|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

A Master Piece : త్రేతాయుగానికి, ద్వాపర యుగానికి, కలియుగానికి లింక్ చేస్తూ ఈ సినిమా తీస్తున్నాం..

Published: 09-09-2025, 10:43 AM
A Master Piece : త్రేతాయుగానికి, ద్వాపర యుగానికి, కలియుగానికి లింక్ చేస్తూ ఈ సినిమా తీస్తున్నాం..

డైరెక్టర్ పూర్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఏ మాస్టర్ పీస్’ సినిమా త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాలను కలిపే కథాంశంతో ఆకట్టుకుంటుంది. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Key Points

1

త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాలను లింక్ చేసే కథాంశంతో ‘ఏ మాస్టర్ పీస్’ సినిమా రూపొందుతోంది.

2

అరవింద్ కృష్ణ సూపర్ హీరోగా, మనీష్ గిలాడ సూపర్ విలన్ గా నటిస్తున్నారు.

4

పురాణాల నుండి స్ఫూర్తి పొందిన ఈ సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతుందని నిర్మాతలు ఆశిస్తున్నారు.

‘ఏ మాస్టర్ పీస్’ సినిమా ప్రెస్ మీట్ విశేషాలు

A Master Piece : శుక్ర, మాటరాని మౌనమిది.. లాంటి డిఫరెంట్ సినిమాలు తీసిన డైరెక్టర్ పూర్వాజ్ త్వరలో ‘ఏ మాస్టర్ పీస్’ అనే సినిమాతో రాబోతున్నాడు. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వజ్, మనీష్ గిలాడ, అషు రెడ్డి లీడ్ రోల్స్ లో నటిస్తుండగా శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ, ప్రజయ్ కామత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుండగా ప్రెస్ మీట్ నిర్వహించి సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు.(A Master Piece)

ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ పూర్వాజ్ మాట్లాడుతూ.. అరవింద్ కృష్ణ ఏ మాస్టర్ పీస్ సినిమాలో సూపర్ హీరోగా కనిపిస్తారు. ఈ సినిమా కథను మన పురాణ ఇతిహాసాల నుంచి స్ఫూర్తి పొంది తయారుచేశాను. దశరథ మహారాజు మంత్రుల్లో ఒకరైన సుమంత్రుడికి శ్రీరాముడు వనవాసం వెళ్తున్న సమయంలో ఒక వరం లభిస్తుంది, ఆ వరం నేపథ్యంగా సూపర్ హీరో క్యారెక్టర్ ను, హిరణ్యకశ్యపుడి ద్వాపర యుగానికి చెందిన ఒక అంశంతో సూపర్ విలన్ పాత్రను క్రియేట్ చేశాం. శ్రీరాముడి త్రేతాయుగానికి, హిరణ్యకశ్యపుడి ద్వాపర యుగానికి, ఇప్పటి కలియుగానికి లింక్ చేస్తూ సరికొత్త సినిమా తెరకెక్కిస్తున్నాం. ఈ కథలో శివుడి నేపథ్యం ఉంది కాబట్టి మేము అనుకున్నట్లు జరిగితే మహాశివరాత్రికి సినిమాని రిలీజ్ చేస్తాము అని తెలిపారు.

Also See : Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం K ర్యాంప్ నుంచి మెలోడీ ప్రేమ గీతం విన్నారా?

పురాణాల నుంచి స్ఫూర్తి పొందిన కథాంశం

హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ లో నాకు కొన్నిసార్లు గాయాలు అయ్యాయి. అందుకే షూటింగ్ వాయిదా వేయడంతో లేట్ అయింది. నా కోసం మా డైరెక్టర్ పూర్వాజ్ వెయిట్ చేశారు. నాకే కాదు మా టీమ్ లోని చాలా మందికి ఇబ్బందులు ఎదురయ్యాయి. అవన్నీ గుర్తొస్తే నేను ఎమోషనల్ అవుతాను. మనం జీవితంలో ఏదో గొప్పగా సాధించబోయే ముందు ఇలాంటి కష్టాలు వస్తాయని అంటారు. ఏ మాస్టర్ పీస్ సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేలా ఉంటుంది అని అన్నారు.

సూపర్ విలన్, ప్రొడ్యూసర్ మనీష్ గిలాడ మాట్లాడుతూ.. ఏ మాస్టర్ పీస్ టీజర్ రిలీజ్ చేసి 14 నెలలు అవుతోంది. ఇప్పుడు క్లైమాక్స్ షూటింగ్ చేస్తున్నాం. అనివార్య కారణాలతో డిలే అయ్యింది. ఈ రోజు రేపటి కల్లా మొత్తం మూవీ షూటింగ్ కంప్లీట్ అవుతుంది. క్లైమాక్స్ కోసం ఓ సాంగ్ షూట్ చేస్తున్నాం అని తెలిపారు.

నటీనటుల అనుభవాలు మరియు సినిమా విడుదల తేదీ

హీరోయిన్ జ్యోతి పూర్వాజ్ మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం ఈ సినిమాలోకి వచ్చాను. ఈ సినిమా వల్ల పూర్వాజ్ నా లైఫ్ పార్టనర్ గా మారాడు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ డిఫరెంట్ వేరియేషన్స్ లో ఉంటుంది. ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. మైథాలజీని, సూపర్ హీరో జానర్ ను కలిపి ఒక గొప్ప సినిమాని తీస్తున్నారు అని తెలిపింది. నిర్మాత శ్రీకాంత్ కండ్రేగుల మాట్లాడుతూ.. మలయాళంలో మిన్నల్ మురళీ సినిమా వచ్చాక అలాంటి ఒక సూపర్ హీరో సినిమాని తెలుగులో ఎందుకు చేయకూడదు అని ఏ మాస్టర్ పీస్ మొదలుపెట్టాం. హాలీవుడ్ లో కూడా ఉపయోగించని టెక్నాలజీని మా సినిమాకు వాడుతున్నాం అని అన్నారు.

‘ఏ మాస్టర్ పీస్’ సినిమా షూటింగ్ పూర్తయి, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పురాణాల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు సినిమాకు కొత్త అధ్యాయాన్ని జోడించే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.