
ఈ వారాంతంలో థియేటర్లతో పాటు ఓటీటీలు కూడా సందడి చేస్తున్నాయి. సుమారు 30 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఒక్కసారిగా విడుదలయ్యాయి. హిట్ 3, రెట్రో, తుడరుమ్ వంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
Key Points
30 కంటే ఎక్కువ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఒక్కరోజులోనే ఓటీటీల్లోకి!
హిట్ 3, రెట్రో, తుడరుమ్ లాంటి సినిమాలు స్ట్రీమింగ్‌లో అందుబాటులో.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, చంద్రహాస, డీమన్ వంటి చిత్రాలు కూడా ఓటీటీలో.
క్రిమినల్ జస్టిస్ సీజన్ 4తో పాటు వివిధ భాషల చిత్రాలు, సిరీస్‌లు కూడా ఉన్నాయి.
ఈ వారం ఓటీటీలో వచ్చిన కొత్త సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో భైరవం, షష్టిపూర్తి లాంటి చిన్న చిత్రాలు వచ్చాయి. మరోవైపు ఓటీటీల్లో మాత్రం ఏకంగా 30 వరకు కొత్త మూవీస్, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి రావడం విశేషం. వీటిలో హిట్ 3, రెట్రో, తుడరుమ్ లాంటి క్రేజీ మూవీస్ అందుబాటులోకి వచ్చాయి.
వీటితో పాటు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, చంద్రహాస, డీమన్ లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలతో పాటు క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 అనే వెబ్ సిరీస్ కూడా కచ్చితంగా చూడాలి అనే ఆత్రుత కలిగిస్తున్నాయి. ఒకవేళ ఈ వీకెండ్ ఇంట్లోనే మూవీస్ చూద్దామనుకుంటే వీటిలో ఆప్షన్ చూసుకోండి. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ వచ్చిందంటే?
ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజైన మూవీస్ (మే 30)
రెట్రో – తెలుగు డబ్బింగ్ సినిమా
ఏ విడోస్ గేమ్ – స్పానిష్ మూవీ
లాస్ట్ ఇన్ స్టార్ లైట్ – కొరియన్ సినిమా
ద హార్ట్ నోస్ – స్పానిష్ మూవీ
డిపార్ట్‌మెంట్ క్యూ – తెలుగు డబ్బింగ్ సిరీస్
మ్యాడ్ యునికార్న్ – థాయ్ సిరీస్
వివిధ భాషల చిత్రాలు, వెబ్ సిరీస్‌లు
ద బెటర్ సిస్టర్ – తెలుగు డబ్బింగ్ సిరీస్
మాన్‌స్టర్ హై సీజన్ 2 – ఇంగ్లీష్ సిరీస్
యా బాయ్ కాంగ్ మింగ్ – జపనీస్ సిరీస్
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి – తెలుగు మూవీ
వీర చంద్రహాస – కన్నడ సినిమా
ద లాస్ట్ స్టాప్ ఇన్ యమ కంట్రీ – ఇంగ్లీష్ మూవీ
ట్రెజర్ – ఇంగ్లీష్ సినిమా
ఏన్ ఎండ్ లెస్ వెడ్డింగ్ – ఫ్రెంచ్ మూవీ
తుడరుమ్ – తెలుగు డబ్బింగ్ మూవీ
క్రిమినల్ జస్టిస్: ఏ ఫ్యామిలీ మేటర్ – హిందీ సిరీస్
ఏ ఓటీటీలో ఏ సినిమా?
ఫైండ్ ద ఫర్జీ విత్ కరీష్మా – హిందీ గేమ్ షో
ఏ కంప్లీట్ అన్ నోన్ – ఇంగ్లీష్ సినిమా (మే 31)
వానిళ్ తెడినన్ – తమిళ సిరీస్
డీమన్ – తెలుగు డబ్బింగ్ మూవీ
కంఖజురా – తెలుగు డబ్బింగ్ సిరీస్
నిమిత్త మాత్ర – కన్నడ మూవీ
బోనో: స్టోరీస్ ఆఫ్ సరండర్ – ఇంగ్లీష్ సినిమా
లులు ఈజ్ ఏ రైనోసిరోస్ – ఇంగ్లీష్ మూవీ
ఈ వీకెండ్‌లో మీ ఇంటిలోనే వినోదం కోసం అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన సినిమా లేదా వెబ్ సిరీస్‌ని ఎంచుకొని ఆనందించండి!


