
📌 Key Points
- ఆర్థిక ఇబ్బందుల వల్ల రీఎంట్రీ అవాస్తవం, సినిమా అంటే ప్యాషన్ అన్న ఆమని.
- తన బ్రేక్, కంబ్యాక్ రెండూ స్వచ్ఛంద నిర్ణయాలే అని స్పష్టం చేసింది.
- భర్తతో స్నేహపూర్వకంగా విడిపోయామని, ఇప్పటికీ మాట్లాడుకుంటామని వెల్లడి.
- ఇద్దరు పిల్లలే తన ప్రపంచం, కెరీర్ ఆలస్యంగా దక్కిందని పేర్కొంది.
టాలీవుడ్ నటి ఆమని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రీఎంట్రీ వెనుక నిజాలను వెల్లడించింది. ఆర్థిక కారణాలు అవాస్తవమని, సినిమాపై తనకున్న ప్యాషనే కారణమని చెప్పింది. విడాకులు, పిల్లలు, వ్యక్తిగత జీవితంపై ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
నా రీఎంట్రీకి అసలు కారణం ఇదే!
టాలీవుడ్ నటి ఆమని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన విడాకులు, కంబ్యాంక్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. అలాగే తన వైవాహిక జీవితానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంది. తనది లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ కాదని, కేవలం ఒక కనెక్ట్ కావడం వల్ల ఇద్దరి మధ్య బంధం ఏర్పడిందని తెలిపింది. ఆ సమయంలో తన మంచితనం చూసి వివాహం చేసుకున్నానని పేర్కొంది.
సినిమాల్లోకి కంబ్యాక్ ఇవ్వడం వెనుక అసలు కారణాన్ని నటి ఆమని పేర్కొంది. తన భర్త ఆర్ధిక ఇబ్బందులు కారణంగానే తాను మళ్లీ సినిమాల్లోకి వచ్చానన్నది పూర్తిగా అవాస్తవం అని ఆమె తెలిపింది. తనకు సినిమా అంటే ప్యాషన్ అని.. అవకాశం వచ్చింది కాబట్టే మళ్లీ సినిమాల్లోకి వచ్చానని చెప్పింది. బ్రేక్ తీసుకున్నది తానేనని.. మళ్లీ సినిమాల్లోకి వచ్చింది కూడా తానే అని స్పష్టం చేసింది.
విడాకులు, పిల్లలపై ఆమని సంచలన వ్యాఖ్యలు
తన భర్తతో విడిపోవడానికి వెనుక పెద్ద కారణాలు ఏవి లేవని.. తమ మధ్య బంధం ఫ్రెండ్లీగా ముగిసిందని ఆమని పేర్కొంది. తన భర్త మంచి వ్యక్తి అని, తాను సినిమాల్లో బిజీగా ఉండగా, ఆయన తన వ్యాపారాల్లో బిజీగా ఉన్నారని తెలిపింది. తాము ఇప్పటికీ మాట్లాడుకుంటున్నామని స్పష్టం చేసింది.
తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని(బాబు10 సంవత్సరాలు, పాప 7 సంవత్సరాలు).. వాళ్లే తనకు ప్రపంచం అని చెప్పింది. తనకు మొదటి ప్రపంచం సినిమా అయితే.. రెండో ప్రపంచం తన పిల్లలని వివరించింది. సినిమా షూటింగ్స్ కోసం అవుట్ డోర్ వెళ్లాల్సి వచ్చినప్పుడు.. పిల్లలకు దూరంగా ఉండటం బాధ కలిగిస్తుందని చెప్పింది.
నాకు సినిమా అంటే ప్యాషనే: ఆమని
కెరీర్, వ్యక్తిగత జీవితంలో తనకు అన్నీ కూడా ఆలస్యంగా దక్కాయని ఆమని చెప్పింది. హీరోయిన్‌గా స్థిరపడటానికి ఒకటిన్నర సంవత్సరం కష్టపడ్డా అని తెలిపింది. మొదట ఒక పాప చలనుకున్నాను. కానీ దేవుడు ఇద్దరు పిల్లలను ఇచ్చారు అని వెల్లడించింది.
ఆమని తన రీఎంట్రీ, వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు ఆమె నిజాయితీని తెలియజేస్తున్నాయి. సినిమా పట్ల ఆమెకున్న అంకితభావం, పిల్లలపై ప్రేమ ఆమెను మరింత శక్తివంతంగా మార్చాయి. తన కెరీర్, జీవితంపై ఆమె ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయి.


