|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ట్రోలర్స్‌కి ఆది సాయి కుమార్ స్ట్రాంగ్ కౌంటర్! ఎవరికీ లేదంటూ ఫైర్!!

Published: 09-01-2026, 5:00 AM
ట్రోలర్స్‌కి ఆది సాయి కుమార్ స్ట్రాంగ్ కౌంటర్! ఎవరికీ లేదంటూ ఫైర్!!
  • ఆది సాయి కుమార్ ‘శంబాల’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్!
  • ట్రోల్స్‌పై ఆది ఫైర్: ‘నేను ఏం చేయాలో చెప్పడానికి మీరెవరు?’
  • విమర్శలను స్వీకరిస్తా.. కానీ మనోధైర్యాన్ని దెబ్బతీసే మాటలు బాధించాయిన్న ఆది.
  • కమర్షియల్, కంటెంట్ ఓరియెంటెడ్ కథలపై దృష్టి పెడతానన్న ఆది సాయి కుమార్.

యంగ్ హీరో ఆది సాయి కుమార్ ట్రోల్స్ పై సీరియస్ అయ్యారు. తన నటనపై వస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందించారు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

ట్రోల్స్‌పై ఆది సాయి కుమార్ ఫైర్

ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) సరైన హిట్‌ కోసం రెండేళ్ల పాటు కాస్త గ్యాప్ తీసుకున్నాడు. మళ్లీ ‘షణ్ముఖ’తో రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోయినా, ఆది మాత్రం నిరుత్సాహపడలేదు. విమర్శలను సీరియస్‌గా తీసుకుంటూనే, తనలోని లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. అదే క్రమంలో వచ్చిన ‘శంబాల’(Shambhala) అతడి కెరీర్‌కు మళ్లీ ఊపునిచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ఆది కృషికి ఫలితం దక్కినట్టయింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో కొందరు ట్రోలింగ్ చేయడం ఆగలేదు. ముఖ్యంగా నటన, సినిమాల ఎంపికలపై విమర్శల పేరుతో వ్యక్తిగతంగా దాడి చేయడం తనను బాధించిందని ఆది ఓ ఇంటర్వ్యూలో ఓపెన్‌గా చెప్పారు. ‘‘నటించొద్దు, సినిమాలు చేయొద్దు అంటూ చెప్పే హక్కు ఎవరికీ లేదు’’ అంటూ ఆది మండిపడ్డారు.

నేనుమి చేయాలో చెప్పడానికి మీరెవరని.. సినిమా నచ్చకపోతే నిర్మాణాత్మక విమర్శలు చేయాలని, అలా చెబితేనే నటులుగా మేం ఇంకా మెరుగ్గా తయారవుతామని అన్నారు. తప్పులను చూపించడం ఒకటి అయితే, మనోధైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం వేరే అని అన్నారు. విమర్శలను స్వీకరించడానికి తాను సిద్ధమే కానీ, నిరుత్సాహపరిచే మాటలు మాత్రం బాధిస్తాయని చెప్పాడు. ‘శంబాల’ విజయం తనకు ఆత్మవిశ్వాసాన్ని తిరిగి ఇచ్చిందని ఆది అన్నారు. రెండేళ్ల గ్యాప్ తర్వాత కూడా ప్రేక్షకులు తన సినిమాను ఆదరించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఈ విజయం తనను మరింత బాధ్యతతో ఉండేలా చేసిందని.. తదుపరి ప్రాజెక్ట్‌ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటానని వెల్లడించారు. ఇక భవిష్యత్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. కేవలం కమర్షియల్ సినిమాలకే కాకుండా కంటెంట్ ఓరియెంటెడ్ కథలపై కూడా దృష్టి పెడతానని.. తనపై నమ్మకం ఉంచిన నిర్మాతలు, దర్శకులకు నిరాశ కలిగించకుండా పని చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.

‘శంబాల’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఆది

మున్ముందు కంటెంట్ సినిమాలే అంటున్న ఆది

ఆది సాయి కుమార్ కామెంట్స్‌తో సోషల్ మీడియాలో దుమారం రేగింది. ఆయన భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.