
బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల కోసమేనని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఆయన కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్ ఆసుపత్రిలో ఉన్నారు. పుకార్లను నమ్మవద్దని డియోల్ కుటుంబం విజ్ఞప్తి చేసింది.
Key Points
బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు.
సాధారణ వైద్య పరీక్షల కోసమేనని కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ధర్మేంద్రతో పాటు కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్ ఆసుపత్రిలో ఉన్నారు.
సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మవద్దని కుటుంబం కోరింది.
ధర్మేంద్ర ఆసుపత్రిలో చేరిక – కుటుంబ సభ్యుల వివరణ
బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర (89) అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు . ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన కుటుంబ సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి . అయితే , కేవలం వైద్య పరీక్షల కోసం మాత్రమే ధర్మేంద్ర వెళ్లారని చెబుతున్నారు . సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మవద్దని వారు కోరుతున్నారు .
పుకార్లను నమ్మవద్దన్న డియోల్ కుటుంబం
ఆసుపత్రిలో ధర్మేంద్రతో పాటు ఆయన కుమారులు సన్నీ డియోల్ , బాబీ డియోల్( Bobby Deol) కూడా ఉన్నారు . కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో ఉండటం వల్ల కొన్ని వైద్య పరీక్షలు చేపిస్తున్నట్లు చెప్పారు . చికిత్స కోసం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని తెలిపారు . కానీ , డిశ్చార్జ్ తేదీపై వారు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు .
ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి, గత చికిత్సలు
బాలీవుడ్ సూపర్ స్టార్ ధర్మేంద్ర డిసెంబర్‌లో తన 90వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ధర్మేంద్ర కంటిశుక్లం శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిదే . వృత్తిపరంగా, ధర్మేంద్ర చివరిసారిగా 2024లో తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా చిత్రంలో కనిపించారు. ఈ చిత్రంలో నటులు షాహిద్ కపూర్ , కృతి సనన్ నటించారు.
ధర్మేంద్ర ఆరోగ్యంగానే ఉన్నారని, సాధారణ పరీక్షల కోసమే ఆసుపత్రికి వెళ్లారని ఆయన సన్నిహితులు తెలిపారు. త్వరలోనే ఆయన ఇంటికి తిరిగి వస్తారని ఆశిద్దాం. అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు.


