
హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న ‘శంబాల: ఏ మిస్టికల్ వరల్డ్’ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ప్రభాస్, రానా వంటి సినీ ప్రముఖులు మద్దతు తెలిపారు. ఈ సినిమా హిందీ రిలీజ్ గురించి కూడా ప్రశ్నలు వస్తున్నాయని ఆది వెల్లడించారు.
Key Points
ఆది సాయికుమార్ హీరోగా 'శంబాల: ఏ మిస్టికల్ వరల్డ్' డిసెంబరు 25న విడుదల కానుంది.
చిత్ర ట్రైలర్‌కు ప్రభాస్, రానా వంటి ప్రముఖుల నుండి ప్రశంసలు, మద్దతు లభించాయి.
కొంతమంది ప్రేక్షకులు సినిమా హిందీ రిలీజ్ గురించి ఆసక్తిగా అడుగుతున్నారని ఆది తెలిపారు.
దర్శకుడు యుగంధర్ ముని 'శంబాల'ను థియేటర్స్‌లో చూడాల్సిన చిత్రంగా అభివర్ణించారు.
‘శంబాల’ మూవీ విడుదల వివరాలు
‘‘సినిమాలోని కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ ఉన్న మా ‘శంబాల’ ఏ ఒక్కరినీ నిరాశపరచదు. మా చిత్రాన్ని ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అని ఆది సాయికుమార్ అన్నారు. ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ‘శంబాల: ఏ మిస్టికల్ వరల్డ్’. అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ కీలక పాత్రలు చేస్తున్నారు. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 25న రిలీజ్ కానుంది.
ట్రైలర్‌కు సినీ ప్రముఖుల మద్దతు
ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్‌కు మంచి స్పందన లభించిందని చిత్రబృందం పేర్కొంది. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆది సాయికుమార్ మాట్లాడుతూ– ‘‘మా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన ప్రభాస్‌గారికి థ్యాంక్స్. ఈ ట్రైలర్ చూసి, రానాగారు మెచ్చుకుని, తన వంతుగా సాయం చేస్తానని చెప్పారు. కొంతమంది హిందీ రిలీజ్ గురించి అడుగుతున్నారు.
ఆది సాయికుమార్ ప్రెస్ మీట్ హైలైట్స్
ఇంకా మాకు సపోర్ట్‌గా నిలిచిన దుల్కర్, సందీప్ కిషన్, కిరణ్ అబ్బవరం, సహకరించిన నిర్మాతలు వంశీ, ప్రమోద్, ప్రసాద్ అన్నలకు ధన్యవాదాలు. రాజీపడకుండా నిర్మించిన నిర్మాతలకు లాభాలు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘థియేటర్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన చిత్రమిది’’ అని యుగంధర్ ముని చెప్పారు.
‘శంబాల’ కంటెంట్‌పై ఆది సాయికుమార్ పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. ఇది థియేటర్‌లో అనుభవించాల్సిన చిత్రమని దర్శకుడు తెలిపారు. ప్రేక్షకుల మద్దతుతో సినిమా విజయం సాధిస్తుందని చిత్రబృందం ఆశిస్తోంది.


