|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీల్లో ఈ వారం తెలుగులో వచ్చిన 4 సినిమాలు, ఓ రొమాంటిక్ సిరీస్.. ఈ వీకెండ్ చూసేయండి!

Published: 03-05-2025, 1:43 AM
ఓటీటీల్లో ఈ వారం తెలుగులో వచ్చిన 4 సినిమాలు, ఓ రొమాంటిక్ సిరీస్.. ఈ వీకెండ్ చూసేయండి!

ఈ వారం ఓటీటీల్లో తెలుగు సినిమా ప్రేమికులకు పండగే. నాలుగు కొత్త సినిమాలు, ఒక రొమాంటిక్ సిరీస్ ఓటీటీలలోకి ఎంట్రీ ఇచ్చాయి. ఏ సినిమా చూడాలా అని ఆలోచిస్తున్నారా? ఈ కథనం చదవండి.

ఈ వారం ఓటీటీలో వచ్చిన కొత్త సినిమాలు

ఓటీటీల్లో ఈ వారం తెలుగులో కొత్త కంటెంట్ చూడాలనుకుంటున్నారా.. అయితే తాజాాగా కొన్ని ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈవారం (ఏప్రిల్ 28 – మే 3) తెలుగులో నాలుగు చిత్రాలు వివిధ ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చాయి. నవీన్ చంద్ర హీరోగా నచించిన ఓ థ్రిల్లర్ మూవీ ఇందులో ఉంది. ఓ తెలుగు మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఓ మలయాళ సినిమా డబ్బింగ్‍లోనూ వచ్చింది. ఈ వారం తెలుగులో ఓటీటీల్లోకి వచ్చిన 4 లేటెస్ట్ సినిమాలు, ఓ సిరీస్ ఇవే..

తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం 28 డిగ్రీస్ సెల్సియస్ సినిమా ఏప్రిల్ 29వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి అడుగుపెట్టింది. నవీన్ చంద్ర హీరోగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 4న థియేటర్లలో రిజైంది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ అనుకున్న రేంజ్‍లో కలెక్షన్లను దక్కించుకోలేకపోయింది. థియేటర్లలో రిలీజైన నెలలోగానే 28 డిగ్రీస్ సెల్సియస్ మూవీ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈ మూవీకి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో విడుదలైన చిత్రాలు

తెలుగు రూరల్ డ్రామా మూవీ ముత్తయ్య నేరుగా ఈటీవీ విన్ ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. మే 1వ తేదీన ఈ చిత్రం స్ట్రీమింగ్‍ మొదలైంది. ఈ సినిమాలో బలగం సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాకు భాస్కర్ మౌర్య దర్శకత్వం వవహించారు. నటుడు కావాలని 70ఏళ్ల వయసులోనూ పట్టుదలగా ఉండే ఓ వృద్ధుడి ప్రయత్నాల చుట్టూ ముత్తయ్య సినిమా సాగుతుంది.

మలయాళ అడ్వెంచర్ కామెడీ మూవీ బ్రొమాన్స్ ఏప్రిల్ 30వ తేదీన సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్‍లోనూ అడుగుపెట్టింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీలో సోనీలివ్‍లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమాలో మాథ్యూ థామస్, అర్జున్ అశోకన్ ప్రధాన పాత్రలు పోషించగా.. డైరెక్టర్ అరుణ్ జీ జోస్ తెరకెక్కించారు. థియేటర్లలోనూ ఈ బ్రొమాన్స్ మూవీ మంచి హిట్ అయింది. ఇప్పుడు సోనీలివ్ ఓటీటీ చూసేయవచ్చు.

రొమాంటిక్ థ్రిల్లర్స్ మరియు డ్రామాలు

ఇంగ్లిష్ బాడీ హారర్ థ్రిల్లర్ మూవీ ‘ గ్రాఫ్టెడ్ ’ ఏప్రిల్ 29వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. రెంట్ లేకుండా రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, హిందీ, తమిళ డబ్బింగ్‍లోనూ అడుగుపెట్టింది. జెయేనా సన్, జెన్ హాంగ్ లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ సూపర్ హిట్ అయింది.

తమిళ వెబ్ సిరీస్ ‘ష్’ (Sshhh) ఈ వారమే ఆహా ఓటీటీలో తెలుగు డబ్బింగ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ రొమాంటిక్ ఆంథాలజీ సిరీస్‍లో శ్రీకాంత్, సోనియా అగర్వాల్, ఇనయా, ఐశ్వర్య దత్తా, క్రిషా కురుప్, మైమ్ గోపీ ప్రధాన పాత్రలు పోషించారు. నాలుగు కథలో ఉండే ఈ సిరీస్‍కు పృథ్వి ఆదిత్య, వాలి మోహన్ దాస్, హరీశ్, కార్తికేయన్ దర్శకత్వం వహించారు.

ఈ వారం విడుదలైన వివిధ తెలుగు సినిమాలు, సిరీస్ లతో మీ వీకెండ్ మరింత ఆనందంగా గడపండి. మీకు నచ్చిన చిత్రాన్ని ఎంచుకుని ఆస్వాదించండి!

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.