
📌 Key Points
- ఆది సాయి కుమార్ హీరోగా ‘ఈగో రాజా’ మూవీ ప్రారంభం!
- గురు శరవణన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ్ లో ద్విభాషా చిత్రం
- ఉగాది సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్
- హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో సినిమా ఉండబోతోందని సమాచారం!
ఆది సాయి కుమార్ శంభాలా సక్సెస్‌తో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ‘ఈగో రాజా’ అంటూ మరో కొత్త సినిమాతో మీ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
ఎస్జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ‘ఈగో రాజా’
Aadi Sai Kumar : ఇటీవలే శంబాలా సినిమాతో భారీ సక్సెస్ కొట్టాడు ఆది సాయి కుమార్. తాజాగా మరో కొత్త సినిమా ప్రకటించాడు. ఎస్‌జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జి.సురేష్ నిర్మాణంలో గురు శరవణన్ దర్శకత్వంలో ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘ఈగో రాజా’. ఈ సినిమాలో ఆదితో పాటుగా నటుడు సతీష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తెలుగు, తమిళ్ లో ద్విభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.
తమిళ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఆది సాయి కుమార్
నేడు ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి ఆది సాయి కుమార్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చుట్టూ రౌడీలు, ఒంటిపై గాయాలు, రక్తం మరకలు చూస్తుంటే హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండేట్టుగానే కనిపిస్తున్నాయి.
ఫస్ట్ లుక్ పోస్టర్ తో అంచనాలు పెంచేసిన హీరో
కె. ఎస్. రవికుమార్ వద్ద పనిచేసిన దర్శకుడు గురు శరవణన్ ‘కూగల్ కుట్టప్ప’తో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తన మూడో సినిమాగా ఈగో రాజాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో ఆది తమిళ్ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.
‘ఈగో రాజా’ సినిమాతో ఆది సాయి కుమార్ మరో సక్సెస్ అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


