంద్వానీతో సెప్టెంబర్‌ 30న ఈ అమ్మడు ఏడూ అడుగులు వేసింది.

అర్మాన్‌ మాలిక్‌- ఆష్న ష్రాఫ్‌: సింగర్‌ అర్మాన్‌ మాలిక్‌ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన పాటలతో ఆడియన్స్ కి ఆకట్టుకున్న ఈ సింగర్ తన ప్రియురాలు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఆష్న ష్రాఫ్‌ను పెళ్లి చేసుకున్నాడు. జనవరి 2న వీరి పెళ్లి ఘనంగా జరిగింది.

2025లో రెండో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు

అభిషన్‌ జీవింత్‌- అఖిల: టూరిస్ట్‌ ఫ్యామిలీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అభిషన్‌ జీవింత్‌. ఈ దర్శకుడు కూడా 2025లోనే తన బ్యాచిలర్ లైఫ్ కి ఎండ్ కార్డు వేశాడు. తన ప్రియురాలు అఖిలను అక్టోబర్‌ 31న పెళ్లి చేసుకున్నాడు.

వీళ్ళే కాకుండా.. ఆశ్లేష సావంత్‌- సందీప్‌ బస్వానా, అర్చన- బీఆర్‌ శరత్‌, సారా ఖాన్‌- క్రిష్‌ పాఠక్‌, సెలీనా గోమెజ్‌-బెన్నీ బ్లాన్కో, దర్శన్‌ రావల్‌-దరల్‌ సురేలియా, ఆదార్‌ జైన్‌- అలేఖ అద్వానీ, ప్రతీక్‌ బాబర్‌- ప్రియా బెనర్జీ, ప్రజక్త కోహ్లి- వృషాంక్‌ ఖనల్‌.. లాంటి చాలా మంది స్టార్స్ ఈ ఇయర్ పెళ్లి చేసుకున్నారు.

2025లో ఎంతోమంది స్టార్స్ కొత్త జీవితాన్ని ప్రారంభించడం నిజంగా ఒక ప్రత్యేకమైన ఘట్టం. ఈ వివాహాలు సినీ ప్రపంచంలో ఆనందాన్ని నింపడమే కాకుండా, అభిమానులకు కూడా మరపురాని మధుర స్మృతులను అందించాయి. ఈ నవ దంపతులకు శుభాకాంక్షలు!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.