|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నటుడు ‘ఆర్య’ వ్యాపార కార్యాలయాల్లో ఐటీ సోదాలు

Published: 19-06-2025, 2:59 AM
నటుడు 'ఆర్య' వ్యాపార కార్యాలయాల్లో ఐటీ సోదాలు

తమిళ సినీ నటుడు ఆర్య నివాసం, వ్యాపార సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) ఆకస్మిక దాడులు నిర్వహించింది. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఆర్యకు చెందిన ‘సీ షెల్’ హోటల్‌తో సహా అనేక ప్రాంతాలలో తనిఖీలు జరిగాయి.

Key Points

1

కోలీవుడ్ నటుడు ఆర్య నివాసం, వ్యాపార కార్యాలయాలపై ఐటీ సోదాలు జరిగాయి.

2

ఆర్య 'సీ షెల్' హోటల్‌తో సహా అనేక వ్యాపారాలపై తనిఖీలు జరిగాయి.

4

ఆర్య 'సీ షెల్' రెస్టారెంట్ చైన్‌ను ఇప్పటికే విక్రయించినట్లు తెలిపారు.

ఐటీ శాఖ ఆకస్మిక దాడులు

కోలీవుడ్‌ నటుడు ఆర్య నివాసం,  వ్యాపార సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) ఆక‌స్మిక‌ దాడులు చేసినట్లు తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆర్య నటుడు మాత్రమే కాదు, నిర్మాత కూడా.. ఇటీవల సంతానం నటించిన హర్రర్ మూవీ డిడి నెక్స్ట్ లెవెల్‌ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే.. అయితే, ఈ ఉదయం చెన్నైలోని అన్నా నగర్‌లోని తను నిర్వహిస్తున్న ‘సీ షెల్’ హోటల్‌తో పాటు మరికొన్ని వ్యాపార కార్యాలయాలపై ఐటీ శాఖ సోదాలు చేసింది. ఆర్య వ్యాపారాలు చేస్తూ.. పన్ను చెల్లించకుండా ఉన్నారని సమాచారం రావడంతో అధికారులు తనిఖీ చేసినట్లు తెలుస్తోంది.

ఆర్య  ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆపై నిబంధనల ప్రకారం పన్నులు చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి. చెన్నైలోని అన్నా నగర్, వేలచెరి, కొట్టివాకం, కిల్పాక్ వంటి ప్రాంతాల్లో తనకు సంబంధించిన ‘సీ షెల్’ రెస్టారెంట్ల కార్యాలయాలు, శాఖల్లో తనిఖీలు చేశారు. అయితే, ఆర్య కూడా స్పందించారు.  ‘సీ షెల్’ రెస్టారెంట్ చైన్‌ను  గతంలోనే కేరళకు చెందిన వ్యాపారి కున్హి మూసాకు విక్రయించినట్లు ఆయన చెప్పారు. కానీ, ఐటీ అధికారులు ఈ అంశం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.

‘సీ షెల్’ హోటల్‌పై తనిఖీలు

ఆర్య వివరణ

ఐటీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్య ‘సీ షెల్’ రెస్టారెంట్ చైన్ విక్రయించినట్లు చెప్పినప్పటికీ, దర్యాప్తు ఫలితాలే తుది నిర్ణయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.