|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

డ్రంక్ & డ్రైవ్: పోలీసులు ఆపితే కార్ వదిలేసి పారిపోయిన నటుడు అమర్ దీప్..

Published: 12-08-2025, 11:53 PM

ప్రముఖ తెలుగు నటుడు అమర్ దీప్ తన తొలినాళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చిక్కుకున్నాడు. పోలీసులు ఆపగానే ఆయన చేసిన పని ఏంటో తెలుసా? కారు వదిలేసి పారిపోయాడు! తెల్లారగానే పోలీసుల ఫోన్ కాలతో ఆయన ఎలా స్పందించాడో చూద్దాం.

Key Points

1

నటుడు అమర్ దీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డాడు.

2

పోలీసులు ఆపగానే కారు వదిలేసి పారిపోయాడు.

4

స్టేషన్ కి వెళ్లి ఫైన్ కట్టి కారు తీసుకున్నాడు.

అమర్ దీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు

Drunk & Drive : తాగి డ్రైవ్ చేయడం చట్ట ప్రకారం తప్పు. అది యాక్సిడెంట్స్ కి కారణం అవుతుంది కూడా. డ్రంక్ & డ్రైవ్ కేసులు రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. అందుకే పోలీసులు సైతం దీనిపై దృష్టి పెట్టారు. హైదరాబాద్ లాంటి సిటీలలో రెగ్యులర్ గా డ్రంక్ & డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు. తాజాగా ఓ నటుడు తన కెరీర్ ఆరంభంలో డ్రంక్ & డ్రైవ్ టెస్ట్ లో ఆపితే కార్ వదిలేసి పారిపోయానని అప్పుడు జరిగిన సంఘటన గురించి చెప్పాడు.

షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టి సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు అమర్ దీప్. బిగ్ బాస్ లో పాల్గొని మరింత వైరల్ అయ్యాడు. ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమర్ దీప్ ఈ విషయాన్ని తెలిపాడు.

పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం

అమర్ దీప్ మాట్లాడుతూ..నా కెరీర్ మొదట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాను. నేను తాగి కార్ లో వెళ్తున్నాను. పోలీసులు పట్టుకున్నారు. దిగి పక్కన నించున్నాను. అప్పటికి నాకు అంత ఫేమ్ లేదు. ఏదో చిన్న చిన్నవి చేసుకుంటున్నాను నటుడిగా. అప్పుడే ఆ డ్రంక్ & డ్రైవ్ దగ్గరకు మీడియా వాళ్ళు వచ్చారు. మీడియాకు కనపడకూడదు అని కార్ అక్కడే వదిలేసి సైలెంట్ గా పారిపోయాను.

తర్వాత పరిణామాలు

నెక్స్ట్ డే మార్నింగ్ పోలీసులు ఆ కార్ నెంబర్ తో నా ఫోన్ నెంబర్ పట్టుకొని కాల్ చేసారు. నేను మర్చిపోయి నడుచుకుంటూ వచ్చేసాను సర్, నైట్ మా ఇంట్లో బదులు పక్కింట్లో పడుకున్నాను సర్, వాళ్ళు ఇప్పుడే లేపి పంపించారు, నాకేం గుర్తులేదు అని వాళ్లకు కొన్ని కథలు చెప్పి స్టేషన్ కి వెళ్లి ఫైన్ కట్టి కార్ తెచ్చుకున్నాను అని తెలిపాడు. ఆ తర్వాత ఇంకెప్పుడు తాగి డ్రైవ్ చేయలేదని, ఒకవేళ తాగితే డ్రైవ్ చేయడానికి పక్కన ఎవరో ఒకరు ఉంటారని చెప్పాడు అమర్ దీప్.

చివరకు అమర్ దీప్ పోలీసులకు లొంగి ఫైన్ కట్టాడు. ఈ ఘటన తర్వాత తాగి డ్రైవ్ చేయడం మానేశానని ఆయన చెప్పుకొచ్చాడు. ఇది ఒక హెచ్చరిక కథగా మిగిలింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.