|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అబ్బాస్ రీ ఎంట్రీ: ఆ క్రేజీ హీరో మళ్ళీ వస్తున్నాడు.. ఈసారి హిట్ పక్కానా?

Published: 16-12-2025, 10:04 PM
అబ్బాస్ రీ ఎంట్రీ: ఆ క్రేజీ హీరో మళ్ళీ వస్తున్నాడు.. ఈసారి హిట్ పక్కానా?
  • ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ హీరో అబ్బాస్ తిరిగి సినిమాల్లోకి వస్తున్నారు.
  • ‘హ్యాపీ రాజ్’ అనే తమిళ చిత్రంతో ఆయన రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.
  • న్యూజిలాండ్‌లో ఉన్న అబ్బాస్‌ను డైరెక్టర్ మారి ఇలాంచెళియన్ స్వయంగా సంప్రదించారు.
  • ఈ సినిమాలో కోలీవుడ్ హీరో జీవీ ప్రకాష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

ఒకప్పుడు టాలీవుడ్‌లో అమ్మాయిల కలల రాకుమారుడిగా వెలుగొందిన అబ్బాస్ మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. చాలా ఏళ్ల తర్వాత ఆయన తిరిగి వస్తున్న వార్త అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది. ‘హ్యాపీ రాజ్’ అనే తమిళ సినిమాతో అబ్బాస్ మళ్ళీ వెండితెరపై మెరవనున్నారు.

అబ్బాస్: ఒకప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్!

టాలీవుడ్ హీరో అబ్బాస్ (Abbas)గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి పని లేదు. ఒకప్పుడు పలు చిత్రాల్లో నటించిన ఆయన ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. మరీ ముఖ్యంగా అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఆయనను, అబ్బాస్ స్టైల్‌ను ఎంతగానో ఇష్టపడ్డారనడంలో అతిశయోక్తి లేదు. ఆయన హెయిర్ స్టైల్‌కి అందరూ ఫిదా అయిపోయి.. చాలామంది కూడా సెలూన్‌కు వెళ్లి అబ్బాస్ హెయిర్ స్లైల్ చేయా అన్న అనేవాళ్లు. ఇంత పాపులారిటీ వచ్చినప్పటికీ ఆయన ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఇతర దేశాల్లో సెటిల్ అయ్యాడు. దీంతో ఆయనకు అవకాశాలు రావడం కూడా పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో ఆయన అక్కడే ఉండిపోయారు. తాజాగా సమాచారం ప్రకారం.. అబ్బాస్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.

సినిమాలకు బ్రేక్.. తిరిగి ఎలా వచ్చారంటే?

ఓ తమిళ చిత్రంలో ఆయన కీలక పాత్రలో కనిపించనున్నట్లు స్వయంగా డైరెక్టర్ వెల్లడించడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న అబ్బాస్ ‘హ్యాపీ రాజ్’ (Happy Raj)మూవీతో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని తెలుపుతూ డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.. ‘‘కథలో ఒక పాత్ర ఆయనకు సరిగ్గా సరిపోయేలా ఉంది. మేమే ఆన్‌లైన్‌లో ఆయన కోసం వెతికినప్పుడు న్యూజిలాండ్‌లో ఉన్నారని తెలిసింది. మేము మా ఆసక్తిని తెలియజేయగానే ఆయన వీడియోల్ కాల్ ద్వారా కథ విన్నారు. అది నచ్చడంతో వెంటనే నటించడానికి అంగీకరించారు.

‘హ్యాపీ రాజ్’లో అబ్బాస్ పాత్ర: డైరెక్టర్ కామెంట్స్

దాని గురించి నిజంగా సంతోషించారు. ఆయన ఇంత దూరం ప్రయాణించి ఈ సినిమాలో నటించినప్పుడు ఆయన అనుభవం నటనలో స్పష్టంగా కనిపించింది. తన నటన ద్వారా మా నిర్ణయం సరైనది అని మాకు ప్రూవ్ చేశారు’’ అని దర్శకుడు మారి ఇలాంచెళియన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అది చూసిన నెటిజన్లు ఈసారైనా లక్ కలిసొస్తుందా? అని కామెంట్లు చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో కోలీవుడ్ హీరో జీవీ ప్రకాష్(GV Prakash) ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందులో ఆయన ఆనంద్ రాజ్ పేరు పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

అబ్బాస్ రీ ఎంట్రీతో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆయన కెరీర్‌కు ఇది శుభారంభం అవుతుందా? ఈసారి అబ్బాస్‌కు లక్ కలిసొచ్చి మళ్ళీ స్టార్‌డమ్ అందుకుంటారా అనేది వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.