|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలో ఈ వారం 5 అదిరిపోయే సినిమాలు.. హిట్ 3 స్ట్రీమింగ్.. మరో సూపర్ హిట్ యాక్షన్ మూవీ.. ఓ మిస్టరీ థ్రిల్లర్

Published: 26-05-2025, 1:08 AM
ఓటీటీలో ఈ వారం 5 అదిరిపోయే సినిమాలు.. హిట్ 3 స్ట్రీమింగ్.. మరో సూపర్ హిట్ యాక్షన్ మూవీ.. ఓ మిస్టరీ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అనేక ఆసక్తికరమైన సినిమాలు విడుదలవుతున్నాయి. నాని నటించిన ‘హిట్ 3’ సినిమాతో పాటు, సూర్య, పూజా హెగ్డే నటించిన రొమాంటిక్ యాక్షన్ సినిమా, కన్నడ మిస్టరీ థ్రిల్లర్ మరియు హాలీవుడ్ చిత్రం కూడా ఉన్నాయి.

Key Points

1

నాని హీరోగా నటించిన ‘హిట్ 3’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

2

సూర్య, పూజా హెగ్డే నటించిన రెట్రో సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల

4

‘కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూవరల్డ్’ జియోహాట్‌స్టార్‌లో అందుబాటులోకి

హిట్ 3 నెట్‌ఫ్లిక్స్‌లో

ఈ మే చివరి వారంలో ఓటీటీల్లోకి అదిరిపోయే సినిమాలు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. ముఖ్యంగా 5 చిత్రాలపై ఫోకస్ ఎక్కువగా ఉంది. నాని సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘హిట్ 3’ స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. సూర్య హీరోగా నటించిన యాక్షన్ చిత్రం కూడా అడుగుపెట్టనుంది. ఓ కన్నడ చిత్రం, ఓ హాలీవుడ్ క్రేజీ మూవీ కూడా రానున్నాయి. ఇలా ఈ వారం ఓటీటీల్లోకి రానున్న 5 టాప్ సినిమాల గురించి ఇక్కడ చూడండి.

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘హిట్ 3’ సినిమా మే 29వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఎంట్రీ ఇవ్వనుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మే 1వ తేదీన థియేటర్లలో విడుదలైంది. రూ.100కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో బ్లాక్‍బస్టర్ అయింది. ఈ చిత్రంలో నాని సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‍గా నటించారు. హిట్ 3 మూవీని ఈ గురువారం మే 29 నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూసేయవచ్చు.

మరో యాక్షన్ ఎంట్రీ

కన్నడ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘అజ్ఞాతవాసి’ చిత్రం మే 28వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ మూవీలో రంగనాయన రఘు, పావన గౌడ లీడ్ రోల్స్ చేశారు. డైరెక్టర్ జనార్దన చిక్కన్న తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. మే 28న జీ5లో ఈ అజ్ఞాతవాసి చిత్రం రానుంది.

తమిళ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన రెట్రో సినిమా మే 31వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ రొమాంటిక్ యాక్షన్ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. మే 1న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా సూపర్ హిట్ అయింది. గ్యాంగ్‍ల మధ్య గొడవలు, లవ్ స్టోరీతో ఈ చిత్రం రూపొందింది. రెట్రో చిత్రం మే 31న తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నెట్‍ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది.

మిస్టరీ థ్రిల్లర్ మరియు హాలీవుడ్ చిత్రం

హలీవుడ్ సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూవరల్డ్’ మే 28వ తేదీన జియోహాట్‍స్టార్ ఓటీటీలోకి రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు రానుంది. ఇప్పటికే కొన్ని ఓటీటీల్లో రెంటల్ విధానంలో ఉన్న ఈ చిత్రం ఇప్పుడు హాట్‍స్టార్ ఓటీటీలో సాధారణ స్ట్రీమింగ్‍కు అడుగుపెడుతోంది. ఆంటోనీ మాకీ, డానీ రెమీరెజ్, షిహా హాస్ లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైంది. జూలియస్ ఓనాహ్ దర్శకత్వం వహించిన కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూవరల్డ్ మంచి హిట్ సాధించింది.

స్పానిష్ క్రైమ్ డ్రామా సినిమా ‘ఓ విడోస్ గేమ్’ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో మే 30వ తేదీన డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మూవీలో ఇవానా బకెరో, ట్రిస్టన్ ఉలావీ ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవల వచ్చిన ఈ చిత్రం ట్రైలర్ ఆసక్తి కలిగించింది. ది విడోస్ గేమ్ చిత్రానికి కార్లోస్ సెడెస్ దర్శకత్వం వహించారు.

ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు అద్భుతమైన సినిమా అనుభవం లభించనుంది. వినోదం కోసం ఈ సినిమాలను తప్పక చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.