
📌 Key Points
- వైరల్ అవుతున్న ప్రభాస్ ‘స్పిరిట్’ లుక్ ఫోటో పై స్పందించిన నటుడు శివ గణేష్!
- ఆ ఫోటోలో ఉన్నది నేను, ప్రభాస్ కాదు అని క్లారిటీ ఇచ్చిన శివ గణేష్.
- వరుడు కావలెను, పుష్ప, RRR సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన శివ గణేష్.
- వెనక నుంచి చూస్తే ప్రభాస్ లా ఉండటంతో ఫోటో వైరల్ చేశారన్న శివ గణేష్!
ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్. ఇటీవల ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది ప్రభాస్ స్పిరిట్ లుక్ అంటూ అందరూ షేర్ చేశారు. కానీ అసలు విషయం వేరే ఉంది.
వైరల్ అవుతున్న ఫోటోలో నిజమెంత?
Prabhas : ఇటీవల ప్రభాస్ స్పిరిట్ లుక్ అంటూ ఓ ఫోటో వైరల్ అయింది. ఆ ఫొటోలో ఫేస్ కనిపించకుండా వెనక నుంచి తీశారు. వెనక నుంచి చూస్తే అది ప్రభాస్ ఫోటోనే అని అనిపిస్తుంది. హైట్ లో తేడా ఉన్నా బ్యాక్ లుక్స్ ప్రభాస్ లాగానే ఉన్నాయి. దీంతో పలువురు నెటిజన్లు ప్రభాస్ స్పిరిట్ లుక్ అంటూ ఈ ఫోటోని వైరల్ చేసారు.
శివ గణేష్ క్లారిటీ ఏమిటి?
అయితే ఈ ఫోటో ప్రభాస్ ది కాదు నాదే అంటూ ఓ నటుడు చెప్పుకొచ్చాడు. వరుడు కావలెను, పుష్ప, RRR, ఆంద్ర కింగ్ తాలూకా.. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఇప్పుడిప్పుడే వరుస సినిమాలు చేస్తున్నాడు శివ గణేష్. ఇటీవల తను చేస్తున్న ఓ సినిమాలో నుంచి షూటింగ్ సమయంలో వెనక నుంచి దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది ప్రభాస్ ఫోటో అని వైరల్ అయింది.
ప్రభాస్ ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంది?
దీనిపై శివ గణేష్ స్పందిస్తూ.. అది ఇటీవల నేను ఒక సినిమా షూటింగ్ లో దిగిన ఫోటో. ఎందుకు అది ప్రభాస్ ఫోటో అని వైరల్ అయిందో నాకు తెలీదు. వెనక నుంచి చూస్తే కొంచెం లుక్స్ అలాగే ఉన్నాయని అంటున్నారు. ఫ్రెండ్స్ కూడా ఇది ప్రభాస్ ఫోటో అని వేసిన ట్వీట్స్ నాకు పంపించారు. కానీ ఆ ఫోటో మాత్రం నాదే, ప్రభాస్ ది కాదు అని తెలిపాడు.
చివరికి శివ గణేష్ ఆ ఫోటో తనదే అని చెప్పడంతో ఈ వివాదానికి తెరపడింది. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


