
📌 Key Points
- గల్ఫ్ దేశాల నుంచి మార్చి 1-7 తేదీల మధ్య 52,000 మంది భారతీయులు తిరిగి స్వదేశానికి చేరుకున్నారు.
- పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు స్వదేశానికి వస్తున్నారు.
- గల్ఫ్‌లోని పరిస్థితులను భారత విదేశాంగ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది.
- సమాచారం కోసం ఎంబసీ లేదా కాన్సులేట్‌ను సంప్రదించాలని విదేశాంగ శాఖ సూచించింది; హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల.
ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కారణంగా గల్ఫ్ దేశాల నుంచి దాదాపు 52 వేల మంది భారతీయులు మార్చి 1 నుంచి 7వ తేదీ మధ్య స్వదేశానికి తిరిగి వచ్చారు.
భారత్‌కు చేరిన 52 వేల మంది భారతీయులు
ఇరాన్, ఇజ్రాయిల్- అమెరికా మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. యుద్ధం నేపథ్యంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇరాన్ పై ఇజ్రాయిల్ దాడి చేస్తుంటే, ఇరాన్ మాత్రం చాలా భిన్నంగా ముందుకు వెళ్తోంది. పశ్చిమ ఆసియా గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది ఇరాన్. దీంతో గల్ఫ్ దేశాలలో ఉన్న మన ఇండియన్స్ గజగజ వణికి పోతున్నారు.
ఇందులో భాగంగానే పశ్చిమ ఆసియా, గల్ఫ్ లో ఉంటున్న మన భారతీయులు, వెనక్కి వస్తున్నారు. దానికి తగ్గట్టుగానే గల్ఫ్ లో ఉన్న పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తోంది భారత విదేశాంగ శాఖ. ఎయిర్ స్పేస్ పాక్షికంగా తెలుసుకోవడంతో ఎయిర్ లైన్స్ సంస్థలు కమర్షియల్ ఫ్లైట్స్ నడుపుతున్నాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో మార్చి ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు దాదాపు 52,000 మంది గల్ఫ్ నుంచి మన భారతదేశానికి తిరిగి వచ్చినట్లు స్పష్టం చేసింది. విమానాలు అందుబాటులో లేని వాళ్ళు సమాచారం కోసం ఎంబసీ లేదా కాన్సులేట్ ను సంపాదించాలని పేర్కొంది. హెల్ప్ లైన్ నెంబర్లు కూడా విడుదల చేసింది విదేశాంగ శాఖ.
గల్ఫ్‌లో ఉద్రిక్త పరిస్థితులు
భారత విదేశాంగ శాఖ సూచనలు
పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా గల్ఫ్ దేశాల నుంచి భారతీయుల రాక కొనసాగుతోంది. విదేశాంగ శాఖ సహాయక చర్యలు చేపట్టింది. ప్రయాణికులు ఎంబసీని సంప్రదించాలని సూచించింది.


