|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పాకిస్తాన్‌లో ‘దంగల్‌’ ఎందుకు విడుదల చేయలేదో చెప్పిన ఆమిర్‌ ఖాన్‌

Published: 14-06-2025, 12:48 AM
పాకిస్తాన్‌లో 'దంగల్‌' ఎందుకు విడుదల చేయలేదో చెప్పిన ఆమిర్‌ ఖాన్‌

2016లో విడుదలైన దంగల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించింది. కానీ పాకిస్తాన్ లో ఈ సినిమా విడుదల కాలేదు. దీనికి కారణం ఏమిటో ఆమిర్ ఖాన్ తాజాగా వెల్లడించాడు.

Key Points

1

పాకిస్తాన్ సెన్సార్ బోర్డ్ దంగల్ సినిమాలోని జాతీయ గీతం, జాతీయ జెండాను తొలగించమని డిమాండ్ చేసింది.

2

ఆమిర్ ఖాన్ పాకిస్తాన్ సెన్సార్ బోర్డ్ షరతులను తిరస్కరించాడు.

4

సినిమా విడుదల కాకపోవడం వల్ల నిర్మాతలకు ఆర్థిక నష్టం వాటిల్లింది.

పాకిస్తాన్ సెన్సార్ బోర్డ్ షరతులు

బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌( Aamir Khan) నటించిన ‘దంగల్‌’ చిత్రం 2016లో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ మూవీని రిలీజ్‌ చేశారు. కానీ,  పాకిస్తాన్‌లో భారత సినిమాలకు పెద్ద మార్కెట్‌ ఉంది. అయితే, దంగల్‌ చిత్రాన్ని పాక్‌లో ఎందుకు విడిదల చేయలేదో తాజాగా ఆ చిత్ర నటుడు ఆమిర్‌ ఖాన్‌ వెళ్లడించారు. రెజ్లర్‌ మహవీర్‌ ఫోగట్‌ జీవితకథతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 2,070 కోట్లు రాబట్టింది. నితేష్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఆమిర్ ఖాన్ నిర్ణయం

దంగల్ పాకిస్తాన్‌లో ఎందుకు విడుదల కాలేదో ఆమిర్‌ ఖాన్‌ ఇలా చెప్పారు. ‘పాక్‌లో దంగల్ విడుదల కావాలంటే వారు రెండు షరతులు పెట్టారు. మన జాతీయ గీతం, జాతీయ జెండాను మూవీ నుంచి తొలగించాలని అక్కడి ‌ సెన్సార్‌ బోర్డు  కోరింది. నేను అందుకు అంగీకరించలేదు.  గీతా ఫోగట్ మ్యాచ్ గెలిచిన సన్నివేశంలో భారత జెండాతో పాటు  జాతీయ గీతం ఉంటుంది. వాటిని తొలగిస్తినే ఈ చిత్రానికి అనుమతి ఉంటుందని పాక్‌ సెన్సార్‌ చెప్పింది. దీంతో ఒక సెకనులోపు, మా సినిమా పాకిస్తాన్‌లో విడుదల కాదని నేను వారికి చెప్పాను. పాకిస్తాన్ విడుదలను రద్దు చేయడం వల్ల తమ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిర్మాతలు నాతో చెప్పారు. అయినప్పటికీ, భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న దేనికీ మద్దతు ఇవ్వకూడదని  స్పష్టంగా ఆరోజే చెప్పాను.

సినిమా విడుదల రద్దు

ఏప్రిల్‌లో జరిగిన పహల్గాం దాడికి ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌పై భారత్‌‌ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో పాక్‌ నటీనటులను బ్యాన్‌ చేయాలని ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ కోరింది. దీంతో వారిని పూర్తిగా భారత్‌లో నిషేధించారు.

చివరకు, జాతీయ గౌరవం కాపాడుకునేందుకు ఆమిర్ ఖాన్ తీసుకున్న నిర్ణయం దంగల్ సినిమా పాకిస్తాన్ లో విడుదల కాకుండా చేసింది. ఆయన నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.