
80వ దశకపు సినీ నటీనటులు మరోసారి ’80’స్ రీయూనియన్’ పేరుతో సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, సుహాసిని వంటి ప్రముఖ తారలు హాజరయ్యారు. ‘వైల్డ్ టైగర్’ థీమ్ తో ప్రత్యేక కాస్ట్యూమ్స్ లో అలరించి, పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Key Points
1980వ దశకపు సినీ తారలు ప్రతీ సంవత్సరం '80'స్ రీయూనియన్' పేరుతో కలుస్తారు.
ఈసారి చిరంజీవి, వెంకటేష్, సుహాసిని, రేవతి వంటి ప్రముఖులు హాజరయ్యారు.
ఈ ఏడాది 'వైల్డ్ టైగర్' థీమ్ ను ఎంచుకుని తారలు ఒకే రకమైన కాస్ట్యూమ్స్ లో అలరించారు.
అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, సరదా ఆటపాటలతో సందడి చేశారు.
80’స్ రీయూనియన్ లో తారల సందడి
80’s Reunion: సినీ స్టార్స్ గెట్ టు గెదర్ తో మరోసారి సందడి చేశారు. 1980వ దశకంలో సినిమాల్లో నటించిన నటీనటులు అంతా ప్రతీ సంవత్సరం 80’స్ రీయూనియన్ పేరుతో ఓ వేదికను ఏర్పాటు చేసుకొని సందడి చేస్తున్న విషయం తెలిసిందే. 2019లో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో(80’s Reunion), 2022లో బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీష్రాఫ్ ఇంట్లో ఈ వేడుక జరిగింది. మరోసారి ఈ 80’స్ రీయూనియన్ లో తారలు మెరిశారు. దీనికి సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వైల్డ్ టైగర్ థీమ్ తో అలరించిన నటులు
Suhas: సుహాస్ సినిమా షూటింగులో ప్రమాదం.. బోల్తాకొట్టిన పడవ
పాత జ్ఞాపకాలు.. ఆటపాటలతో వినోదం
ఇక ఈ రీ-యూనియన్ పార్టీకి చిరంజీవి, వెంకటేష్, భానుచందర్, నరేష్, శరత్ కుమార్, జాకీ ష్రాఫ్, ప్రభు, సురేష్ తదితరులు హాజరయ్యారు. ఇక హీరోయిన్స్ లో సుహాసిని, రేవతి, నదియా, జయసుధ, సుమలత, మీనా, రాధా, కుష్బూ, రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. అలనాటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, సరదా ఆటపాటలతో వీరంతా సందడి చేశారు. అయితే, ఈ ఇయర్ 80’స్ రీయూనియన్ కి వైల్డ్ టైగర్ థీమ్ తీసుకున్నారు. తరాలు అందరూ ఒకే రకమైన కాస్త్యుమ్స్ లో అలరించారు.
ఈ 80’స్ రీయూనియన్ అలనాటి సినీ తారల మధ్య బంధాన్ని, స్నేహాన్ని మరోసారి చాటి చెప్పింది. వైల్డ్ టైగర్ థీమ్, సరదా ఆటపాటలతో తారలు అందరినీ అలరించారు. వైరల్ అవుతున్న ఫోటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.


