|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Aamir Khan: తెలుగు దర్శకుడితో ఆమిర్ ఖాన్ సినిమా..?

Published: 27-06-2025, 4:18 PM
Aamir Khan: తెలుగు దర్శకుడితో ఆమిర్ ఖాన్ సినిమా..?

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తెలుగు సినిమాలో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని భావిస్తున్నారు.

Key Points

1

ఆమిర్ ఖాన్ తెలుగు దర్శకుడితో సినిమా చేయబోతున్నారు.

2

వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించే అవకాశం ఉంది.

4

సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమా ఉంటుంది.

ఆమిర్ ఖాన్ తెలుగు సినిమా?

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan) షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అది త్వరలోనే ఓ తెలుగు దర్శకుడు తో ఆమిర్ ఖాన్ సినిమా తీసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. దీనిపై ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నారట ఈ బాలీవుడ్ హీరో. ఇందులో భాగంగానే ఇప్పటికే కథ చర్చలు ముగిసాయని… స్టోరీ నచ్చడంతో హీరో ఆమిర్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సోషల్ మీడియాలో వార్త చెక్కర్లు కొడుతోంది.

ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ముందుకు వచ్చాడని కూడా టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది. ఒక సోషల్ మెసేజ్ కలిగిన కమర్షియల్ ఎంటర్టైనర్ జోనర్ లో తెరకెక్కనుందని సమాచారం అందుతుంది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు… ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ వంశీ పైడిపల్లి. హిందీ భాషలో మొదట రూపొందించి ఆ తర్వాత తెలుగు, సమయంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

వంశీ పైడిపల్లి దర్శకత్వం?

దిల్ రాజు నిర్మాణం?

ప్రస్తుతం ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆమిర్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో సినిమా వస్తే అది తెలుగు ప్రేక్షకులకు పెద్ద విందు అవుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.